PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-revant-telangana1995f7a3-31b2-4942-83cc-5c5001dc2b9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-revant-telangana1995f7a3-31b2-4942-83cc-5c5001dc2b9f-415x250-IndiaHerald.jpgచంద్రబాబుకు సంబంధించి రేవంత్ పై రెండు ముద్రలున్నాయి. మొదటిదేమో బినామీ అని. ఇక రెండో ముద్రేమో నమ్మకమైన మద్దతుదారుడని. చంద్రబాబుకు రేవంత్ శిష్యుడా లేకపోతే సహచరుడా అన్నది ముఖ్యంకాదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నమ్మకస్తుల్లో రేవంత్ కూడా ఒక్కళ్ళన్నది వాస్తవం. ఈ విషయం ఓటుకునోటు విషయంలోనే బయటపడింది. ఓటుకునోటు వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడి తెరమీద అందరికీ కనబడింది రేవంత్ మాత్రమే. అయితే తెరవెనుక అసలు సూత్రదారి చంద్రబాబే అని అందరికీ తెలుసు. chandrababu revant telangana{#}revanth;Congress;Anti-Corruption Bureau;Yevaru;CBNహైదరాబాద్ : చంద్రబాబు నుండి దూరంగా జరగాలనుకుంటున్నారా ?హైదరాబాద్ : చంద్రబాబు నుండి దూరంగా జరగాలనుకుంటున్నారా ?chandrababu revant telangana{#}revanth;Congress;Anti-Corruption Bureau;Yevaru;CBNSun, 13 Aug 2023 09:00:00 GMT



తెలంగాణా పీసీసీ అధ్యక్షుడు ఇన్నిసంవత్సరాలకు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అదేమిటంటే తాను చంద్రబాబునాయుడు శిష్యుడిని కాదని, సహచరుడిని మాత్రమే అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలకు ఈ క్లారిటి ఇవ్వాలని రేవంత్ కు ఎందుకు అనిపించిందో తెలీటంలేదు. బహుశా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు తనకు ఉన్న బంధాన్ని ప్రత్యర్ధులు మళ్ళీ తెరమీదకు తెస్తారని అనుమానించినట్లున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా తానే చంద్రబాబు, తాను సహచరులమని క్లారిటి ఇచ్చారు.





చంద్రబాబుకు సంబంధించి రేవంత్ పై రెండు ముద్రలున్నాయి. మొదటిదేమో బినామీ అని. ఇక రెండో ముద్రేమో నమ్మకమైన మద్దతుదారుడని. చంద్రబాబుకు రేవంత్ శిష్యుడా లేకపోతే సహచరుడా అన్నది ముఖ్యంకాదు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నమ్మకస్తుల్లో రేవంత్ కూడా ఒక్కళ్ళన్నది వాస్తవం. ఈ విషయం ఓటుకునోటు విషయంలోనే బయటపడింది. ఓటుకునోటు వ్యవహారంలో ఏసీబీకి పట్టుబడి తెరమీద అందరికీ కనబడింది రేవంత్ మాత్రమే. అయితే తెరవెనుక అసలు సూత్రదారి చంద్రబాబే అని అందరికీ తెలుసు.





ఎన్నిసార్లు ఏసీబీ విచారణ జరిగినా అసలు సూత్రదారుడు ఎవరన్న విషయాన్ని మాత్రం రేవంత్ బయటపెట్టలేదంటేనే చంద్రబాబుకు ఎంత నమ్మినబంటు అన్నవిషయం తెలిసిపోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం మరోటుంది. అదేమిటంటే రేవంత్ కాంగ్రెస్ లో చేరగానే చంద్రబాబు చొరవతోనే రేవంత్ కాంగ్రెస్ లో చేరినట్లు విపరీతమైన ప్రచారం జరిగింది. తర్వాత ప్రెసిడెంట్ అవ్వగానే చంద్రబాబు చెబితేనే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కు అధ్యక్ష పదవి ఇచ్చిందనే ప్రచారం అందరికీ తెలుసు.





చంద్రబాబుకు రేవంత్ బినామీ అని, రేవంత్, చంద్రబాబు మనిషన్న విషయం బయటవాళ్ళు కాదు పార్టీలోని సీనియర్లే చాలాసార్లు చెప్పారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నదే చంద్రబాబు ప్రయోజనాలను రక్షించటానికే అని పార్టీలోనే బాగా ప్రచారం జరుగుతోంది. కాబట్టి తాను చంద్రబాబు శిష్యుడిని కాను కేవలం సహచరుడిని మాత్రమే అని రేవంత్ ఎంత మొత్తుకున్నా ఎవరు నమ్మరు. ముమ్మాటికి చంద్రబాబుకు రేవంత్ నమ్మినబంటు, శిష్యుడనే అందరు ముద్రవేసేశారు. రేపటి ఎన్నికల్లో తనపై చంద్రబాబు ముద్ర ఉండకుండా రేవంత్ ముందుజాగ్రత్త పడుతున్నట్లు అనుమానంగా ఉంది. రేవంత్ మీదపడిన ముద్ర తుడిపేసుకుంటే పోతుందా ? 




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ బాద్షా కూతురు....!!

ఎన్నికల్లో గెలుపు కోసం జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ ఇదే?

బోడి వెధవ.. పవన్‌పై రోజా షాకింగ్‌ కామెంట్‌?

రష్యాలో భారత్‌ వ్యాపారాన్ని అడ్డుకుంటున్న అమెరికా? E

ఆ పార్టీతో పవన్‌ కల్యాణ్‌.. కెమిస్ట్రీ కుదిరేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>