Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee02aead9-6ecd-40ee-8a25-80a2c13760f1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylee02aead9-6ecd-40ee-8a25-80a2c13760f1-415x250-IndiaHerald.jpgవెంకీ మామ 75వ మైలురాయికి చేరుకున్నాడు. హిట్‌ సిరీస్‌తో క్రైమ్‌ థ్రిల్లర్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సైలేష్‌ కొలను దర్శకత్వంలో తన ప్రతిష్టాత్మక 75వ సినిమా చేస్తున్నాడు‌. సైంధవ్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్‌ వీక్‌ను లాక్‌ చేసకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ గట్రా సినిమాపై వీర లెవల్లో అంచనాలు పెంచేశాయి. పైగా చాలా కాలం తర్వాత వెంకీ నుంచి యాక్షన్‌ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకులలో సైతం తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్రయూనిట్‌ ఈ సినిమాకు సంబంధింsocialstars lifestyle{#}niharika konidela;Santhossh Jagarlapudi;Venkatesh;Music;India;Cinemaక్రేజీ అప్డేట్ ఇచ్చిన సైందవ్ మూవీ టీం.....!!క్రేజీ అప్డేట్ ఇచ్చిన సైందవ్ మూవీ టీం.....!!socialstars lifestyle{#}niharika konidela;Santhossh Jagarlapudi;Venkatesh;Music;India;CinemaSun, 13 Aug 2023 17:21:00 GMTవెంకీ మామ 75వ మైలురాయికి చేరుకున్నాడు. హిట్‌ సిరీస్‌తో క్రైమ్‌ థ్రిల్లర్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సైలేష్‌ కొలను దర్శకత్వంలో తన ప్రతిష్టాత్మక 75వ సినిమా చేస్తున్నాడు‌. సైంధవ్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్మస్‌ వీక్‌ను లాక్‌ చేసకుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, గ్లింప్స్‌ గట్రా సినిమాపై వీర లెవల్లో అంచనాలు పెంచేశాయి. పైగా చాలా కాలం తర్వాత వెంకీ నుంచి యాక్షన్‌ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకులలో సైతం తీవ్ర ఆసక్తి నెలకొంది. తాజాగా చిత్రయూనిట్‌ ఈ సినిమాకు సంబంధించిన మేజర్‌ అప్‌డేట్‌ను ప్రకటించింది.

తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్‌ చేశారు. 16 రోజులు జరిగిన ఈ షెడ్యూల్‌లో ఎనిమిది మంది కీలక నటులతో ఎమోషనల్‌ క్లైమాక్స్‌ ఎపిసోడ్‌ను చిత్రీకరించినట్లు మేకర్స్‌ వెల్లడించారు. కఠినమైన వాతావరణ పరిస్థుతులు సైతం సైంధవ్‌ షూటింగ్‌ను ఆపలేకపోయాయని చెప్పుకొచ్చారు. పాన్‌ ఇండియా లెవల్లో రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్‌కు జోడీగా శ్రద్దా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియాలు నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ నవాజుద్దిన్‌ సిద్ధిఖీ విలన్‌ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన నవాజుద్దిన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇక ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో చాలా సర్‌ప్రైజ్‌లు ఉండబోతున్నాయని ఇన్ సైడ్ టాక్. ముఖ్యంగా ఈ సినిమాలో బ్లాక్‌ మేజిక్‌ కీలక పాత్ర పోషించనుందట. ఇదే కాన్సెప్ట్‌కు బలమైన డాటర్ సెంటిమెంట్‌ను జోడించి ఆసక్తికర కథగా సైలేష్ ఈ చిత్రాన్ని మలిచాడని తెలుస్తుంది. హిట్‌ సిరీస్‌తో థ్రిల్లర్‌ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అని పేరు పొందిన సైలేష్‌.. ఈ సినిమాతో అసలు సిసలైన థ్రిల్లర్‌ అంటే ఏంటో చూపించబోతున్నాడట. ముఖ్యంగా జంప్‌ స్కేర్‌ సీన్స్‌ పుష్కలంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నిహారిక ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌ రూపొందిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమ్మాయి లవ్ ఒప్పుకోలేదని.. అతను ఏం చేసాడో తెలుసా?

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>