PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-cm-kcr-has-no-right-to-celebrate-formation-day9da8c6a7-3df5-4f2c-9e57-042a65da5335-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-cm-kcr-has-no-right-to-celebrate-formation-day9da8c6a7-3df5-4f2c-9e57-042a65da5335-415x250-IndiaHerald.jpgషర్మిలను కర్నాటక నుండి రాజ్యసభకు పంపటానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందట. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు కూడా అధిష్టానం సానుకూలంగా ఉందని పార్టీవర్గాలు చెప్పాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు షర్మిల కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మొదట్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది. ys sharmila congress telangana{#}KCR;revanth;Andhra Pradesh;Revanth Reddy;Khammam;Sharmila;Karnataka;Party;Congress;Assemblyహైదరాబాద్ : షర్మిల విషయం ఫైనలైపోయిందా ?హైదరాబాద్ : షర్మిల విషయం ఫైనలైపోయిందా ?ys sharmila congress telangana{#}KCR;revanth;Andhra Pradesh;Revanth Reddy;Khammam;Sharmila;Karnataka;Party;Congress;AssemblyMon, 14 Aug 2023 09:00:00 GMT


వైఎస్ షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయ్యేందుకు ముహూర్తం ఒకటే తరువాయి. మిగిలిన విషయాలన్నీ దాదాపు ఫైనల్ అయిపోయినట్లే అని సమాచారం. షర్మిల కాంగ్రెస్ లో చేరితో హోదా ఏమిటి ? ఎక్కడినుండి పోటీచేస్తారు ? అన్న విషయాలు మాత్రమే ఇంకా ఫైనల్ కాలేదని ఇది ఫైనల్ అయిపోతే విలీనానికి ముహూర్తం రెడీ అయినట్లే అని నాలుగురోజుల క్రితం అన్నారు. అయితే తాజాగా ఆ రెండుపాయింట్లు కూడా డిసైడ్ అయిపోయాయట.





షర్మిలను  కర్నాటక నుండి రాజ్యసభకు పంపటానికి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించిందట. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు కూడా అధిష్టానం సానుకూలంగా ఉందని పార్టీవర్గాలు చెప్పాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు షర్మిల కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. మొదట్లో ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీగా పోటీచేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరిగింది.





అయితే సీమాంధ్రకు చెందిన షర్మిలను తెలంగాణాలో పోటీచేయిస్తే కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగే అవకాశాలున్నాయని తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదటినుండి చెబుతునే ఉన్నారు. షర్మిల పార్టీని  కాంగ్రెస్ లో విలీనం చేసుకుని ఏపీ రాజకీయాలకు పరిమితం చేయాలని రేవంత్ మొదటినుండి సూచిస్తున్నారు. తెలంగాణాలో షర్మిల యాక్టివ్ అయితే దీన్ని కేసీయార్ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశముందని రేవంత్ అండ్ కో పదేపదే ప్రస్తావిస్తున్నారు. వీళ్ళ వాదనతో పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించిందట.




అందుకనే ప్రధాన కార్యదర్శి హోదాలో ఏపీ బాధ్యతలిస్తే ఎవరికీ ఎలాంటి సమస్య ఉండదని అధిష్టానం చేసిన ప్రతిపాదనకు షర్మిల కూడా సానుకూలంగానే స్పందించారట. ఢిల్లీలో ఈ విషయాలన్నీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో షర్మిల ఖరారు చేసుకున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. అన్నీ సెట్టయిపోయింది కాబట్టి వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ముహూర్తం పెట్టుకోవటం ఒకటే మిగిలింది. ఫైనల్ గా ఒకసారి సోనియా, రాహుల్, ప్రియాంకగాంధిలతో షర్మిల భేటీ అయిన తర్వాత విలీనం ప్రకటన చేస్తారని అనుకుంటున్నారు. మరా ముహూర్తం ఎప్పుడొస్తుందో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రానాకే కోపం తెప్పించిన హీరోయిన్ ఎవరు..!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>