PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/how-do-these-ideas-come-to-jagand42bd774-ad5c-4905-bfa0-3e0e8aebb715-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/how-do-these-ideas-come-to-jagand42bd774-ad5c-4905-bfa0-3e0e8aebb715-415x250-IndiaHerald.jpgఇక అధికారంలో ఉన్నపుడు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యంచేసిందే చంద్రబాబు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మొదట 9 ఏళ్ళు అసలు ప్రాజెక్టుల గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదు. తర్వాత ఐదేళ్ళు కూడా ప్రాజెక్టుల పేరుతో చాలా డ్రామాలాడారు. చేసిన పనులు తక్కువ చేయించుకున్న ప్రచారం చాలా ఎక్కువ. ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి పాల్పడినా ఎల్లోమీడియా ఒక్క వార్త కూడా రాయలేదు. అలాంటి వ్యక్తి ఇపుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో పర్యటిస్తున్నారు. jagan chandrababu pawan purandeswari{#}Daggubati Purandeswari;CBN;Jagan;YCP;Bharatiya Janata Party;CM;Reddy;Government;Janasena;Pawan Kalyanఅమరావతి : మూడు వైపుల నుండి కమ్ముకుంటున్నారా ?అమరావతి : మూడు వైపుల నుండి కమ్ముకుంటున్నారా ?jagan chandrababu pawan purandeswari{#}Daggubati Purandeswari;CBN;Jagan;YCP;Bharatiya Janata Party;CM;Reddy;Government;Janasena;Pawan KalyanSat, 12 Aug 2023 09:00:00 GMT



జగన్మోహన్ రెడ్డి విషయంలో ప్రతిపక్షాలు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది.  ప్రభుత్వాన్ని ఉక్కరిబిక్కిరి చేయటం కోసం ఒకేసమయంలో మూడువైపుల నుండి కమ్ముకుంటున్నట్లే అనిపిస్తోంది. ఒకవైపు సర్పంచులకు మద్దతుగా బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తం ఆందోళన జరిగింది. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు యుద్ధభేరి పేరుతో చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. ఇంకోవైపు వారాహియాత్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో టూర్ మొదలుపెట్టారు.





కార్యక్రమాలు వేర్వేరు అయినా టార్గెట్ మాత్రం జగనే అన్న విషయం స్పష్టం. విచిత్రం ఏమిటంటే పంచాయితీలను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేసిందని, పంచాయితీల నిధులను ప్రభుత్వం వాడుకుంటున్నదని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. ఈ ఆరోపణల్లో నిజముందని అనుకున్నా ఆ పద్దతి ఇపుడే కాదు చంద్రబాబు హయాంలో కూడా ఇలాగే జరిగింది.  మరపుడు పురందేశ్వరి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.





ఇక అధికారంలో ఉన్నపుడు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యంచేసిందే చంద్రబాబు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు మొదట 9 ఏళ్ళు అసలు ప్రాజెక్టుల గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదు. తర్వాత ఐదేళ్ళు కూడా ప్రాజెక్టుల పేరుతో చాలా డ్రామాలాడారు. చేసిన పనులు తక్కువ చేయించుకున్న ప్రచారం చాలా ఎక్కువ. ప్రాజెక్టుల పేరుతో భారీ అవినీతికి పాల్పడినా ఎల్లోమీడియా ఒక్క వార్త కూడా రాయలేదు. అలాంటి వ్యక్తి ఇపుడు ప్రాజెక్టుల సందర్శన పేరుతో పర్యటిస్తున్నారు.




ఫైనల్ గా పవన్ ఏమి మాట్లాడుతారో తనకే తెలీదు. కేంద్రంతో జగన్ను ఒక ఆటాడిస్తానంటారు, జగన్ అవినీతి చిట్టా అంతా కేంద్రం దగ్గర ఉందన్నారు. జగన్ నాయకుడు కాదు, సీఎం కాదు ఒక వ్యాపారి, మోసగాడని మండిపోతారు. ప్రాణాలకు తెగించే తాను రాజకీయాల్లోకి వచ్చానంటారు. తన ప్రాణాలకు వచ్చిన భయం ఏమిటో చెప్పమంటే  చెప్పరు. సంక్షేమ పథకాల్లో లేకపోతే అభివృద్ధిలో పలానా చోట అవినీతి జరిగిందని పవన్ చెప్పకుండా వేల కోట్ల రూపాయలు దోచేస్తున్నారన్న పాత వినిపిస్తుంటారు. పార్టీలు వేరైనా వీళ్ళముగ్గురు చెప్పేదేమిటంటే వచ్చేఎన్నికల్లో వైసీపీ గెలవకూడదని. గెలిస్తే రాష్ట్రాన్ని మరచిపోవచ్చంటున్నారు. వైసీపీ గెలిస్తే జనాలు మరచిపోవాల్సింది రాష్ట్రాన్ని మరచిపోయేది టీడీపీ, జనసేనను మాత్రమే.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>