DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan01a5d81b-a726-427f-8958-7923cf5a847d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/pawan01a5d81b-a726-427f-8958-7923cf5a847d-415x250-IndiaHerald.jpgపవన్ కల్యాణ్ మంచి కాన్సెప్ట్ లు తీసుకుని ముందుకు వెళితే ఆయన చేయలేని పని ఏదీ లేదు. పవన్ తో ఓ లారీ డ్రైవర్ మాట్లాడారు. పబ్లిక్ కు తెలియని విషయం ఏమిటంటే తెలంగాణలో ఎలక్ట్రానిక్ వాహానాలను ట్యాక్స్ మినహాయింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం లేదు. ఆంధ్రలో లైఫ్ ట్యాక్స్ పెట్టారు. అయితే ఏ మాత్రం పొల్యూషన్ రానటువంటి ఎలక్ట్రానిక్ వాహానాలకు కూడా లైఫ్ ట్యాక్స్ వేయడం దారుణమని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ట్యాక్స్ అనేది పొల్యూషన్ కంట్రోల్ కోసం చెట్లను పెంచేందుకు వేస్తున్నారు. తమిళనాడులో 200, తPAWAN{#}Driver;pollution;Pawan Kalyan;Andhra Pradesh;Party;central government;Governmentజోరు పెంచిన పవన్‌.. జగన్‌కు కష్టమేనా?జోరు పెంచిన పవన్‌.. జగన్‌కు కష్టమేనా?PAWAN{#}Driver;pollution;Pawan Kalyan;Andhra Pradesh;Party;central government;GovernmentMon, 14 Aug 2023 13:00:00 GMTపవన్ కల్యాణ్ మంచి కాన్సెప్ట్ లు తీసుకుని ముందుకు వెళితే ఆయన చేయలేని పని ఏదీ లేదు. పవన్ తో ఓ లారీ డ్రైవర్ మాట్లాడారు. పబ్లిక్ కు తెలియని విషయం ఏమిటంటే తెలంగాణలో ఎలక్ట్రానిక్ వాహానాలను ట్యాక్స్ మినహాయింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం లేదు. ఆంధ్రలో లైఫ్ ట్యాక్స్ పెట్టారు. అయితే ఏ మాత్రం పొల్యూషన్ రానటువంటి ఎలక్ట్రానిక్ వాహానాలకు కూడా లైఫ్ ట్యాక్స్ వేయడం దారుణమని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


గ్రీన్ ట్యాక్స్ అనేది పొల్యూషన్ కంట్రోల్ కోసం చెట్లను పెంచేందుకు వేస్తున్నారు. తమిళనాడులో 200, తెలంగాణలో 500, ఆంధ్రప్రదేశ్ లో 6,600 ట్యాక్స్ వేస్తున్నారని పవన్ కల్యాణ్ తో ఓ లారీ డ్రైవర్ చెప్పడం దీనిపై సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఎవరైనా సరే ఇలాంటి తెలియని విషయాలను ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తుల దగ్గరకు తీసుకుపోగలగాలి. అలా తీసుకెళ్లినపుడు పవన్ లాంటి వ్యక్తి ప్రశ్నిస్తే దానిపై ఏదైనా సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ముందుకు వస్తారు.


అసలు ఎలక్ట్రానిక్ వెహికల్స్ కు లైఫ్ ట్యాక్స్ వేయడం ఏంటి? తెలంగాణలో ఎందుకు వేయడం లేదు. మరి ఆంధ్రలో ఎందుకు వేస్తున్నారు. గ్రీన్ ట్యాక్స్ బాదుడు ఆంధ్రలో ఎందుకు ఎక్కువ ఉంది. దీనిపై ఇఫ్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రశ్నించిన పాపాన పోలేదు. ఎందుకిలా చేస్తున్నారు ఇది సరైనది కాదని సామాన్యుల నడ్డి విరవడమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


దేశంలో వాహానాల కాలుష్యం తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని ఎలక్ట్రానిక్ వెహికల్స్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. ఆ రంగాన్ని ప్రోత్సహించేందుకు తోడ్పాటునందిస్తోంది. మరి ఇలాంటి సమయంలో కొన్ని రాష్ట్రాల్లో లైఫ్ ట్యాక్స్ వేయడం, మరికొన్ని చోట్ల అది లేకపోవడం వాహనదారులను ఇబ్బందికి గురి చేయడమే. పూర్తిగా లైఫ్ ట్యాక్స్ తీసేయాలని వాహనదారులు కోరుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రానాకే కోపం తెప్పించిన హీరోయిన్ ఎవరు..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>