PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-to-immitate-pawan-kalyan23486e89-d3b3-4102-ad70-acb86be05ceb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/megastar-to-immitate-pawan-kalyan23486e89-d3b3-4102-ad70-acb86be05ceb-415x250-IndiaHerald.jpgఇపుడు భోళాశంకర్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతించాలని నిర్మాతలు పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం రెజెక్టుచేసింది. దానికి కారణం ఏమిటంటే దరఖాస్తు సందర్భంగా నిర్మాతలు అవసరమైన డాక్యుమెంట్లను జతచేయలేదట. సినిమా బడ్జెట్ తదితరాలపై వివరాలు ఇవ్వలేదట. టికెట్ ధరలు పెంచుకోవటం అన్నది సినిమా బడ్జెట్ పైన కూడా ఆధారపడుంటుంది. ఎక్కువ బడ్జెట్ సినిమాలంటే తారాగణంకు ఇచ్చిన రెమ్యునరేషన్ మీద ఆధారపడుంటుంది. chiru jagan bhola sankar{#}Application;Government;producer;Producer;News;shankar;Cinemaఅమరావతి : భోళాశంకర్ కు షాకేనా ?అమరావతి : భోళాశంకర్ కు షాకేనా ?chiru jagan bhola sankar{#}Application;Government;producer;Producer;News;shankar;CinemaFri, 11 Aug 2023 07:00:00 GMT


తాజా రాజకీయ పరిణామాలు, వివాదాల నేపధ్యంలో భోళా శంకర్ సినిమా టికెట్ల ధరలు పెంచుకునే విషయంలో ప్రభుత్వం షాకిచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సినిమా నిర్మాతలు తమిష్టప్రకారం టికెట్ ధరలను పెంచుకుని అమ్ముకునేందుకు లేదు. టికెట్ల ధరలు పెంచుకోవాలంటే ముందుగా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారమే టికెట్లను అమ్ముకోవాలి. ఒకవేళ టికెట్ ధరలను పెంచటానికి ప్రభుత్వం ఒప్పుకోకపోతే పాతరేట్లకే టికెట్లను అమ్ముకోవాలంతే.





ఇపుడు భోళాశంకర్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతించాలని నిర్మాతలు పెట్టుకున్న దరఖాస్తును ప్రభుత్వం రెజెక్టుచేసింది. దానికి కారణం ఏమిటంటే దరఖాస్తు సందర్భంగా నిర్మాతలు అవసరమైన డాక్యుమెంట్లను జతచేయలేదట. సినిమా బడ్జెట్ తదితరాలపై వివరాలు ఇవ్వలేదట. టికెట్ ధరలు పెంచుకోవటం అన్నది సినిమా బడ్జెట్ పైన కూడా ఆధారపడుంటుంది. ఎక్కువ బడ్జెట్ సినిమాలంటే తారాగణంకు ఇచ్చిన రెమ్యునరేషన్ మీద ఆధారపడుంటుంది.





దానికి సంబంధించిన డాక్యుమెంట్లను నిర్మాత ప్రభుత్వానికి అందించాల్సుంటంది. అయితే భోళాశంకర్ సినిమా నిర్మాత అలాంటి వివరాలు, డాక్యుమెంట్లను ప్రభుత్వానికి ఇవ్వలేదని సమాచారం. టికెట్ల ధరలను పెంచుకోవటానికి ఉత్త దరఖాస్తును మాత్రమే అందిచారట. దరఖాస్తును పరిశీలించిన ప్రభుత్వం దరఖాస్తును రెజెక్టుచేసింది. చిరంజీవితో పాటు మరికొందరు అగ్రహీరోలు  నటించిన సినిమాల టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. కానీ ఈ సినిమా నిర్మాత దరఖాస్తును మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది.





అవసరమైన అన్ని డాక్యుమెంట్లను జతచేసి మళ్ళీ దరఖాస్తు చేసుకోమని సమాచారం కూడా అందించిందట. మరిపుడు నిర్మాత ఏమిచేస్తారో చూడాలి. అయితే ఈ కారణాలను పక్కనపెట్టేసి చిరంజీవికి మంత్రులు, మాజీమంత్రులకు మధ్య వివాదం నడుస్తోంది కాబట్టి బోళాశంకర్ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వం తిరస్కరించిందనే ప్రచారం పెరిగిపోతోంది. సినిమా 11వ తేదీన విడులవుతోంది. టికెట్ల ధరలను పెంచుకోవటం అవసరమని నిర్మాత అనుకుంటే ప్రభుత్వం అడిగిన డాక్యుమెంట్లతో మళ్ళీ దరఖాస్తు చేస్తారు. దరఖాస్తు చేయటం అంతా ఆన్ లైన్లోనే కాబట్టి ఎక్కువ సమయం కూడా పట్టదు. మరి నిర్మాత ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గోపీచంద్ "బీమా" మూవీలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన క్రేజీ బ్యూటీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>