Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc653596ae-9160-4de7-9bb3-5565bef4554b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc653596ae-9160-4de7-9bb3-5565bef4554b-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పూర్తిస్థాయి షెడ్యూల్ కూడా విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే. షెడ్యూల్ నేపథ్యంలో ఇక ఎప్పుడు ఏ ప్రత్యర్థిని ఎదుర్కోబోతున్నాము అనే విషయంపై అన్ని టీమ్స్ కి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే తమ మ్యాచ్లకు అనుగుణంగా అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్ అన్ని టీమ్స్. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే జట్టు విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాయ్. Icc{#}Ben Stokes;England;Cricket;World Cup;Indiaక్రికెట్ బోర్డు విజ్ఞప్తితో.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న బెన్ స్టోక్స్?క్రికెట్ బోర్డు విజ్ఞప్తితో.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న బెన్ స్టోక్స్?Icc{#}Ben Stokes;England;Cricket;World Cup;IndiaTue, 15 Aug 2023 15:50:00 GMTఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పూర్తిస్థాయి షెడ్యూల్ కూడా విడుదల చేసింది అన్న విషయం తెలిసిందే. షెడ్యూల్ నేపథ్యంలో ఇక ఎప్పుడు ఏ ప్రత్యర్థిని ఎదుర్కోబోతున్నాము  అనే విషయంపై అన్ని టీమ్స్ కి కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే తమ మ్యాచ్లకు అనుగుణంగా అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్ అన్ని టీమ్స్. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసే జట్టు విషయంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాయ్.


 ఈ క్రమంలోనే అటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకి ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇంగ్లాండ్ జట్టులో స్టార్ ప్లేయర్గా టెస్ట్ ఫార్మాట్ కి కెప్టెన్ గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్ వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక అతని రిటైర్మెంట్ ని అటు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా ఆమోదించింది. కానీ ఇప్పుడు బెన్ స్టోక్స్ లాంటి స్టార్ ప్లేయర్ని ఇక వన్డే వరల్డ్ కప్ కోసం బరిలోకి దింపబోయే జట్టులో భాగం చేయాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మంతనాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే వన్డే ఫార్మాట్ కి బెన్ స్టోక్స్ ప్రకటించిన రిటైర్మెంట్లు వెనక్కి తీసుకునేలా అతనితో చర్చలు కూడా మొదలు పెట్టింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు.


 ఈ క్రమంలోనే రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవడానికి ఈ స్టార్ ప్లేయర్ ఒప్పుకుంటాడా లేదా అన్నది కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ ఏడాది భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో బెన్ స్టోక్స్ పాల్గొనడం పై స్పష్టత వచ్చింది. వన్డే ఫార్మాట్ రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వన్డే జట్టుకు కోచ్గా ఉన్న మాథ్యూ మాట్  కెప్టెన్ బట్లర్ బెన్ స్టోక్స్ తో జరిపిన చర్చలు సఫలం అయ్యాయ్యాయట. ఈ ఏడాది జరిగే వరల్డ్ కప్ ఆడేందుకు అంగీకరించిన బెన్ స్టోక్స్ ఇక తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకునే ప్రకటనను ఏ క్షణంలోనైనా చేసే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. అయితే ఇక వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్కు మాత్రం అతను దూరంగా ఉంటాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బికినీ అందాలతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>