MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth9a9d1e3c-cd1a-4e28-9e0d-b7d5065bfa40-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth9a9d1e3c-cd1a-4e28-9e0d-b7d5065bfa40-415x250-IndiaHerald.jpgఆలిండియా సూపర్ స్టార్ తమిళ టాప్ హీరో రజనీకాంత్, హాట్ మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన జైలర్ సినిమా ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఇక ఈ సినిమా మొదటి షో నుంచే తమిళ రాష్ట్రంలో పాజిటివ్ టాక్ తో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది.సూపర్ స్టార్ అభిమానులు అయితే..రజినీకి ఇది కదా కావాల్సిన సరైన హిట్టు అంటూ బాగా సంబరాలు RAJINIKANTH{#}Dilip Kumar;Rajani kanth;BEAUTY;Telugu;Hero;Director;Tamil;Cinema;Newsజైలర్ కలెక్షన్స్: రికార్డ్ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్లంటే..?జైలర్ కలెక్షన్స్: రికార్డ్ ఓపెనింగ్స్.. ఎన్ని కోట్లంటే..?RAJINIKANTH{#}Dilip Kumar;Rajani kanth;BEAUTY;Telugu;Hero;Director;Tamil;Cinema;NewsFri, 11 Aug 2023 17:44:00 GMTఆలిండియా సూపర్ స్టార్ తమిళ టాప్ హీరో రజనీకాంత్, హాట్ మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన జైలర్ సినిమా ఎన్నో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ అయింది.ఇక ఈ సినిమా మొదటి షో నుంచే తమిళ రాష్ట్రంలో పాజిటివ్ టాక్ తో ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది.సూపర్ స్టార్ అభిమానులు అయితే..రజినీకి ఇది కదా కావాల్సిన సరైన హిట్టు అంటూ బాగా సంబరాలు చేసుకుంటున్నారు.ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్‌తో అన్నిచోట్లా కూడా ఈ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.మొదటి రోజే ఈ సినిమా ఏకంగా వంద కోట్ల మార్క్‌ దాటింది. ఒక్క బుక్‌ మై షో యాప్‌లోనే ఏకంగా 9 లక్షల టికెట్లు బుక్‌ అయ్యాయంటే రజనీ కాంత్ క్రేజ్‌ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.


ఇక తమిళనాడులో 8 కోట్ల రేంజ్ ప్రీ బుకింగ్స్,కర్ణాటకలో 7 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్,దేశం మొత్తం మీద ఈ సినిమా బుకింగ్స్ ఏకంగా 17 కోట్లకు పైగా బుకింగ్స్ జరిగిందని,ఓవర్సీస్ బుకింగ్స్ తో కలిపి మొత్తంగా 30 కోట్ల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సొంతం చెసుకున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది.ఇక రజినీకాంత్ సినిమాల్లో రోబో 2.0 సినిమా తర్వాత బెస్ట్ బుకింగ్స్ తో జైలర్ సినిమా ముందంజలో ఉంది.ఇదే పాజిటివ్ టాక్ ఇంకా మౌత్ టాక్ కనుక కంటిన్యూ అయితే ఈ సినిమా బుకింగ్స్ జోరుని మరింత పెరిగే అవకాశం ఉందని ఫిలిం వర్గాలు అంటున్నాయి.ఇండియాలో ఏకంగా 45 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకుంది.ఏది ఏమైనప్పటికీ రజినీ కాంత్ జైలర్.. కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా.. అన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ కు కూడా బాగా నచ్చుతుందని టాక్ వినిపిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వైరల్: ఫ్లోర్ లోపల సౌండ్స్.. పగలగొడితే ఏం బయట పడిందంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>