Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tana-tandri-gurchi-asaktikara-vyakhaylu-chesina-sruthi-hasanb2b699db-b9a9-4b39-8f7f-6f2e31b92b21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tana-tandri-gurchi-asaktikara-vyakhaylu-chesina-sruthi-hasanb2b699db-b9a9-4b39-8f7f-6f2e31b92b21-415x250-IndiaHerald.jpgవైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఆయన..పాత్ర ఏదైనా న్యాయం చేయగల బెస్ట్ పెర్పార్మర్.. హాస్యాన్ని పండించాలన్నా..హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలన్నా..విలనిజాన్ని చూపించాలన్నా ఆయనకు ఆయనే సాటి.తన టాలెంట్‎తో తమిళ చిత్ర రంగంలో 230 సినిమాల్లో హీరోగా నటించి తిరుగులేని నటుడిగా ఎదిగారు కమల్ హాసన్. తెలుగు ప్రజల హృదయాలను సైతం గెలుచుకున్నారు ఈ సౌత్ స్టార్ హీరో. కమల్‌ హాసన్‌ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి నేటికి 63 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లేటెస్ట్‎గా కమల్ హాసన్ కూతురుsocialstars lifestyle{#}kajal aggarwal;Cinema;Telugu;media;Tamil;Film Industry;Yuva;Father;Indianతన తండ్రి గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శృతిహాసన్....!!తన తండ్రి గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శృతిహాసన్....!!socialstars lifestyle{#}kajal aggarwal;Cinema;Telugu;media;Tamil;Film Industry;Yuva;Father;IndianSat, 12 Aug 2023 15:30:00 GMTవైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ ఆయన..పాత్ర ఏదైనా న్యాయం చేయగల బెస్ట్ పెర్పార్మర్.. హాస్యాన్ని పండించాలన్నా..హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలన్నా..విలనిజాన్ని చూపించాలన్నా ఆయనకు ఆయనే సాటి.తన టాలెంట్‎తో తమిళ చిత్ర రంగంలో 230 సినిమాల్లో హీరోగా నటించి తిరుగులేని నటుడిగా ఎదిగారు కమల్ హాసన్. తెలుగు ప్రజల హృదయాలను సైతం గెలుచుకున్నారు ఈ సౌత్ స్టార్ హీరో. కమల్‌ హాసన్‌ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి నేటికి 63 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లేటెస్ట్‎గా కమల్ హాసన్ కూతురు , యువ నటి శ్రుతిహాసన్ కూడా తన తండ్రి సినీ కెరీర్‎పైన ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

కమల్‌ హాసన్‌ సినీ ఇండస్ట్రీలో 63 ఏళ్లు పూర్తి చేసుకుని 64 ఏట అడుగుపెడుతున్న సందర్భంగా ఫ్యాన్స్ ఎడిట్‌ చేసిన ఓ స్పెషల్ ఫోటోగ్రాఫ్‎ను శ్రుతి తన సోషల్ మీడియా అకౌంట్‎లో షేర్ చేసింది. '' నాన్న తన సినీ కెరీర్‎లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కొన్నారు. ఎన్నో ఛాలెంజింగ్‌ పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు. చిత్ర పరిశ్రమ బాగుండాలని, దాని ఎదుగుదల కోసం ఆయన నిత్యం అలుపెరుగని పోరాటం చేశారు. 60 ఏళ్లుగా సినీరంగానికే ఆయన సేవలను అందిస్తున్నారు''అని శ్రుతి తెలిపింది. శ్రుతి పోస్ట్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్ ‎కు రిప్లైగా సినీప్రముఖులు, నెటిజన్లు కమల్‌ హాసన్‌తో దిగిన ఫొటోలను పంచుకుంటూ ఆయనతో ఉన్న అనుభందాన్ని షేర్ చేస్తున్నారు.

కమల్ హాసన్ లేటెస్టుగా 'ఇండియన్‌2' సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీని శంకర్‌ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ మూవీలో యువ కథానాయికలు కాజల్ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కనిపించనున్నారు. త్వరలోనే ఇండియన్ 2 టీజర్‌ విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అదే విధంగా కమల్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ డైరెక్షన్‎లో తెరకెక్కుతోన్న 'కల్కి 2898 ఏడీ'లోనూ సందడి చేయనున్నారు. ఈ సినిమాలో కమల్ నెగిటివ్ షేడ్‎లో కనిపించనున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పంజాబ్‌లో పరువు హత్య.. కూతురిని చంపి.. అంతటితో ఆగకుండా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>