Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak93f1581f-e595-4d84-8316-7044e5881095-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pak93f1581f-e595-4d84-8316-7044e5881095-415x250-IndiaHerald.jpgఈ ఏడాది పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరగనుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక భారత్, పాకిస్తాన్ కు వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడంతో.. ఈ ఆసియా కప్ ను పాకిస్తాన్ తో పాటు శ్రీలంకలో మ్యాచ్ లు కూడా నిర్వహించేందుకు ఎసిసి నిర్ణయం తీసుకుంది. ఇక ఇటీవల ఆసియా కప్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించింది అని చెప్పాలి. ఈ నెలాఖరు నుంచి ఆసియా కప్ మ్యాచ్ లు మొదలు కాబోతున్నాయి. కాగా ఇక ఈ టోర్నీలో పాల్గొనబోయే అన్ని టీమ్స్ కూడా ఆసియా కప్ కోసం తమ జట్టు వివరాలను ప్రకటిస్తూ ఉండడంతో.. పాకిస్తాన్ టీం కూడా 18 మంది సభ్యులతPak{#}Shaan;Pakistan;Babur;septemberఆసియా కప్ కోసం పాక్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ కు నో ఛాన్స్?ఆసియా కప్ కోసం పాక్ జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్ కు నో ఛాన్స్?Pak{#}Shaan;Pakistan;Babur;septemberThu, 10 Aug 2023 12:30:00 GMTఈ ఏడాది పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరగనుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక భారత్, పాకిస్తాన్ కు వెళ్లేందుకు సుముఖంగా లేకపోవడంతో.. ఈ ఆసియా కప్ ను పాకిస్తాన్ తో పాటు శ్రీలంకలో మ్యాచ్ లు కూడా నిర్వహించేందుకు ఎసిసి నిర్ణయం తీసుకుంది. ఇక ఇటీవల ఆసియా కప్ కు సంబంధించిన షెడ్యూల్ కూడా ప్రకటించింది అని చెప్పాలి. ఈ నెలాఖరు నుంచి ఆసియా కప్ మ్యాచ్ లు మొదలు కాబోతున్నాయి. కాగా ఇక ఈ టోర్నీలో పాల్గొనబోయే అన్ని టీమ్స్ కూడా ఆసియా కప్ కోసం తమ జట్టు వివరాలను ప్రకటిస్తూ ఉండడంతో.. పాకిస్తాన్ టీం కూడా 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.


 కాగా బాబర్  కెప్టెన్ గా ఉండగా షాదాబ్ ఖాన్  వైస్ కెప్టెన్ గా వ్యవహరించాడు. కేవలం ఆసియా కప్ మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్తో జరగబోయే సిరీస్ కోసం కూడా పాకిస్తాన్ 18 మంది ప్లేయర్స్ వివరాలను ప్రకటించింది అని చెప్పాలి. అయితే పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ అయిన షాన్ మసూద్ ను మాత్రం పక్కన పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆసియా కప్ షెడ్యూల్ విషయానికి వస్తే బాబర్ జట్టు ఆగస్టు 30వ తేదీన నేపాల్తో మ్యాచ్ ఆడటం ద్వారా.. ఇక ఆసియా కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఇక తర్వాత సెప్టెంబర్ రెండవ తేదీన భారతతో హై వోల్టేజ్ మ్యాచ్ ఉండబోతుంది అని చెప్పాలి.



 మరోవైపు 18 మంది సభ్యులతో కూడిన పాకిస్తాన్ జట్టు ఆగస్టు 22 నుంచి 26 వరకు శ్రీలంకలో ఆఫ్ఘనిస్తాన్ తో 3 వన్ డేలా సిరీస్ ఆడబోతుంది  అయితే ఇలా షాన్ మసూద్ ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ.. దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆశ్రఫ్ కు జట్టులో చోటు కల్పించడం మాత్రం మరింత షాకింగ్ గా ఉంది అని చెప్పాలి. కాగా అతని రాకతో అటు పాకిస్తాన్ జట్టుకు మేలే జరుగుతుంది అని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ లో విఫలం అవడం కారణంగానే షాన్ మసూద్ ని పక్కన పెట్టారు అన్నది తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హిమాలయాలకు వెళ్లేముందు ఆ హీరోని విష్ చేసిన రజిని?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>