Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hot-rashmika-mandannas-red-look-will-leave-you-gasping-for-breathbd8651a7-2f2b-47a3-b7ad-be49322c2c2f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hot-rashmika-mandannas-red-look-will-leave-you-gasping-for-breathbd8651a7-2f2b-47a3-b7ad-be49322c2c2f-415x250-IndiaHerald.jpgకన్నడ భామ రష్మిక మందన్న తెలుగు సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకోగా ఈ పాపులారిటీతో హిందీ తమిళ అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తో దూసుకెళ్తున్న రష్మిక తమిళంలో మాత్రం ఒకటి రెండు సినిమాలతో సరి పెట్టుకుంది. అయితే అక్కడ సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అమ్మడికి లక్కీ ఆఫర్ వచ్చింది. విలక్షణ నటుడు ధనుష్ హీరోగాRashmika Mandanna{#}bhama;sekhar;dhanush;kushi;Kushi;Hindi;rashmika mandanna;Joseph Vijay;Kollywood;Tamil;Tollywood;Telugu;Cinema;Indian;Heroineరష్మికకు నిజంగానే ఇది గోల్డెన్ ఛాన్స్..!రష్మికకు నిజంగానే ఇది గోల్డెన్ ఛాన్స్..!Rashmika Mandanna{#}bhama;sekhar;dhanush;kushi;Kushi;Hindi;rashmika mandanna;Joseph Vijay;Kollywood;Tamil;Tollywood;Telugu;Cinema;Indian;HeroineMon, 14 Aug 2023 22:22:00 GMTకన్నడ భామ రష్మిక మందన్న తెలుగు సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకోగా ఈ పాపులారిటీతో హిందీ తమిళ అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తో దూసుకెళ్తున్న రష్మిక తమిళంలో మాత్రం ఒకటి రెండు సినిమాలతో సరి పెట్టుకుంది. అయితే అక్కడ సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అమ్మడికి లక్కీ ఆఫర్ వచ్చింది. విలక్షణ నటుడు ధనుష్ హీరోగా చేస్తున్న సినిమాలో రష్మికకు అవకాశం వచ్చింది.

ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న సినిమాలో రష్మికని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అవకాశం దక్కినందుకు రష్మిక చాలా ఖుషి అవుతుంది. సౌత్ ఇండియన్ ఫైన్ యాక్టర్స్ లో ఒకరైన ధనుష్ తో పనిచేయాలని ఏ హీరోయిన్ అయినా అనుకుంటుంది. తెలుగు సినిమాల మీద దృష్టి పెట్టి కోలీవుడ్ ని నెగ్లెక్ట్ చేసిన రష్మిక ఇక మీదత వరుస తమిళ సినిమాలు చేయాలని చూస్తుంది.

ధనుష్ సినిమా తర్వాత అమ్మడికి అక్కడ నుంచి వరుస క్రేజీ ఆఫర్లు వస్తాయని చెప్పొచ్చు. రష్మిక కూడా ఎక్కడ ఎలాంటి అవకాశం వచ్చినా సరే చేయాలని ఫిక్స్ అయ్యింది. కోలీవుడ్ లో ఆల్రెడీ కార్తీ, విజయ్ లతో జత కట్టిన రష్మిక ధనుష్ తో జత కడుతుంది. ఈ సినిమా తర్వాత రష్మిక తమిళంలో బిజీ హీరోయిన్ అవుతుందని చెప్పొచ్చు. హిందీలో కూడా రష్మిక కు పలు అవకాశాలు వస్తున్నాయి. 

ఇన్నాళ్లు టాలీవుడ్ మీద ఫోకస్ చేసిన రష్మిక తమిళంలో స్టార్ క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. హిందీలో తన ప్రయత్నాలేవి వర్క్ అవుట్ కాకపోయే సరికి సౌత్ మీద మళ్లీ దృష్టి పెట్టిన రష్మిక ఇక్కడ తన క్రేజ్ డబుల్ చేసుకోవాలనే ప్లానింగ్ లో ఉంది. నితిన్ సినిమా నుంచి ఏవో కారణాల వల్ల బయటకు వచ్చిన రష్మిక ధనుష్ సినిమాతో మరోసారి సత్తా చాటాలని ఫిక్స్ అయ్యింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లో దుస్తులలో పరువాల విందు చేస్తున్న నోరా ఫతేహి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>