PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chiranjeevi-pawan-jagan04e653b1-1b92-47e0-8a95-d6f07b530e5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chiranjeevi-pawan-jagan04e653b1-1b92-47e0-8a95-d6f07b530e5f-415x250-IndiaHerald.jpgజనసేన నేతల సమావేశంలో కావచ్చు, లేదా బహిరంగసభల్లో మాట్లాడుతు తాను రోజుకు రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు చెప్పింది పవనే కదా. ఇదే రెమ్యునరేషన్ విషయాన్ని పవన్ పదేపదే బహిరంగసభల్లో చెప్పింది చిరంజీవికి తెలీదా ? రెమ్యునరేషన్ గురించి బహిరంగంగా మాట్లాడద్దని తమ్ముడికి చిరంజీవి బుద్ధి చెప్పుండచ్చు కదా. అలాగే సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడింది, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది పవనే కదా. chiranjeevi pawan jagan{#}Reddy;politics;Yevaru;Janasena;YCP;Pawan Kalyan;Chiranjeevi;Minister;Cinemaఅమరావతి : చిరంజీవి తమ్ముడిని కంట్రోల్ చేయలేరా ?అమరావతి : చిరంజీవి తమ్ముడిని కంట్రోల్ చేయలేరా ?chiranjeevi pawan jagan{#}Reddy;politics;Yevaru;Janasena;YCP;Pawan Kalyan;Chiranjeevi;Minister;CinemaWed, 09 Aug 2023 03:00:00 GMT


చిరంజీవి వ్యవహారమంతా అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లు అనే సామెతలాగుంది. సినిమా ఫంక్షన్లో చిరంజీవి మాట్లాడుతు యాక్టర్ల రెమ్యూనిరేషన్లపై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడుతున్నాయని ప్రశ్నించారు. పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రంలాగ ఫిల్మ్ ఇండస్ట్రీమీద పడతారేంటని నిలదీశారు. మీలాంటి వాళ్ళు ప్రత్యేకహోదా, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల గురించి ఆలోచించాలి, పేదల కడుపునింపే ఆలోచనలు చేయాలంటు హితవు పలికారు.





నిజమే, చిరంజీవి చెప్పినట్లుగా ప్రభుత్వాలు అంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అని మాత్రమే అర్ధం. మంత్రి అంబటి రాంబాబు తరచూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ గురించి పదేపదే మాట్లాడుతున్నారు. బహుశా దీన్ని మనసులో పెట్టుకునే తమ్ముడికి మద్దతుగా చిరంజీవి మండిపడినట్లు అర్ధమవుతోంది. అయితే దీనికి కారణం ఎవరనే విషయం మెగాస్టార్ కు తెలీదా ? రాజకీయ వేదికలపైనుండి సినిమాల్లో తన రెమ్యునరేషన్ గురించి, సినిమా ఫంక్షన్లలో ప్రభుత్వంపైన బురదచల్లేస్తున్నది ఎవరు ?





జనసేన నేతల సమావేశంలో కావచ్చు, లేదా బహిరంగసభల్లో మాట్లాడుతు తాను రోజుకు రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు చెప్పింది పవనే కదా. ఇదే రెమ్యునరేషన్ విషయాన్ని పవన్ పదేపదే బహిరంగసభల్లో చెప్పింది చిరంజీవికి తెలీదా ? రెమ్యునరేషన్ గురించి బహిరంగంగా మాట్లాడద్దని తమ్ముడికి చిరంజీవి బుద్ధి చెప్పుండచ్చు కదా. అలాగే సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడింది, ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది పవనే కదా.





తప్పులు తన తమ్ముడిలో పెట్టుకుని చిరంజీవి ప్రభుత్వం మీద పడిఏడిస్తే ఉపయోగం ఏమిటి ? ఎక్కడ ఏమిమాట్లాడాలనే విషయాన్ని ముందు తన తమ్ముడికి బుద్ధిచెప్పాలి. అప్పుడు అన్నచెప్పిన మాటలను పవన్ శ్రద్ధగా పాటిస్తే చాలా సమస్యలు పరిష్కారమైపోతాయి. అలా కాకుండా పవన్ తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతున్నంత కాలం ఈ గొడవ ఇలా కంటిన్యు అవుతునే ఉంటుంది. తమ్ముడికి బుద్ధిచెప్పలేక, కంట్రోల్లో ఉంచుకోలేక ప్రభుత్వాల మీద పడి చిరంజీవి ఏడవటమే విచిత్రంగా ఉంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"గాందేవదార అర్జున" మూవీ ట్రైలర్ విడుదల తేదీ... సమయం... వేదిక ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>