EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modid7b5c6a5-2058-4107-9903-b17da3ab0cb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/modid7b5c6a5-2058-4107-9903-b17da3ab0cb1-415x250-IndiaHerald.jpgఢిల్లీలో అధికారుల మీద పర్యవేక్షణ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తింప జేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు గతంలో ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తమ చట్ట సభల్లో చేసిన చట్టాల ద్వారా తోసిరాజని ఒక కమిటీని నియమించుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఢిల్లీ మీద పెత్తనం అంతా ఈ కమిటీదే. అది కూడా ఈ కమిటీలో ముఖ్య పాత్ర కేంద్రానిదే. ఈ విధంగా ఒక కమిటీని నియమించడం ద్వారా ఢిల్లీ అనేది మళ్లీ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అయ్యిందని కొంత మంది అంటున్న మాట. కేంద్రం నుండి మోడీ చేసిన ఈ బిల్లును రాMODI{#}Cheque;Gharshana;central government;Supreme Court;Bharatiya Janata Party;Delhiఇష్టానుసారం చేశారు.. మోడీకి సుప్రీంకోర్టులో షాక్‌?ఇష్టానుసారం చేశారు.. మోడీకి సుప్రీంకోర్టులో షాక్‌?MODI{#}Cheque;Gharshana;central government;Supreme Court;Bharatiya Janata Party;DelhiMon, 14 Aug 2023 23:00:00 GMTఢిల్లీలో అధికారుల మీద పర్యవేక్షణ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తింప జేస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు గతంలో ఇచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తమ చట్ట సభల్లో చేసిన చట్టాల ద్వారా తోసిరాజని ఒక కమిటీని  నియమించుకు వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఢిల్లీ మీద పెత్తనం అంతా ఈ కమిటీదే. అది కూడా ఈ కమిటీలో ముఖ్య పాత్ర కేంద్రానిదే.


ఈ విధంగా ఒక కమిటీని నియమించడం ద్వారా ఢిల్లీ అనేది మళ్లీ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అయ్యిందని కొంత మంది అంటున్న మాట. కేంద్రం నుండి మోడీ చేసిన ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదిస్తారా అనే సందేహం ఉండేది. రాష్ట్రపతి కూడా బిజెపి నుండి వచ్చిన వ్యక్తే కావడం ఇక్కడ ప్లస్ అయ్యింది. ఆల్రెడీ  మోడీ చేసిన ఈ బిల్లును రాష్ట్రపతి కూడా ఆమోదించారు.


దీంతో న్యాయ, కార్య నిర్వహక వ్యవస్థల మధ్య ఘర్షణ చెలరేగబోతుందని అంటున్నారు కొంత మంది సామాజిక వేత్తలు. కార్య నిర్వాహక వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంది కాబట్టి న్యాయ వ్యవస్థ తీర్పులో కేంద్రం జోక్యం చేసుకుంది అని అంటున్నారు. శాసన నిర్మాణ వ్యవస్థ ద్వారా కేంద్రం న్యాయ వ్యవస్థకు చెక్ పెట్టిందని కొందరు అంటున్నారు. మరి సుప్రీంకోర్టు రాష్ట్రపతి ఉత్తర్వులు కాబట్టి సరే అంటుందో లేదో చూడాలి.


లేదంటే గతంలో రాష్ట్రపతి సంతకం చేసిన కొలీజియన్ వ్యవస్థ బిల్లును కూడా సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మోడీ చేసిన ఈ బిల్లును కూడా కొట్టేస్తుందేమో చూడాలి. చట్టం ఎవరికీ చుట్టం కాదు. చట్టం, న్యాయం దృష్టిలో ఎంత దేశాధిపతులైనా ఒకటే. న్యాయ వ్యవస్థకు చిన్న పెద్ద అనే తేడా ఉండదు. ఈ విషయం తెలిసిన మోడీ లాంటి అగ్ర నాయకులు, దేశాధిపతులు కూడా చట్టం ఆధీనంలోనే ఉండాలి కానీ చట్టాన్ని కూడా   తమ అధికారం తో శాసించకూడదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లో దుస్తులలో పరువాల విందు చేస్తున్న నోరా ఫతేహి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>