EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganea2aee68-f41c-4dbd-a41e-19e9f333db25-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganea2aee68-f41c-4dbd-a41e-19e9f333db25-415x250-IndiaHerald.jpgసాధారణంగా సమాజంలోని పేదలకు ఎదురయ్యే కష్టాలు విద్య, వైద్యం, వసతి సౌకర్యాలకి సంబంధించినవై ఉంటాయి. ఒక ఇంటిని చక్కదిద్దగలిగేది ఇల్లాలే‌. కాబట్టి ఆ పేదల కుటుంబాల్లోని మహిళల ద్వారా ఆ కుటుంబం సంపాదించే సొమ్ములో కొంత మొత్తాన్ని పొదుపు చేయించగలిగితే మంచిదని గతంలోనే ప్రభుత్వం ఆలోచించింది.ఆ పొదుపు చేసిన సొమ్ము తిరిగి వాళ్ల కోసమే వాడుకోవడం అనే కాన్సెప్ట్ పై ఈ డ్వాక్రా పొదుపు సంఘాలు అనేవి ఏర్పడ్డాయి‌‌. వాటిలో పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకోవడం ద్వారా తమకు అJAGAN{#}Bank;zero;DWCRA;Governmentఆ మహిళలపై జగన్‌, బాబు, పవన్‌ దృష్టి పెట్టాలి?ఆ మహిళలపై జగన్‌, బాబు, పవన్‌ దృష్టి పెట్టాలి?JAGAN{#}Bank;zero;DWCRA;GovernmentSat, 12 Aug 2023 10:00:00 GMTసాధారణంగా సమాజంలోని పేదలకు ఎదురయ్యే  కష్టాలు విద్య, వైద్యం, వసతి సౌకర్యాలకి సంబంధించినవై ఉంటాయి. ఒక ఇంటిని చక్కదిద్దగలిగేది ఇల్లాలే‌. కాబట్టి ఆ పేదల కుటుంబాల్లోని మహిళల ద్వారా ఆ కుటుంబం సంపాదించే సొమ్ములో కొంత మొత్తాన్ని పొదుపు చేయించగలిగితే మంచిదని గతంలోనే ప్రభుత్వం  ఆలోచించింది.ఆ పొదుపు చేసిన సొమ్ము తిరిగి వాళ్ల  కోసమే  వాడుకోవడం అనే కాన్సెప్ట్ పై ఈ డ్వాక్రా పొదుపు సంఘాలు అనేవి ఏర్పడ్డాయి‌‌.


వాటిలో పేద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ సంపాదించిన సొమ్మును పొదుపు చేసుకోవడం ద్వారా తమకు అవసరం వచ్చినప్పుడు వాటిని లోన్ల రూపంలో తీసుకుంటారు‌. దీనికి జీరో  వడ్డీ రూపంలో ఇచ్చే లోన్స్ ద్వారా ప్రభుత్వం కూడా వాళ్ళకి సహకరిస్తుంది. బ్యాంకుల్లో పొదుపు చేయడం అనేది ఇప్పుడు దండగ పని‌. ఎందుకంటే అక్కడ వడ్డీలు చాలా పరిమితంగా ఉంటాయి. సేవింగ్స్ అకౌంట్ లో వేసుకున్నా, ఫిక్స్డ్ డిపాజిట్ లో సొమ్ము వేసుకున్నా కూడా వాటికి వడ్డీలు మాత్రం పరిమితంగానే ఇవ్వడం జరుగుతుంది‌.


పేదలకు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసినట్లుగానే, మధ్యతరగతి వాళ్ళకు కూడా ఒక పొదుపు సంఘాన్ని ఏర్పాటు చేస్తే మంచిది అని కొంతమంది అంటున్నారు. దాంతో డబ్బులు కోట్లలో బ్యాంక్ అకౌంట్ ల రూపంలో ఉంటాయి‌‌. ఆ తర్వాత వాటిని బిజినెస్ రూపంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అంతే కాకుండా వీటి నుండి అవసరమైన వాళ్ళకి లోన్స్ కూడా ఇవ్వచ్చు.


కాబట్టి మధ్య తరగతి వాళ్ళని కూడా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే, ఆర్థికంగా వారికీ, వారితో పాటు ప్రభుత్వానికి కూడా  బాగుంటుందని కొంతమంది అభిప్రాయం. వాటి వల్ల బ్యాంకులు కూడా రొటేషన్ చేసుకోగలుగుతున్నాయి. పేదలు పేదలు  అంటూ ఎప్పుడూ పేదలని పట్టించుకుంటున్నారు గాని మధ్య తరగతి వాళ్ళని చాలా వరకు పక్కన పెట్టేస్తున్నాయి  ప్రభుత్వాలు‌. ఇలాంటి సందర్భంలో  వాళ్ళ కష్టాలను వాళ్ల పొదుపుల రూపంలోనే  తీరిస్తే అది ఒక అద్భుతమైన పథకం అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>