Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icfaac6392e-5eb8-4429-8f9e-da6fc0e9f673-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icfaac6392e-5eb8-4429-8f9e-da6fc0e9f673-415x250-IndiaHerald.jpgఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ నేపథ్యంలో అన్ని జట్లు కూడా వరల్డ్ కప్ కోసం సంసిద్ధం అవుతూ ఉన్నాయి. ఇక అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే కొన్ని టీమ్స్ కి మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. కొన్ని జట్లలో కీలక ప్లేయర్లు గాయం బారిన పడి దూరమవుతూ ఉన్నారు. దీIcf{#}Bangladesh;New Zealand;Bangladesh Cricket Board;Cricket;India;World Cupవరల్డ్ కప్ కి ముందు.. బంగ్లాదేశ్ జట్టుకి కొత్త కెప్టెన్.. ఎవరంటే?వరల్డ్ కప్ కి ముందు.. బంగ్లాదేశ్ జట్టుకి కొత్త కెప్టెన్.. ఎవరంటే?Icf{#}Bangladesh;New Zealand;Bangladesh Cricket Board;Cricket;India;World CupSat, 12 Aug 2023 08:15:00 GMTఈ ఏడాది  భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను  ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇప్పటికే విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ నేపథ్యంలో అన్ని జట్లు కూడా వరల్డ్ కప్ కోసం సంసిద్ధం అవుతూ ఉన్నాయి. ఇక అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగేందుకు ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే కొన్ని టీమ్స్ కి మాత్రం ఊహించని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. కొన్ని జట్లలో కీలక ప్లేయర్లు గాయం బారిన పడి దూరమవుతూ ఉన్నారు.

 దీంతో ప్రధాన ప్లేయర్లు లేకుండానే ఆయా జట్లు బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మరికొన్ని జట్లకు ఏకంగా కెప్టెన్లు దూరం అవుతూ ఉండడం గమనార్హం. బంగ్లాదేశ్ జట్టు పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది అని చెప్పాలి. పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇక అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్న సమయంలో ఇక ఆ జట్టు వన్డే కెప్టెన్ గా కొనసాగుతున్న తమిమ్ ఇక్బాల్  సంచలన నిర్ణయం తీసుకొని అందరికి షాక్ ఇచ్చాడు. ఏకంగా కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాను అంటూ ప్రకటించాడు. దీంతో వన్డే వరల్డ్ కప్ కి ముందు తమ జట్టుకి కొత్త కెప్టెన్ వెతుక్కోవాల్సిన తలనొప్పి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మొదలైంది.


 అయితే కొత్త కెప్టెన్ విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. జట్టులో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్న షకీబ్ అల్ హసన్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు కెప్టెన్సీ అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగనున్న న్యూజిలాండ్ సిరీస్ ఆసియా కప్ వన్డే వరల్డ్ కప్ కి షకిబ్ అల్ హసన్ కెప్టెన్గా వ్యవహరించినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ తెలిపాడు. కాగా ఈనెల చివర్లో ప్రారంభమై ఆసియా కప్ కి కూడా షాకిబ్ అల్ హసన్  సారధ్య బాధ్యతలను భుజాన వేసుకునే అవకాశం ఉంది. కాగా నేడు ఆసియా కప్ జట్టును ప్రకటించే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా అందుకున్న టాప్ 5 మూవీస్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>