LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthdf5f4f4d-aa8b-4612-a5a3-3bdcd12284be-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthdf5f4f4d-aa8b-4612-a5a3-3bdcd12284be-415x250-IndiaHerald.jpgఆవాలలో చాలా ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనం ప్రతిరోజూ వంటల్లో వాడడమే తప్ప చాలా మందికి వీటిని వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం తెలియవు. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికి వీటి వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు.గాయాలు తగిలినప్పుడు వాటిపై ఆవపొడిని చల్లుకోవడం వల్ల గాయాలు చాలా త్వరగా మానుతాయి. అలాగే నీటిలో కూడా ఆవాలను వేసి మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత నోట్లో పోసుకుని పుక్కిలింHEALTH{#}Shakti;Manamఆవాలు ఆరోగ్యానికి ఎంత మేలంటే?ఆవాలు ఆరోగ్యానికి ఎంత మేలంటే?HEALTH{#}Shakti;ManamThu, 10 Aug 2023 14:56:00 GMTఆవాలలో చాలా ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని వీటిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనం ప్రతిరోజూ వంటల్లో వాడడమే తప్ప చాలా మందికి వీటిని వల్ల కలిగే ప్రయోజనాలు మాత్రం తెలియవు. ఇవి చూడడానికి చిన్నగా ఉన్నప్పటికి వీటి వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు.గాయాలు తగిలినప్పుడు వాటిపై ఆవపొడిని చల్లుకోవడం  వల్ల గాయాలు చాలా త్వరగా మానుతాయి. అలాగే నీటిలో కూడా ఆవాలను వేసి మరిగించాలి. ఆ తరువాత ఈ నీటిని వడకట్టి గోరు వెచ్చగా అయిన తరువాత నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల దంతాల నొప్పులు ఈజీగా తగ్గుతాయి. అలాగే శ్వాసకోశ సమస్యలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక టీ స్పూన్ ఆవాల పొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలు చాలా త్వరగా తగ్గు ముఖం పడతాయి. అలాగే కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఆవాలు మనకు సహాయపడతాయి. ఆవాలు, కర్పూరం తీసుకొని వాటిని కలిపి మెత్తగా నూరాలి.


తరువాత ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు ఉన్న చోట రాయాలి.ఇలా చేయడం వల్ల నొప్పుల నుండి ఈజీగా ఉపశమనం కలుగుతుంది. ఇంకా అదే విధంగా ఆవాలను పేస్ట్ గా చేసి పులిపిర్లపై రాయాలి. ఇలా తరచూ రాయడం వల్ల పులిపిర్లు ఈజీగా రాలిపోతాయి. ఇంకా అలాగే వంటల్లో ఆవాలను వాడడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.ఆకలి పెరుగుతుంది. అలాగే జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. ఇంకా అదే విధంగా కొబ్బరి నూనెలో ఆవపొడిని కలిపి జుట్టు రాసుకుని అది ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా ఇంకా పొడవుగా పెరుగుతుంది. ఇంకా అలాగే చుండ్రు సమస్యతో బాధపడే వారు ఆవ నూనెను తలకు పట్టించడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధంగా ఆవాలు మనకు చాలా మేలు చేస్తాయని ఇకనైనా ఆవాలను ఏరిపారేయకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రీ రిలీజ్ కి రెడీ అయిన 7/G బృందావన్ కాలనీ సినిమా..ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>