Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/yuvaraj32a814d3-f487-4cfd-b55e-498244ec89a8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/yuvaraj32a814d3-f487-4cfd-b55e-498244ec89a8-415x250-IndiaHerald.jpg2011 ప్రపంచ కప్ తర్వాత అటు టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలవడం అనేది కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. అటు ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీం గా కొనసాగుతున్నప్పటికీ టీమిండియా మాత్రం వరల్డ్ కప్ గెలవలేక పోతుంది. అయితే ప్రతిసారి లీగ్ మ్యాచ్ లలో మంచి ప్రదర్శన చేయడం.. ఇక నాకౌట్ మ్యాచ్లలో చేతులెత్తేయడం జరుగుతూ వస్తుంది. ఇలా వరల్డ్ కప్ గెలవలేక అభిమానులు అందరిని నిరాశ పరుస్తున్న టీమ్ ఇండియా పై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం తప్పకుండా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని భారత అభిమానులు బలంగా నమ్మYuvaraj{#}Yuvraj Singh;Cricket;World Cup;Indiaఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది.. కానీ.. యువరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుంది.. కానీ.. యువరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?Yuvaraj{#}Yuvraj Singh;Cricket;World Cup;IndiaThu, 10 Aug 2023 17:30:00 GMT2011 ప్రపంచ కప్ తర్వాత అటు టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలవడం అనేది కలగానే మిగిలిపోయింది అని చెప్పాలి. అటు ప్రపంచ క్రికెట్లో పటిష్టమైన టీం గా కొనసాగుతున్నప్పటికీ టీమిండియా మాత్రం వరల్డ్ కప్ గెలవలేక పోతుంది. అయితే ప్రతిసారి లీగ్ మ్యాచ్ లలో మంచి ప్రదర్శన చేయడం.. ఇక నాకౌట్ మ్యాచ్లలో చేతులెత్తేయడం జరుగుతూ వస్తుంది. ఇలా వరల్డ్ కప్ గెలవలేక అభిమానులు అందరిని నిరాశ పరుస్తున్న టీమ్ ఇండియా పై విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే ఈసారి మాత్రం తప్పకుండా టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని భారత అభిమానులు బలంగా నమ్ముతున్నారు.


 ఎందుకంటే ఈ ఏడాది అటు భారత గడ్డపైనే వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే సొంత గడ్డపై భారత్ ఎంత పటిష్టమైన టీం అన్న విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే సొంత గడ్డపై టీమ్ ఇండియాని ఓడించడం అంటే అది ప్రతి టీం కి కూడా సవాలతో కూడుకున్నది. ఇలా స్వదేశీ పరిస్థితిలే టీమ్ ఇండియాకు అనుకూలంగా మారి ఇక వరల్డ్ కప్ గెలిచేలా చేస్తాయని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఎంతోమంది భారత మాజీలు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో చెప్పేస్తున్నారు.


 అయితే ఇటీవల ఇదే విషయం గురించి టీమ్ ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను దేశభక్తుడిని కాబట్టి తప్పకుండా ఇండియా గెలుస్తుందని చెబుతాను. కానీ జట్టులో చాలా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. కీలకమైన ఆటగాళ్లు గాయం బారిన పడి జట్టుకు దూరం కావడం కారణంగా.. జట్టులో మిడిల్ ఆర్డర్ సమస్య తీవ్రంగా ఉంది. ఆ సమస్యను పరిష్కరించుకోకపోతే మాత్రం ఒత్తిడి సమయాల్లో జట్టుకు ఇబ్బందులు తప్పవు అంటూ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రీ రిలీజ్ కి రెడీ అయిన 7/G బృందావన్ కాలనీ సినిమా..ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>