PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/top-congress-leaders-not-visiting-idupulapaya-for-sharmila-f9f74af7-c567-48f2-8201-1faa7600a0cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/top-congress-leaders-not-visiting-idupulapaya-for-sharmila-f9f74af7-c567-48f2-8201-1faa7600a0cd-415x250-IndiaHerald.jpgదానికి తగ్గట్లే కర్నాటకలో కాంగ్రెస్ మంచి మెజారిటితో గెలిచిన దగ్గర నుండి షర్మిల రెగ్యులర్ గా బెంగుళూరు వెళ్ళి పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అవుతున్నారు. ఈ భేటీల్లోనే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి షర్మిల అంగీకరించారట. కీలకమైన నిర్ణయం అయిపోయింది కానీ ఎంట్రీ విషయంలోనే కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ సమస్య ఏమిటంటే రెండుపార్టీలు విలీనమైతే తనకు దక్కబోయే హోదా ఏమిటని షర్మిల అడిగారట. అలాగే తాను పోటీచేయబోయే నియోజకవర్గం ఏదో ఫైనల్ చేయాలని పట్టుబట్టారట. ys sharmila sonia rahul telangana{#}Khammam;Siva Kumar;Sharmila;Congress;Party;Newsహైదరాబాద్ : కాంగ్రెస్ లో షర్మిల లెక్కిదేనా ?హైదరాబాద్ : కాంగ్రెస్ లో షర్మిల లెక్కిదేనా ?ys sharmila sonia rahul telangana{#}Khammam;Siva Kumar;Sharmila;Congress;Party;NewsFri, 11 Aug 2023 09:00:00 GMT



వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి అంతా రెడీ అయిపోయింది. తేలాల్సింది రెండు అంశాలమీదే. అవేమిటంటే కాంగ్రెస్ లో వైఎస్సార్టీపి విలీనమైతే పార్టీ అధ్యక్షురాలు షర్మిల హోదా ఏమిటి ? పోటీ ఎక్కడినుండి ? అని. ఈరెండింటిపై ఏఐసీసీ నుండి స్పష్టతరాగానే విలీనం ఇక లాంఛనమేనని వైఎస్సార్టీపి వర్గాలు చెప్పాయి. కాంగ్రెస్ లో వైఎస్సార్టీపిని వీలనం చేయించే విషయంలో చాలాకాలంగా చర్చలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.





రెండుపార్టీల మధ్య ముందు పొత్తన్నారు తర్వాత విలీనమన్నారు. మొదట్లో పొత్తులేదు, విలీనమూ లేదని చెప్పిన షర్మిల తర్వాత ఈ విషయంపై  మాట్లాడటం మానేశారు. పైగా అంతకుముందు వరకు చేస్తున్న పాదయాత్రకు కూడా నిరవధికంగా బ్రేకులు వేసేశారు. కొంతకాలంగా పార్టీ యాక్టివిటీస్ జరగటమే లేదు. దాంతోనే జరుగుతున్నది ప్రచారం మాత్రమే కాదని వాస్తవమే అని అందరికీ అర్ధమైపోయింది.





దానికి తగ్గట్లే కర్నాటకలో కాంగ్రెస్ మంచి మెజారిటితో గెలిచిన దగ్గర నుండి షర్మిల రెగ్యులర్ గా బెంగుళూరు వెళ్ళి పీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అవుతున్నారు. ఈ భేటీల్లోనే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి షర్మిల అంగీకరించారట. కీలకమైన నిర్ణయం అయిపోయింది కానీ ఎంట్రీ విషయంలోనే కన్ఫ్యూజన్ ఉంది. ఇక్కడ సమస్య ఏమిటంటే రెండుపార్టీలు విలీనమైతే తనకు దక్కబోయే హోదా ఏమిటని షర్మిల అడిగారట. అలాగే తాను పోటీచేయబోయే నియోజకవర్గం ఏదో ఫైనల్ చేయాలని పట్టుబట్టారట.




పార్టీ వర్గాల సమాచారం ప్రకారం షర్మిలను ఏఐసీసీ కార్యవర్గంలోకి తీసుకునే అవకాశముందని అంటున్నారు. ఒకవేళ అది కుదరకపోతే తెలంగాణా ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటిస్తారట. ఇక పోటీ విషయంచూస్తే ఖమ్మం జిల్లా పాలేరులో పోటీచేస్తానని షర్మిల పదేపదే ప్రకటించారు. పాలేరు నుండి అసెంబ్లీకి కానీ లేకపోతే సికింద్రాబాద్ నుండి ఎంపీగా గాని పోటీచేసే అవకాశం ఉందంటున్నారు. హోదా, పోటీ నియోజకవర్గం తేలిపోతే విలీనమైపోయినట్లే. ఢిల్లీకి వెళ్ళి సోనియాగాంధి, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలను కలిసి విలీనంపై షర్మిల ప్రకటన చేయటానికి రెడీగా ఉన్నారని సమాచారం. బహుశా ఆ మూడోవారంలో లాంఛనం పూర్తవుతుందేమో చూడాలి.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>