Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ronaldo1218a89a-628f-49eb-b93d-f61b95de8a9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ronaldo1218a89a-628f-49eb-b93d-f61b95de8a9f-415x250-IndiaHerald.jpgపోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం పోర్చుగల్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా క్రిస్టియానో రోనాల్డోని అభిమానించేవారు కోట్లలోనే కనిపిస్తూ ఉంటారు. ఇక క్రిస్టియానో రోనాల్డో అటు పోర్చుగల్ దేశం తరఫున మాత్రమే కాదు అటు ఫ్రాంచైజీ లీగ్లలో కూడా అదరగొడుతూ తన అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ దూసుకుపోతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే కేవలం ఫుట్బాల్ ఆటలో లెజెండ్ గా ఎదగడమే కాదు అటు సోషల్ మీడియాలో పాపులారిRonaldo{#}VIRAT KOHLI;Portugal;Legend;Instagram;Indiaచరిత్ర సృష్టించిన రోనాల్డో.. ఇంస్టాగ్రామ్ లో ఒకే ఒక్కడు?చరిత్ర సృష్టించిన రోనాల్డో.. ఇంస్టాగ్రామ్ లో ఒకే ఒక్కడు?Ronaldo{#}VIRAT KOHLI;Portugal;Legend;Instagram;IndiaSat, 12 Aug 2023 07:40:00 GMTపోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం పోర్చుగల్ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా క్రిస్టియానో రోనాల్డోని అభిమానించేవారు కోట్లలోనే కనిపిస్తూ ఉంటారు. ఇక క్రిస్టియానో రోనాల్డో అటు పోర్చుగల్ దేశం తరఫున మాత్రమే కాదు అటు ఫ్రాంచైజీ లీగ్లలో కూడా అదరగొడుతూ తన అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ దూసుకుపోతూ ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే కేవలం ఫుట్బాల్ ఆటలో  లెజెండ్ గా ఎదగడమే కాదు అటు సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడంలోనూ క్రిస్టియనో రొనాల్డో తనకు ఎవరూ సాటిలేరు అన్న విషయాన్ని నిరూపిస్తూనే వస్తూ ఉన్నాడు. ఇప్పటికే క్రీడాకారుల్లో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక ఆటగాడిగా  కొనసాగుతున్నాడు. క్రిస్టియానో రోనాల్డో.. ఇక ఫాలోవర్లను పెంచుకోవడం విషయంలో ఇటీవల మరో అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి. ఇంస్టాగ్రామ్ లో ఏకంగా రికార్డు స్థాయి ఫాలోవర్లను సంపాదించుకున్నాడు ఈ స్టార్ ఫుట్బాల్ ప్లేయర్. క్రిస్టియానో రోనాల్డో ఫాలోవర్స్ సంఖ్య 60 కోట్లకు చేరుకుంది.



 ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ లో 60 కోట్ల ఫాలోవర్స్ ను సాధించిన తొలి వ్యక్తిగా అరుదైన రికార్డును సృష్టించాడు. అయితే ఈ విషయం తెలిసి రోనాల్డో అంటే ఆ మాత్రం ఉంటుంది మరి అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కాగా క్రిస్టియానో రోనాల్డో తర్వాత అటు లియోనాల్ మెస్సి 48.2 కోట్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉన్నాడు   యూఎస్ సింగర్ సేలేనా 42.7 కోట్ల ఫాలోవర్స్ తో ఉండగా.. కౌలి జెన్నర్ 39.8 కోట్లు, డ్వానే జాన్సన్ 38.8 కోట్లు ఫాలోవర్స్ తో ఉండగా ఇండియా నుంచి కోహ్లీ ఒక్కడే 25.6 కోట్ల ఫాలోవర్స్ తో  ఈ లిస్టులో 16వ స్థానంలో ఉన్నాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా అందుకున్న టాప్ 5 మూవీస్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>