EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan49a831b5-f1c2-4ee3-984c-8fdafecb2856-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan49a831b5-f1c2-4ee3-984c-8fdafecb2856-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో వర్షాలు, వరదలు వచ్చినపుడు ఒక్కో నాయకుడు వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు వరదలు వచ్చిన సమయంలో హుటాహుటిన ఆ ప్రాంతాలకు వెళ్లడం వరద సహాయక చర్యలను దగ్గర ఉండి చేపట్టడం బాధితులను పునరావాస ప్రాంతాలకు తరలించడం లాంటి పనులకు శరవేగంగా చేపడతారు. కఠిన సమయంలో కీలకంగా వ్యహరిస్తారని ఆయనకు పేరు ఉంది. ముఖ్యంగా తిత్లీ తుపాను సమయంలో దగ్గర ఉండి సహాయ చర్యలు చేపట్టారు.. కానీ ఆయన ఆయా వరద ప్రాంతాల నుంచి వెళ్లిపోయిన తర్వాత షరామామూలే అన్న సంగతి తెలిసిపోయింది. నిరాశ్రయులకు అందాల్సిన సJAGAN{#}Godavari River;CM;Jagan;CBNఆ విషయంలో.. జగన్‌, బాబు.. ఎవరి మార్గం కరెక్ట్‌?ఆ విషయంలో.. జగన్‌, బాబు.. ఎవరి మార్గం కరెక్ట్‌?JAGAN{#}Godavari River;CM;Jagan;CBNWed, 09 Aug 2023 23:00:00 GMTరాష్ట్రంలో వర్షాలు, వరదలు వచ్చినపుడు ఒక్కో నాయకుడు వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు వరదలు వచ్చిన సమయంలో హుటాహుటిన ఆ ప్రాంతాలకు వెళ్లడం వరద సహాయక చర్యలను దగ్గర ఉండి చేపట్టడం బాధితులను పునరావాస ప్రాంతాలకు తరలించడం లాంటి పనులకు శరవేగంగా చేపడతారు. కఠిన సమయంలో కీలకంగా వ్యహరిస్తారని ఆయనకు పేరు ఉంది.


ముఖ్యంగా తిత్లీ తుపాను సమయంలో దగ్గర ఉండి సహాయ చర్యలు చేపట్టారు.. కానీ ఆయన ఆయా వరద ప్రాంతాల నుంచి వెళ్లిపోయిన తర్వాత షరామామూలే అన్న సంగతి తెలిసిపోయింది. నిరాశ్రయులకు అందాల్సిన సరకులు, నిత్యావసరాలు, వారికి కావాల్సిన సౌకర్యాలు, నష్ట పరిహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చాలా విమర్శలు వచ్చాయి. అయితే వరదల సమయంలో మాత్రం మరింత బీభత్సం జరగకుండా ఆయన అనేక చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.


అయితే సీఎం జగన్ విషయంలోకి వచ్చే సరికి ఈయన రూటు సపరేటు.  ఎక్కడెక్కడ వరదలు వచ్చే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల అధికారులతో సమీక్ష నిర్వహించడం తద్వారా వారికి కావాల్సిన సాయం చేయడం తదితర పనులను చేపడతారు. కానీ ఈయన స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లరు. అక్కడ ఎలాంటి సాయం చేయాలో మాత్రం కచ్చితంగా చెబుతారు. ఎందుకంటే ఈయన పక్కా ప్లాన్ తో సహాయక చర్యలు చేపట్టడంతో ముందుంటారు.


వరద ప్రభావం తగ్గిన తర్వాత సాయం అందిన వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలను పరామర్శిస్తుంటారు. ఇంకా ఏం కావాలని అడుగుతుంటారు. ఇలా ఒక క్లారిటీతో ముందుకు సాగుతుంటారు. కాబట్టి ఈ విషయాల్లో చంద్రబాబు, జగన్ తీరు విభిన్నంగా ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో గోదావరి తీర ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశం ఉందని తేలడంతో సీఎం జగన్ తన ముందుస్తు వ్యుహాల్ని అమలు చేస్తున్నారు. అధికారులతో సమీక్షలు జరిపి తీసుకోవాల్సిన చర్యలను చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్యాక్ అందాలకు మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>