EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagand7ae28c4-7dd6-498b-a43e-e430675dc7fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagand7ae28c4-7dd6-498b-a43e-e430675dc7fe-415x250-IndiaHerald.jpgవచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవాలని వైసీపీ అన్ని శక్తి యుక్తులను కూడగడుతోంది. ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ మెజారిటీ పెంచే దిశగా పార్టీ శ్రేణులు పనిచేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, జేసీఎస్ కోర్డినేటర్లతో స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీ వ్యూహాలను చర్చించారు. ఓటర్ల లిస్ట్ ఫైనలైజేషన్ జరుగుతోంది కాబట్టి పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, జేసీఎస్ కోఆర్డినేటJAGAN{#}Alla Ramakrishna Reddy;Shakti;CBN;CM;Party;Jagan;YCPఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?JAGAN{#}Alla Ramakrishna Reddy;Shakti;CBN;CM;Party;Jagan;YCPSun, 13 Aug 2023 07:00:00 GMTవచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోవాలని వైసీపీ అన్ని శక్తి యుక్తులను కూడగడుతోంది. ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ మెజారిటీ పెంచే దిశగా పార్టీ శ్రేణులు పనిచేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, జేసీఎస్ కోర్డినేటర్లతో స‌జ్జల రామ‌కృష్ణారెడ్డి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీ వ్యూహాలను చర్చించారు.


ఓటర్ల లిస్ట్ ఫైనలైజేషన్ జరుగుతోంది కాబట్టి పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పరిశీలకులు, జేసీఎస్ కోఆర్డినేటర్లు సమన్వయం చేసుకుంటూ  ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని పనిచేయాలని వైసీపీ భావిస్తోంది.  ముఖ్యంగా అర్హులైన ఓటర్లను గుర్తించి వారికి ఓటు హక్కు కల్పించేందుకు.. తమకు అనుకూలమైన ఓట్లు తప్పనిసరిగా నమోదు అయ్యేట్లు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.


ఓటర్ల లిస్ట్ ఫైనలైజేషన్ లో భాగంగా ఇంటింటికి తిరిగే కార్యక్రమం కాబట్టి బూత్ లెవల్ ఏజంట్స్ ద్వారా తగిన కసరత్తు పూర్తి చేయాలని వైసీపీ ప్లాన్‌ చేస్తోంది. అదే విధంగా చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపు 60 లక్షలకు పైగా దొంగఓట్లను చేర్పించారని వైసీపీ భావిస్తోంది. వాటిని గుర్తించి తొలగించే విధంగా ప్రజాస్వామ్య పద్ధ‌తిలో ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని వైసీపీ ప్లాన్‌ చేస్తోంది.  


ఎన్నికలకు సంబంధించి ఇది కీలకమైన అంశం కాబట్టి పూర్తి స్థాయిలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని వైసీపీ పట్టుదలగా ఉంది. ఇదే అంశాన్ని వైయస్ జగన్ ఇటీవల నిర్వహించిన సమావేశంలో పరిశీలకులు, శాసనసభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు కూడా గట్టిగా చెప్పారు. తాజాగా జగన్ పార్టీ పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో ఏ విధంగా వ్యవహరించాలో చెప్పారు. పరిశీలకులు వారికి కేటాయించిన నియోజకవర్గంలో బాధ్యతతో పనిచేయాలని అత్యధిక సమయం కేటాయించాలని సీఎం జగన్‌ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. శాసన సభ్యులు, రీజనల్ కోఆర్డినేటర్లు సమన్వయంతో నియోజకవర్గాలలో అందరూ ఐకమత్యంతో పనిచేసేలా చూడాలని జగన్‌ పార్టీ నేతలకు సూచిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"గాండేవదార అర్జున" మూవీ ప్రమోషన్లకు హీట్ ఎక్కిస్తున్న సాక్షి వైద్య..!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>