HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe9ba0cb2-2f60-471f-8ab3-485fb6823e45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthe9ba0cb2-2f60-471f-8ab3-485fb6823e45-415x250-IndiaHerald.jpgమనం కొన్ని రకాల కూరగాయలు ఇంకా పండ్లను నేరుగా తినకుండా జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు. దాని ఫలితంగా వాటి ద్వారా లభించే శక్తి శరీర భాగాలకు త్వరగా చేరుతుంది. ఇంకా అలాగే శరీరం కూడా హైడ్రేటెడ్‌గా, హెల్తీగా ఉంటుంది. అలాగే వీటి నుంచి లభించే పోషకాలతో శరీరానికి ఎదురయ్యే అధిక బరువు, రక్తహీనత, డయాబెటీస్ ఇంకా గుండెపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ క్రమంలో మీరు ఏయే పండ్లు, కూరగాయల రసాలను తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక కాకరకాయ రసం చేదుగా ఉన్నా కూడా అది చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.ఎందుకHEALTH{#}Rasam;Potassium;Aqua;Magnesium;Iron;Vitamin;Manam;Shakti;vegetable marketఆరోగ్యాన్ని మెరుగుపరిచే జ్యూసులు ఇవే?ఆరోగ్యాన్ని మెరుగుపరిచే జ్యూసులు ఇవే?HEALTH{#}Rasam;Potassium;Aqua;Magnesium;Iron;Vitamin;Manam;Shakti;vegetable marketFri, 11 Aug 2023 19:37:00 GMTమనం కొన్ని రకాల కూరగాయలు ఇంకా పండ్లను నేరుగా తినకుండా జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు. దాని ఫలితంగా వాటి ద్వారా లభించే శక్తి శరీర భాగాలకు త్వరగా చేరుతుంది. ఇంకా అలాగే శరీరం కూడా హైడ్రేటెడ్‌గా, హెల్తీగా ఉంటుంది. అలాగే వీటి నుంచి లభించే పోషకాలతో శరీరానికి ఎదురయ్యే అధిక బరువు, రక్తహీనత, డయాబెటీస్ ఇంకా గుండెపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఈ క్రమంలో మీరు ఏయే పండ్లు, కూరగాయల రసాలను  తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక కాకరకాయ రసం చేదుగా ఉన్నా కూడా అది చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.ఎందుకంటే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, విటమిన్లు ఇంకా పొటాషియం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.అలాగే పుచ్చకాయలో నీటి పరిమాణం 90 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. మీ శరీరం హైడ్రేటెడ్‌గా ఉండాలంటే పుచ్చకాయ రసం మంచి ఎంపిక. పుచ్చకాయ రసం తాగడం వల్ల శరీరం చాలా చల్లగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే డ్రీహైడ్రేషన్ సమస్య నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తాయి.


ఫైబర్‌కి కూడా మంచి మూలమైన పుచ్చకాయ జీర్ణ వ్యవస్థ పనితీరును బాగా మెరుగుపరిచి మలబద్ధకం, అజీర్తి, కడుపులో మంట వంటి జీర్ణ సమ్యలను ఈజీగా దూరం చేస్తుంది. ఇంకా అలాగే బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది.అలాగే టమాటాలు కూడా ఆరోగ్యానికి మంచివే. ఈ టమాటాల్లో లభించే విటమిన్ కె, ఐరన్, ఫైబర్, విటమిన్ ఎ, ఫాస్పరస్ ఇంకా మెగ్నీషియం మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి బరువు తగ్గడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇందులోని విటమిన్లు కంటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి.ఈ టమాటాల్లోని ఐరన్ శరీరంలో రక్తహీనత సమస్యను ఈజీగా నివారిస్తుంది. ఇంకా అలాగే ఫాస్పరస్ పటిష్టమైన ఎముకల నిర్మాణానికి కూడా సహాయపడుతుంది.ఇంకా అలాగే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలమైన నిమ్మరసం శరీర రోగ నిరోధక శక్తిని మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.ఎందుకంటే ఇందులోని ప్రోటీన్, ఫోలేట్, మినరల్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంకా అలాగే బరువు తగ్గడంలో నిమ్మరసం మెరుగ్గా పనిచేస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైరల్: ఫ్లోర్ లోపల సౌండ్స్.. పగలగొడితే ఏం బయట పడిందంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>