EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanf7467e04-d6b2-4684-9d27-8cc40e13aa39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawanf7467e04-d6b2-4684-9d27-8cc40e13aa39-415x250-IndiaHerald.jpgజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖపట్నంలో తన పర్యటనను ప్రారంభించారు. ఆయన అక్కడ ప్రసంగిస్తూ సింహాచలం అప్పన్న సాక్షిగా తనకు వాలంటీర్ వ్యవస్థ మీద గాని, వాలంటీర్ల మీద గాని ఎటువంటి కోపం లేదని ఆయన చెప్పుకొచ్చారు. వాలంటీర్లు తనకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు అని ఆయన అన్నారు. వాలంటీర్లకు 5000 రూపాయల జీతం ఇస్తే సరిపోదని తన ఉద్దేశం అని, కావాలంటే తానే ఇంకొక ఐదు వేలు కలిపి ఇచ్చే మనిషినే కానీ, మీ ఉద్యోగాలు పోగొట్టే వాడిని కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక ప్రభుత్వ నడుPAWAN{#}Simhachalam;Godavari River;Telangana;Y. S. Rajasekhara Reddy;Party;Congress;kalyan;Vishakapatnam;Jagan;Houseజగన్‌పై పవన్‌ సంచలన ఆరోపణల వెనుక?జగన్‌పై పవన్‌ సంచలన ఆరోపణల వెనుక?PAWAN{#}Simhachalam;Godavari River;Telangana;Y. S. Rajasekhara Reddy;Party;Congress;kalyan;Vishakapatnam;Jagan;HouseSat, 12 Aug 2023 08:02:00 GMTజనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా విశాఖపట్నంలో తన పర్యటనను ప్రారంభించారు. ఆయన  అక్కడ ప్రసంగిస్తూ సింహాచలం అప్పన్న సాక్షిగా తనకు వాలంటీర్ వ్యవస్థ మీద గాని, వాలంటీర్ల మీద గాని ఎటువంటి కోపం లేదని ఆయన చెప్పుకొచ్చారు. వాలంటీర్లు తనకు అన్నదమ్ములు, అక్క చెల్లెలు అని ఆయన అన్నారు. వాలంటీర్లకు 5000 రూపాయల జీతం ఇస్తే సరిపోదని తన ఉద్దేశం అని, కావాలంటే తానే ఇంకొక ఐదు వేలు కలిపి ఇచ్చే మనిషినే కానీ, మీ ఉద్యోగాలు పోగొట్టే వాడిని కాదని ఆయన అన్నారు.


రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక ప్రభుత్వ నడుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి విముక్తి పొందాలని, విశాఖ జిల్లా కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి విముక్తి పొందాలని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు. జగన్ కు ఎంత సంపాదించినా సరిపోదని, జగన్ మీద ఒక కన్ను వేయకపోతే మనకు ముక్క కూడా మిగలదని ఆయన అన్నారు.


వైసిపి ఎమ్మెల్యేల ఫైల్స్ అన్నీ తన దగ్గర ఉన్నాయని, అవన్నీ తాను కేంద్రానికి సబ్మిట్ చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు‌. ఆయన తనకు కేంద్రం దగ్గరికి వెళ్లడానికి ఎప్పుడు అనుమతి ఉంటుందని, తనను వెయిట్ చేయించే అవకాశం లేదని ఆయన అన్నారు‌. జగన్మోహన్ రెడ్డికి నేనంటే ఏంటో చూపిస్తానని ఆయన అన్నారు‌. తెలంగాణలో ఇక్కడికి లాగా క్రైమ్ పాలిటిక్స్ ఉండవని, అసలు ప్రత్యేక తెలంగాణ  ఏర్పడింది జగన్ అరాచకాల వల్లనే అని ఆయన అన్నారు.


రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్న జగన్ పాలనను అంతమొందిద్దామని, రాజ్యాంగాన్ని ఫాలో అవ్వని ఈ ముఖ్య మంత్రిని గద్దె దింపే లక్ష్యంగా పని చేద్దామని ఆయన చెప్పుకొచ్చారు. కావాలంటే విశాఖలో కూడా తాను ఇల్లు తీసుకుంటానని ఆయన అన్నారు. డబ్బు ఇలా అడ్డగోలుగా ఇలాంటి నాయకుల దగ్గర ఉండిపోవడం వల్ల వాళ్లు మనల్ని శాసిస్తారని ఆయన అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా అందుకున్న టాప్ 5 మూవీస్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>