Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr40176104-3728-4e0a-89a0-bb8c38c77215-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr40176104-3728-4e0a-89a0-bb8c38c77215-415x250-IndiaHerald.jpgమొన్నటీ వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మాత్రమే కొనసాగిన ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందించబడి ప్రేక్షకుల ముందుకు వచ్చి వరల్డ్ వైడ్ హిట్ సాధించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఏకంగా తన నటనతో ఎన్టీఆర్ ప్రపంచ సినీ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధుల్ని చేసి తన అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే ఇలా గ్లోబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించిన తర్వాత.. ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అని చెప్పాలి. ఆచార్Ntr{#}Janhvi Kapoor;Jr NTR;koratala siva;Sridevi Kapoor;NTR;Heroine;ramya krishnan;Industry;bollywood;Telugu;Cinemaఎన్టీఆర్ దేవర మూవీలో.. తారక్ కు అత్తగా నటించనున్న హీరోయిన్?ఎన్టీఆర్ దేవర మూవీలో.. తారక్ కు అత్తగా నటించనున్న హీరోయిన్?Ntr{#}Janhvi Kapoor;Jr NTR;koratala siva;Sridevi Kapoor;NTR;Heroine;ramya krishnan;Industry;bollywood;Telugu;CinemaSun, 13 Aug 2023 07:45:00 GMTమొన్నటీ వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా మాత్రమే కొనసాగిన ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందించబడి ప్రేక్షకుల ముందుకు వచ్చి వరల్డ్ వైడ్ హిట్ సాధించిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఏకంగా తన నటనతో ఎన్టీఆర్ ప్రపంచ సినీ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధుల్ని చేసి తన అభిమానులుగా మార్చుకున్నాడు. అయితే ఇలా గ్లోబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించిన తర్వాత.. ఎన్టీఆర్ చేస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది అని చెప్పాలి.



 ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత ఎలాగైనా ఇండస్ట్రీ హీట్ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల శివ ఇక ఎన్టీఆర్ కోసం ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేసుకుని ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా తీసేందుకు ఆహర్నిశలు కష్టపడుతున్నారు. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తూ ఉంది. తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి. అయితే ఎన్టీఆర్ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే జాన్వి కపూర్ కన్ఫార్మ్ కాగా రెండో హీరోయిన్ ఎవరు అన్నది తెలియాల్సి ఉంది.


 అయితే ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అత్త పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుందట. అయితే ఈ పాత్ర కోసం ఏకంగా కొరటాల శివ ఒక హీరోయిన్ ను రంగంలోకి దింపబోతున్నాడట. ఆ హీరోయిన్ ఎవరో కాదు రమ్యకృష్ణ. ఎన్టీఆర్ రమ్యకృష్ణ కలిసి ఇప్పటికే నా అల్లుడు సినిమాలో అత్త అల్లుళ్ల పాత్రలో నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు దేవర సినిమాలో రెండోసారి అత్త అల్లుళ్ల పాత్రలో కనిపించబోతున్నారు. ఇంటర్వెల్లో ఇక ఈ సినిమా కథ మలుపు తిరుగుతుందని.. అప్పుడే రమ్యకృష్ణ ఎంట్రీ కూడా ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఇక ఇది ఎంత నిజమో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"గాండేవదార అర్జున" మూవీ ప్రమోషన్లకు హీట్ ఎక్కిస్తున్న సాక్షి వైద్య..!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>