Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthu3d00c226-814b-4662-99bf-887d7827a70c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthu3d00c226-814b-4662-99bf-887d7827a70c-415x250-IndiaHerald.jpgనేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో.. ఈ అమ్మడికి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నాని సరసన నటించి.. నేను లోకల్ సినిమా ద్వారా మరింత క్రేజ్ సంపాదించింది. మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా వచ్చిన మహానటి సినిమాతో జాతీయ అవార్డును అందుకొని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు నేటి తరానికి సావిత్రమ్మగా మారింది కీర్తి సురేష్. అయితే ఏం ముహూర్తాన ఈ అమ్మడు మహానటి సినిమా చేసిందో కానీ ఆ తర్వాత నుంచి ఒక్క హిటKeerthu{#}Nenu Local;kirti;Suresh;Heroine;Nani;Mahanati;Telugu;shankar;Chiranjeevi;Cinemaమళ్ళీ అదే తప్పు చేసిన కీర్తి.. ఇప్పటికైనా మారితే బెటర్?మళ్ళీ అదే తప్పు చేసిన కీర్తి.. ఇప్పటికైనా మారితే బెటర్?Keerthu{#}Nenu Local;kirti;Suresh;Heroine;Nani;Mahanati;Telugu;shankar;Chiranjeevi;CinemaSat, 12 Aug 2023 14:00:00 GMTనేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమానే మంచి విజయం సాధించడంతో.. ఈ అమ్మడికి  వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇక ఆ తర్వాత నాని సరసన నటించి.. నేను లోకల్ సినిమా ద్వారా మరింత క్రేజ్ సంపాదించింది.  మహానటి సావిత్రి బయోపిక్ ఆధారంగా వచ్చిన మహానటి సినిమాతో జాతీయ అవార్డును అందుకొని ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అంతేకాదు నేటి తరానికి సావిత్రమ్మగా మారింది కీర్తి సురేష్.


 అయితే ఏం ముహూర్తాన ఈ అమ్మడు మహానటి సినిమా చేసిందో కానీ ఆ తర్వాత నుంచి ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయింది కీర్తి సురేష్. మహానటి సినిమా తర్వాత తన క్రేజ్ కి తగ్గట్లుగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలతో చేతులు కాల్చుకుంది. ఇక బొద్దు బొద్దుగా ఉండి ఎంతో మందిని మనసు కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ బక్కచికి పోయి ముఖంలో ఉన్న కలలు మొత్తం పోగొట్టుకుంది. ఇక ఆ తర్వాత రజనీకాంత్ చెల్లెలిగా నటించి పెద్దన్న సినిమాతో ప్రేక్షకులను పలకరించింది  ఇక ఈ సినిమా ఎంతటి భారీ డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 అయితే హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో చెల్లెలిగా చేస్తే ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వస్తాయని తెలిసి కూడా రజనీకాంత్ సినిమాలో నటించింది. అనుకున్నట్టుగానే ఆ తర్వాత మరో చెల్లెలు పాత్ర ఆమెను పలకరించింది  మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన భోళా శంకర్ సినిమాలో చిరు చెల్లెలిగా  నటించింది. అయితే చిరంజీవి కీర్తి సురేష్ మధ్య సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయింది. కానీ సినిమానే వర్కౌట్ కాలేదు. ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక మరి కొన్ని రోజులు ఈ సినిమా కలెక్షన్లు పూర్తిగా తగ్గిపోయాయ్. చివరికి ఫ్లాప్ గానే మిగిలే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"సూర్యా సన్నాఫ్ కృష్ణన్" మూవీకి రీ రిలీజ్ లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>