PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-pawan-janasena-varahiyatraa7685dae-9e91-4970-ac17-bfd615a07e9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/vizag-pawan-janasena-varahiyatraa7685dae-9e91-4970-ac17-bfd615a07e9f-415x250-IndiaHerald.jpgగ్రౌండ్ రియాలిటిని చూస్తే జనసేన అధికారంలోకి వచ్చే అవకాశంలేదు. టీడీపీతో కలవాలంటే ఏదో భయం వెనక్కులాగుతోంది. మిత్రపక్షం బీజేపీతో పొత్తున్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ పరిస్ధితుల్లో అధికారంలోకి రావటానికి మళ్ళీ వైసీపీకే బాగా అవకాశాలున్నాయన్న విషయం వివిధ సర్వేల్లో అర్ధమవుతోంది. జగనే రెండోసారి ముఖ్యమంత్రి అవుతారన్న ఆలోచన పవన్ను కుదురుగా ఉండనీయటంలేదు. అందుకనే ఆ అక్కసును నోటికొచ్చినట్లు మాట్లాడటంలో చూపిస్తున్నారు.vizag pawan janasena varahiyatra{#}Veerappan;Reddy;Government;Telangana Chief Minister;Vishakapatnam;Pawan Kalyan;police;Janasenaఉత్తరాంధ్ర : పవన్ కు నోటీసులు..లాభమేంటి ?ఉత్తరాంధ్ర : పవన్ కు నోటీసులు..లాభమేంటి ?vizag pawan janasena varahiyatra{#}Veerappan;Reddy;Government;Telangana Chief Minister;Vishakapatnam;Pawan Kalyan;police;JanasenaSat, 12 Aug 2023 05:00:00 GMT


జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. ఎందుకంటే ప్రభుత్వంపై జనాలను రెచ్చగొట్టట్లుగా పవన్ ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్నందుకు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ ఉద్దేశ్యపూర్వకంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కు నిలువెల్లా కసి పేరుకుపోయింది. ఈ కసి వచ్చేఎన్నికల వరకు ఇలాగే ఉంటుంది లేదా అంతకంతకు పెరుగుతుంటుంది.





గ్రౌండ్ రియాలిటిని చూస్తే జనసేన అధికారంలోకి వచ్చే అవకాశంలేదు. టీడీపీతో కలవాలంటే ఏదో భయం వెనక్కులాగుతోంది. మిత్రపక్షం బీజేపీతో పొత్తున్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈ పరిస్ధితుల్లో అధికారంలోకి రావటానికి మళ్ళీ వైసీపీకే బాగా అవకాశాలున్నాయన్న విషయం వివిధ సర్వేల్లో అర్ధమవుతోంది. జగనే రెండోసారి ముఖ్యమంత్రి అవుతారన్న ఆలోచన పవన్ను కుదురుగా ఉండనీయటంలేదు.  అందుకనే ఆ అక్కసును నోటికొచ్చినట్లు మాట్లాడటంలో చూపిస్తున్నారు.





ఎక్కడికి పోయినా జగన్ను టార్గెట్ చేసుకుని చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు. జగన్ను పట్టుకుని దొంగని, గజదొంగని, వీరప్పన్ అని, హంతకుడని నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అయినా పవన్ కసి తీరటంలేదు. అందుకనే ప్రభుత్వానికి జనాలకు మధ్య బలమైన వారధులుగా తయారైన వాలంటీర్లపై బురదచల్లేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని, అందుకు వాలంటీర్లే బాధ్యులంటు ఆధారాలు లేకుండా ఏదేదో మాట్లాడేశారు. వాలంటీర్లపై ఆరోపణలు చేయటం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై అనుమానం బీజాలు నాటాలన్నది పవన్ ఆలోచన. అయితే ఆ ప్లాన్ కూడా పారలేదు.





అందుకనే ఉత్తరాంధ్రలోని వైజాగ్ లో  మొదలైన వారాహియాత్రలో కూడా జగన్ను వ్యక్తిగతంగాను ప్రభుత్వంతో పాటు వాలంటీర్లపైన మళ్ళీ నోరుపారేసుకున్నారు. అందుకనే పోలీసులు పవన్ కు నోటీసులు జారీచేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వంపై కావాలనే పవన్ విధ్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ముందుముందు ఇంకా ఎక్కువ డోసు పెంచుతారనటంలో సందేహంలేదు. కాబట్టి పవన్ కు ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎలాంటి ఉపయోగం ఉండదు. పొరబాటున వ్యాఖ్యలు చేసే వారికి నోటీసులిచ్చినా ఉపయోగం ఉంటుంది కానీ ప్రభుత్వంపై ధ్వేషంతో వ్యాఖ్యలు చేసే వాళ్ళని ఎవరేం చేయగలరు ?




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఈ సంవత్సరం అత్యధిక గ్రాస్ కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా అందుకున్న టాప్ 5 మూవీస్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>