EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganc30526de-d4bb-41d5-9c5b-26289a90fba3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganc30526de-d4bb-41d5-9c5b-26289a90fba3-415x250-IndiaHerald.jpgప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు ఏం చేసినా ప్రజలకు సమ్మతం అయ్యే విధంగానే చేయాలి. వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించాలి‌. నైతికతతో మెలగాలి. అప్పుడే మళ్లీ వాళ్ళకి ప్రజలు పట్టం కట్టేది. లేదంటే నైతికత కోల్పోయిన వాళ్ళని తిరిగి తమ ప్రతినిధులుగా నిలబెట్టడానికి ఆలోచిస్తారు ఆ ప్రజలు. అసలు అంతవరకు పరిస్థితిని తెచ్చుకోకూడదు ఈ ప్రజా ప్రతినిధులు. తాజాగా హత్య కేసులో నిందితుడు అయినటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలోకి రానివ్వడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూర్చున్న వేదికపైనే ఆ వ్యకjagan{#}CBN;Y. S. Rajasekhara Reddy;police;Telangana Chief Minister;Driver;Murder.జగన్‌.. ఇది ఎంత మాత్రం మంచిది కాదు?జగన్‌.. ఇది ఎంత మాత్రం మంచిది కాదు?jagan{#}CBN;Y. S. Rajasekhara Reddy;police;Telangana Chief Minister;Driver;Murder.Wed, 09 Aug 2023 05:24:40 GMTప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు ఏం చేసినా ప్రజలకు సమ్మతం అయ్యే విధంగానే చేయాలి. వాళ్ల అభిప్రాయాన్ని గౌరవించాలి‌. నైతికతతో మెలగాలి. అప్పుడే మళ్లీ వాళ్ళకి ప్రజలు పట్టం కట్టేది. లేదంటే నైతికత కోల్పోయిన వాళ్ళని తిరిగి తమ ప్రతినిధులుగా నిలబెట్టడానికి ఆలోచిస్తారు ఆ ప్రజలు. అసలు అంతవరకు పరిస్థితిని తెచ్చుకోకూడదు ఈ ప్రజా ప్రతినిధులు.


తాజాగా హత్య కేసులో నిందితుడు అయినటువంటి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలోకి రానివ్వడం జరిగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కూర్చున్న వేదికపైనే ఆ వ్యక్తి కూడా కూర్చోవడం జరిగింది. హత్య కేసులో నిందితుడైనటువంటి వ్యక్తిని అసలు ముఖ్యమంత్రి కూర్చున్న  అదే వేదికపైకి ఎలా అనుమతి ఇచ్చారని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. విషయంలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు ఉద్దేశపూర్వకంగానే ఒక వ్యక్తిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది‌.


అనంత బాబు తన దగ్గర గతంలో పనిచేసిన డ్రైవర్ తన కుటుంబ విషయాలను, వ్యక్తిగత విషయాలను తెలుసుకుని తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనే ఆలోచనతో ఈ హత్యకు పూనుకున్నాడని సమాచారం. తన మాజీ డ్రైవర్ ని తన ఇంటికి పిలిపించుకుని మరీ కొట్టి చంపాడట ఆయన. అయితే ఈ హత్య ఏమీ అనుకోకుండా జరిగింది కాదు. ఉద్దేశం పూర్వకంగానే జరిగినదని చాలామంది అంటున్న మాట.


అలాంటి సందర్భంలో కూడా పోలీసులు అనంతబాబుని అరెస్టు చేయడానికి వెనుకాడారని తెలుస్తుంది. ఆ తర్వాత అరెస్టు చేసినా కూడా ఆయన బెయిల్ పై బయటకు వచ్చేసిన పరిస్థితి. ఈ వ్యక్తికి బెయిల్ మంజూరు అవ్వడం అనే విషయంపై కూడా హైకోర్టులో సవాల్ కూడా నడిచింది. అసలు ఎందుకు ఇంత స్పెషల్ గా ట్రీట్ చేస్తున్నారు  అంటే  ఆ ప్రాంతంలో కాపులు ఓట్లు పోగొట్టుకోకూడదని అనుకుంటున్నారు కొంత మంది. మరి అదే ప్రాంతంలో దళితుల ఓట్లు కూడా ఉన్నాయి కదా అవి వీరికి అవసరం లేదా అని అడుగుతున్నారు‌‌ జనాలు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"గాందేవదార అర్జున" మూవీ ట్రైలర్ విడుదల తేదీ... సమయం... వేదిక ఫిక్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>