HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha384fe49-42cb-4677-9e60-6b79d7a5f773-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healtha384fe49-42cb-4677-9e60-6b79d7a5f773-415x250-IndiaHerald.jpgఇక శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో, చర్మం పొడిగా ఉండే వారిలో పులిపిర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది పులిపిర్లను గిల్లడం ఇంకా వాటిని బ్లేడుతో కట్ చేయడం వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకటి లేదా రెండు పులిపిర్లు ఉన్నవారు చర్మ వైద్యులను కలిసి ఖచ్చితంగా కూడా అందుకు తగిన చికిత్స తీసుకోవడం మంచిది. అయితే ఎక్కువ సంఖ్యలో పులిపిర్లు ఉన్నవారు కొన్ని ఇంటి చిట్కాలను వాడడం వల్ల పులిపిర్లను సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను తయారు చhealth{#}garlic;Coffee;Shakti;Manamపులిపిర్లు ఈజీగా రాలిపోయే టిప్స్?పులిపిర్లు ఈజీగా రాలిపోయే టిప్స్?health{#}garlic;Coffee;Shakti;ManamFri, 11 Aug 2023 15:16:00 GMTఇక శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో, చర్మం పొడిగా ఉండే వారిలో పులిపిర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది పులిపిర్లను గిల్లడం ఇంకా వాటిని బ్లేడుతో కట్ చేయడం వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకటి లేదా రెండు పులిపిర్లు ఉన్నవారు చర్మ వైద్యులను కలిసి ఖచ్చితంగా కూడా అందుకు తగిన చికిత్స తీసుకోవడం మంచిది. అయితే ఎక్కువ సంఖ్యలో పులిపిర్లు ఉన్నవారు కొన్ని ఇంటి చిట్కాలను వాడడం వల్ల పులిపిర్లను సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాలను తయారు చేసుకోవడం ఇంకా అలాగే వాడడం కూడా చాలా సులభం. ఈ చిట్కాలను వాడడం వల్ల పులిపిర్లు చాలా ఈజీగా వాటంతట అవే రాలిపోతాయి.ఇంకా అలాగే ఎటువంటి దుష్ప్రభావాలు, నొప్పి, బాధ కూడా ఉండవు.ఆ పులిపిర్లను తొలగించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో ఆర్గానిక్ పసుపు, వంటసోడాను, సున్నాన్ని తీసుకోవాలి. ఈ మూడింటిని సమానంగా తీసుకుని అందులో కొంచెం నిమ్మరసం వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి.


ఆ తరువాత ఇందులో కాఫీ పొడిని వేసి కలపాలి. కాఫీ పొడిని వాడడం వల్ల చర్మం ఎర్రగా మారకుండా ఇంకా చర్మం దెబ్బతినకుండా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని దూదితో లేదా ఇయర్ బడ్ తో ఆ పులిపిర్లపై రాయాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత మళ్ళీ రాస్తూ ఉండాలి.ఇలా మీరు 5 నుండి 6 సార్లు ఖచ్చితంగా రాయాలి. ఇలా చేయడం వల్ల పులిపిర్లు ఈజీగా రాలిపోతాయి. అలాగే పులిపిర్లను తగ్గించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందు కోసం 4 వెల్లుల్లి రెబ్బల నుండి రసాన్ని తీసుకోవాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం, వంటసోడా ఇంకా సున్నం కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని దూదితో లేదా ఇయర్ బడ్ తో ఆ పులిపిర్లపై రాయాలి. ఈ మిశ్రమం ఆరే కొద్ది మళ్ళీ రాస్తూ ఉండాలి. ఇలా ఖచ్చితంగా 5 నుండి 6 సార్లు చేయాలి. ఇలా చేయడం వల్ల చిన్నగా ఉండే పులిపిర్లు చాలా ఈజీగా ఒక్కరోజూలోనే రాలిపోతాయి. పెద్దగా ఉండే పులిపిర్లు అయితే 2 నుండి 3 రోజుల్లో రాలిపోతాయి. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా ఈజీగా ఈ పులిపిర్ల సమస్య నుండి బయటపడవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైరల్: ఫ్లోర్ లోపల సౌండ్స్.. పగలగొడితే ఏం బయట పడిందంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>