Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhavan7077b718-f0cb-4d66-ac48-4e04515569bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhavan7077b718-f0cb-4d66-ac48-4e04515569bf-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ లో యంగ్ ప్లేయర్స్ హవా పెరిగిపోయిన నేపథ్యంలో గత కొంతకాలం నుండి సీనియర్ ప్లేయర్స్ కెరియర్ ప్రమాదంలో పడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ ప్లేయర్లు ఏదో ఒక ఫార్మాట్కు పరిమితం అవడం లేదంటే.. ఇక జట్టులో చోటు కోల్పోవడం జరుగుతూ వస్తుంది. భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పటికే టీ20 టెస్ట్ ఫార్మాట్లకు అతన్ని సెలెక్టర్లు దూరం చేశారు. కేవలం వన్డే ఫార్మాట్ కి మాత్రమే ఎంపిక చేస్తూ వచ్చారు. అయితే ఇక వన్డే ఫార్మాట్లో ఏ మ్యాచ్ ఆడిన అతను కచ్చితంగా జట్టులో Dhavan{#}Shikhar Dhawan;World Cup;ICC T20;Cricket;Yuva;Indiaజట్టులో నా పేరు లేకపోవటంతో షాకయ్య.. ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?జట్టులో నా పేరు లేకపోవటంతో షాకయ్య.. ధావన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?Dhavan{#}Shikhar Dhawan;World Cup;ICC T20;Cricket;Yuva;IndiaFri, 11 Aug 2023 09:15:00 GMTభారత క్రికెట్ లో యంగ్ ప్లేయర్స్ హవా పెరిగిపోయిన నేపథ్యంలో గత కొంతకాలం నుండి సీనియర్ ప్లేయర్స్ కెరియర్ ప్రమాదంలో పడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీనియర్ ప్లేయర్లు  ఏదో ఒక ఫార్మాట్కు పరిమితం అవడం లేదంటే.. ఇక జట్టులో చోటు కోల్పోవడం జరుగుతూ వస్తుంది. భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పటికే టీ20 టెస్ట్ ఫార్మాట్లకు అతన్ని సెలెక్టర్లు దూరం చేశారు. కేవలం వన్డే ఫార్మాట్ కి మాత్రమే ఎంపిక చేస్తూ వచ్చారు. అయితే ఇక వన్డే ఫార్మాట్లో ఏ మ్యాచ్ ఆడిన అతను కచ్చితంగా జట్టులో ఉంటాడని అందరూ నమ్మకం పెట్టుకున్నారు.


 కానీ వచ్చిన అవకాశాలను అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పేలవమైన ఫామ్ తో విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో వన్డే ఫార్మాట్ నుంచి కూడా తప్పిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే గత ఏడాది చివరి వరకు కూడా శిఖర్ ధావన్ 2023 వన్డే వరల్డ్ కప్ లో తప్పకుండా ఉంటాడని ప్రతి ఒక్కరూ కూడా బల్లగుద్ది మరి చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అయితే కనీసం ఆసియా కప్ కోసం కూడా అతన్ని జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదు సెలెక్టర్లు. అయితే ఈ రెండు మెగా టోర్నీలలో ఎంపిక చేయకపోయినప్పటికీ అటు ఆసియా గేమ్స్ లో మాత్రం ధావన్ తప్పకుండా ఎంపిక అవుతాడని అతని కెప్టెన్సీ లోనే టీమ్ ఇండియా ఆసియా గేమ్స్ లో బరిలోకి దిగుతుంది అని అందరూ భావించారు.


 కానీ ధావన్ కు కెప్టెన్సీ కాదు కదా కనీసం జట్టులో చోటు కూడా దక్కలేదు. ఇక ఇదే విషయంపై ఇటీవల ఈ సీనియర్ ఓపెనర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆసియా కేమ్స్ కోసం ప్రకటించిన జట్టులో తన పేరు లేకపోవడంతో కొంచెం షాక్ కి గురయ్యాను అంటూ దావాన్ చెప్పుకొచ్చాడు. భిన్నమైన ఆలోచనతోనే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకున్నాను. ఇక యంగ్ ప్లేయర్ రుతురాజ్ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూ శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. యువ ఆటగాళ్లందరూ కూడా అదరగొడతారని ఆశిస్తున్నాను అంటూ పేర్కొన్నాడు. అవకాశం వస్తే జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ఫిట్గా  ఉంటాను అంటూ చెప్పుకొచ్చాడు శిఖర్ ధావన్.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ సినిమా కోసం రజనీకాంత్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>