PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vidadala-rajini16ced782-b30b-41e6-9d1c-4604cefe03d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vidadala-rajini16ced782-b30b-41e6-9d1c-4604cefe03d8-415x250-IndiaHerald.jpgప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాన్ని కలిగించాలని మొదలైన ఆసుపత్రి సరైన శ్రద్ధ చూపకపోవడంతో శిధిలమైపోయిన పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సొంత జిల్లాలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఒక ప్రభుత్వ హాస్పిటల్ మరుగున పడిపోయిన పరిస్థితి ఏర్పడడంతో ఆ హాస్పిటల్ వార్తల్లో నిలిచింది. గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామీణ వైద్య ఆరోగ్య కేంద్రంలో గతంలో 53 మంది ఉద్యోగులు ఉండేవారని తెలుస్తుంది. ఆ హాస్పిటల్లో వైద్య అధికారులతో పాటు విద్యార్థులు కూడా నివాసం ఉండేవారట. 24 గంటలు ఆసుపత్రి పేVIDADALA RAJINI{#}Guntur;students;Thadikonda;House;Ministerమంత్రి విడదల రజిని సొంత ఇలాకాలా మరీ ఇలాగా?మంత్రి విడదల రజిని సొంత ఇలాకాలా మరీ ఇలాగా?VIDADALA RAJINI{#}Guntur;students;Thadikonda;House;MinisterMon, 14 Aug 2023 07:00:00 GMTప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాన్ని కలిగించాలని మొదలైన ఆసుపత్రి సరైన శ్రద్ధ చూపకపోవడంతో శిధిలమైపోయిన పరిస్థితి ఏర్పడింది. సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సొంత జిల్లాలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించబడిన ఒక ప్రభుత్వ హాస్పిటల్ మరుగున పడిపోయిన పరిస్థితి ఏర్పడడంతో ఆ హాస్పిటల్ వార్తల్లో నిలిచింది. గుంటూరు జిల్లాలోని తాడికొండ గ్రామీణ వైద్య ఆరోగ్య కేంద్రంలో గతంలో 53 మంది ఉద్యోగులు ఉండేవారని తెలుస్తుంది. ఆ హాస్పిటల్లో వైద్య అధికారులతో పాటు విద్యార్థులు కూడా నివాసం ఉండేవారట.


24 గంటలు ఆసుపత్రి పేషెంట్లకు అందుబాటులో ఉండేది. పగలు, రాత్రి అని తేడా లేకుండా ఏ సమయంలోనైనా సరే జనాలు అక్కడికి వచ్చి వైద్యం చేయించుకునే వారట. అయితే ఇదంతా అక్కడ చెప్పుకో తగిన గతం. ఇప్పుడు  అక్కడ పరిస్థితి వేరు. ఇప్పుడు  ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో కేవలం పది మంది మాత్రమే ఉద్యోగులు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు అక్కడ. ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తవారిని నియమించక పోవడంతో ఆ ప్రభుత్వ ఆసుపత్రికి ఈ పరిస్థితి తలెత్తిందని తెలుస్తుంది.


అంతేకాకుండా ఎప్పటి నుండో మంజూరైన నాలుగు వైద్య అధికార పోస్టులను కూడా శాశ్వతంగా రద్దు చేశారు ఆ హాస్పిటల్ లో. దీంతో ప్రస్తుతం అక్కడ కేవలం  అవుట్ సోర్సింగ్  విధానంలోనే డాక్టర్లు పనిచేస్తున్న  పరిస్థితి ఏర్పడింది. రాత్రిపూట కూడా అక్కడ ఎటువంటి అధికారి ఉండడం లేదని తెలుస్తుంది. హౌస్ సర్జన్లు కూడా సాయంత్రానికే గుంటూరుకి వెళ్ళిపోతున్నారట.


కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ఈ హాస్పిటల్ లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించారట. పురుషులకు, స్త్రీలకు ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేశారు. అంతే కాకుండా సర్జరీలకు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఎంతో అధునాతనమైన సౌకర్యాలతో,  స్టేషనరీతో మొదలైన ఈ హాస్పిటల్ సరైన శ్రద్ధ లేకుండా పాడైపోతుంది. మంత్రి విడదల రజిని   ఇప్పుడైనా దీనిపై శ్రద్ధ చూపాలని అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ పై వార్తలు !

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>