MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgగత కొంతకాలంగా అక్కినేని హీరోల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటోంది. వారు నటించిన సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారుతున్న పరిస్థితులలో అక్కినేని కుటుంబ హీరోల మార్కెట్ చాలవరకు దెబ్బతింది. వాస్తవానికి నాగార్జున బుల్లితెర పై ప్రసారం అయ్యే ‘బిగ్ బాస్’ షోకు హోస్ట్ గా కొనసాగకపోతే నాగ్ కు సంబంధించిన వార్తలు పెద్దగా మీడియాలో కనిపించే ఆస్కారం లేదు. దీనికితోడు నాగార్జున వారసులు నాగచైతన్య అఖిల్ ల పరిస్థితి కూడ అంతంత మాత్రంగానే ఉన్న నేపధ్యంలో అక్కినేని హీరోలు పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నారు అన్న వార్తలు వస్తునnagarjuna{#}vegetable market;sunday;akhil akkineni;Akkineni Nagarjuna;Naga Chaitanya;Wife;Father;prema;Darsakudu;Love;News;Director;Cinemaఅఖిల్ కోసం తాను చేసిన త్యాగాన్ని బయటపెట్టిన నాగార్జున !అఖిల్ కోసం తాను చేసిన త్యాగాన్ని బయటపెట్టిన నాగార్జున !nagarjuna{#}vegetable market;sunday;akhil akkineni;Akkineni Nagarjuna;Naga Chaitanya;Wife;Father;prema;Darsakudu;Love;News;Director;CinemaThu, 10 Aug 2023 14:07:55 GMTగత కొంతకాలంగా అక్కినేని హీరోల పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటోంది. వారు నటించిన సినిమాలు అన్నీ వరస ఫ్లాప్ లుగా మారుతున్న పరిస్థితులలో అక్కినేని కుటుంబ హీరోల మార్కెట్ చాలవరకు దెబ్బతింది. వాస్తవానికి నాగార్జున బుల్లితెర పై ప్రసారం అయ్యే ‘బిగ్ బాస్’ షోకు హోస్ట్ గా కొనసాగకపోతే నాగ్ కు సంబంధించిన వార్తలు పెద్దగా మీడియాలో కనిపించే ఆస్కారం లేదు.



దీనికితోడు నాగార్జున వారసులు నాగచైతన్య అఖిల్ ల పరిస్థితి కూడ అంతంత మాత్రంగానే ఉన్న నేపధ్యంలో అక్కినేని హీరోలు పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నారు అన్న వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నాగార్జున ప్రస్తుతం ప్రసన్నకుమార్ తో ఒక ప్రాజెక్ట్ చయడానికి ప్రయత్నించినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగడంలేదు.



అయితే ఈ ప్రాజెక్ట్ లోకి ‘ఆరెక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి ఎంటర్ అయ్యాడు అన్నవార్తలు వస్తున్నప్పటికీ ఈవిషయమై అధికారిక ప్రకటన లేదు. ఇది ఇలా ఉండగా ‘బిగ్ బాస్’ షోలో పేరు తెచ్చుకున్న సుహైల్ హీరోగా నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన నాగార్జున తన మాటల మధ్యలో గతంలో తాను అఖిల్ కోసం చేసిన త్యాగాన్ని బయటపెట్టాడు.



తన భార్య అమలకు అఖిల్ పుట్టినప్పుడు తాను తన భార్యకు సహాయ సహకారాలు అందించడానికి తాను ఆరు నెలలు షూటింగ్ లకు వెళ్ళకుండా తాను రెండు మూడు సినిమాలు కూడ వదులుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. ఈవిషయం అఖిల్ పెద్ద అయ్యాక తెలుసుకుని తన కోసం ఆరు నెలలు కెరియర్ పక్కకు పెట్టిన తనను చూసి ‘నీ లాంటి తండ్రి నాకు దొరకడం అదృష్టం’ అంటూ భావోద్వేగానికి లోనైన విషయాన్ని తెలియచేశాడు. నాగార్జునకు తన పిల్లలు అంటే విపరీతమైన ప్రేమ కాబట్టి ఆదివారం వచ్చింది అంటే చాలు వారితో కలిసి భోజనం చేయకుండా నాగ్ ఉండలేడు అన్నవిషయం తెలిస్తే నాగ్ తన కుటుంబం పట్ల ఎంత అభిమానంగా ఉంటాడు అన్నది తెలుస్తుంది..  





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హిమాలయాలకు వెళ్లేముందు ఆ హీరోని విష్ చేసిన రజిని?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>