HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb304bb12-3278-461c-b536-627592e174fc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthb304bb12-3278-461c-b536-627592e174fc-415x250-IndiaHerald.jpgప్రస్తుత రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలామందిలో కూడా ఎముకల సమస్యలు మొదలవుతున్నాయి.ఇంకా అంతేకాకుండా ఆల్కహాల్‌ తీసుకోవడం, సిగరెట్‌ తాగడం వల్ల కూడా ఎముకలు చాలా పెలుసుగా మారుతున్నాయి.మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఎముకల సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి.అయితే ఈ సమస్యని ఒక చిన్న చిట్కాతో ఈజీగా నయం చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం పెద్దగా డబ్బు కూడా ఖర్చుచేయవలసిన అవసరం కూడా లేదు.దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.ప్రతిరోజు పొద్దున్నే రాగిజావ తాగడం వల్ల ఎముకల సమస్యలు తగ్గిపోయి చాలా బలంగా మారHEALTH{#}Jaggeryఎముకలు గట్టిగా అవ్వాలంటే ఇలా చెయ్యండి?ఎముకలు గట్టిగా అవ్వాలంటే ఇలా చెయ్యండి?HEALTH{#}JaggeryThu, 10 Aug 2023 20:54:00 GMTఎముకలు గట్టిగా అవ్వాలంటే ఇలా చెయ్యండి?


ప్రస్తుత రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల చాలామందిలో కూడా ఎముకల సమస్యలు మొదలవుతున్నాయి.ఇంకా అంతేకాకుండా ఆల్కహాల్‌ తీసుకోవడం, సిగరెట్‌ తాగడం వల్ల కూడా ఎముకలు చాలా పెలుసుగా మారుతున్నాయి.మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఎముకల సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి.అయితే ఈ సమస్యని ఒక చిన్న చిట్కాతో ఈజీగా నయం చేసుకోవచ్చు. అయితే ఇందుకోసం పెద్దగా డబ్బు కూడా ఖర్చుచేయవలసిన అవసరం కూడా లేదు.దాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.ప్రతిరోజు పొద్దున్నే రాగిజావ తాగడం వల్ల ఎముకల సమస్యలు తగ్గిపోయి చాలా బలంగా మారుతాయి. దీన్ని మీరు ఖచ్చితంగా ఒక అలవాటుగా మార్చుకోవాలి. రాగిజావ అనేది ఒక మంచి అల్పాహారమని చెప్పవచ్చు. ఇందులో మీరు పాలు కలిపితే ఇది మరింత పోషకంగా మారుతుంది. ఇక రాగులు అలాగే పాలు కాల్షియంకు మంచి మూలం. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి అధిక బరువును తగ్గించుకోవడానికి రాగిజావ చాలా బాగా సహాయపడుతుంది. అలాగే బాలింతలలో చనుబాలు పెంచడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది.ఇప్పుడు దీనిని ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.


ఇందుకు కావాలసిన పదార్థాల విషయానికి వస్తే..ముందుగా రాగి పిండి - 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. పాలు- 250 మి.లీ,బెల్లం - 2 టీస్పూన్లు ఇంకా యాలకుల పొడి- అవసరం మేరకు తీసుకోవాలి.ఈ రాగి జావ తయారీ విధానం విషయానికి వస్తే..ముందుగా పాలు తీసుకొని స్టవ్‌పై వేడిచేసి అందులో రాగిపిండిని వేయాలి.వాటిని ముద్దలు కాకుండా తరచుగా కలుపుతూ ఉండాలి.ఇందులో అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. పిండి ఒక 2 నిమిషాలు ఉడకిన తర్వాత బెల్లం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత యాలకుల పొడి చల్లాలి. అంతే ఇక వేడి వేడి రాగిజావ తయారైనట్లే. దీనిని కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకోవాలి. దీన్ని ప్రతిరోజు తాగితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల కానున్న "భోళా శంకర్" మూవీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>