PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-polavaram-modi-chandrababu4c93ed08-ab3a-4495-bf11-daa0ae792c3a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-polavaram-modi-chandrababu4c93ed08-ab3a-4495-bf11-daa0ae792c3a-415x250-IndiaHerald.jpgపునరావాసంలో లబ్దిదారులకు డబ్బులు రాష్ట్రప్రభుత్వం ఇచ్చినా ఒకటే కేంద్రప్రభుత్వం ఇచ్చినా ఒకటే అని మోడీతో చెప్పినట్లు జగన్ చెప్పారు. లబ్దిదారులకు డబ్బులు చేరేందుకు కావాలంటే ఆ బటన్ మీరే నొక్కండని కూడా చెప్పానన్నారు. కేంద్రం నిధులిస్తే కానీ పునరావాస కార్యక్రమం పూర్తికాదని జగన్ స్పష్టంగా చెప్పేశారు. పునరావాసం కేంద్రం ఇచ్చే నిధులతో ముడిపడి ఉండటం మన ఖర్మన్నారు. జగన్ వైఖరి చూస్తుంటే ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేతిలో పెట్టేసినట్లే ఉంది.jagan polavaram modi chandrababu{#}mandalam;CBN;polavaram;Polavaram Project;Reddy;Jaganగోదావరి : పోలవరంపై కీలక నిర్ణయం తీసుకున్నారా ?గోదావరి : పోలవరంపై కీలక నిర్ణయం తీసుకున్నారా ?jagan polavaram modi chandrababu{#}mandalam;CBN;polavaram;Polavaram Project;Reddy;JaganWed, 09 Aug 2023 09:00:00 GMT



తాజాగా జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. పోలవరం ప్రాజెక్టులో కీలకమైన పునరావాసంపై జగన్ మాట్లాడారు. వరద ప్రభావిత ప్రాంతాలైన చింతూరు మండలం కూనవరం, కుక్కునూరు తదితర గ్రామాల ప్రజాలతో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతు ‘పోలవరం ప్రాజెక్టును కడుతున్నది నేను కాదు..కేంద్రప్రభుత్వమే కడుతోంది’ అని నరేంద్రమోడీకి చెప్పానని చెప్పారు. కేంద్రం నిధులిస్తేనే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని మోడీకి స్పష్టంగా చెప్పానన్నారు.





పునరావాసంలో లబ్దిదారులకు డబ్బులు రాష్ట్రప్రభుత్వం ఇచ్చినా ఒకటే కేంద్రప్రభుత్వం ఇచ్చినా ఒకటే అని మోడీతో చెప్పినట్లు జగన్ చెప్పారు. లబ్దిదారులకు డబ్బులు చేరేందుకు  కావాలంటే ఆ బటన్ మీరే నొక్కండని కూడా చెప్పానన్నారు. కేంద్రం నిధులిస్తే కానీ పునరావాస కార్యక్రమం పూర్తికాదని జగన్ స్పష్టంగా చెప్పేశారు. పునరావాసం కేంద్రం ఇచ్చే నిధులతో ముడిపడి ఉండటం మన ఖర్మన్నారు. జగన్ వైఖరి చూస్తుంటే ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేతిలో పెట్టేసినట్లే ఉంది.





కమీషన్లకు చంద్రబాబునాయుడు కక్కుర్తిపడకుండా ఉండుంటే ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలన్నీ కేంద్రమీదే ఉండేది. ప్రాజెక్టును కేంద్రం కట్టినా కట్టకపోయినా అప్పుడు పూర్తి బాధ్యత కేంద్రానిదే అయ్యుండేది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను చంద్రబాబు బలవంతంగా కేంద్రం నుండి తనచేతిలోకి తీసుకుని కంపుచేసేశారు. దాంతో నిర్మాణానికి, పునరావాసానికి అయ్యే ప్రతి రూపాయికి కేంద్రం మీద రాష్ట్రప్రభుత్వం ఆధారపడాల్సొస్తోంది. దీనివల్ల ప్రాజెక్టు బాగా ఆలస్యమవుతోంది. 2025 ఖరీఫ్ సీజన్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని జగన్ ప్రకటించారు.





అప్పుడు చంద్రబాబు చేసిన పనివల్ల ఇపుడు ప్రాజెక్టు రాష్ట్రప్రభుత్వానికి పెద్ద భారమైకూర్చుంది. అందుకనే ఈ భారాన్ని వదిలించుకోవాలని జగన్ చూస్తున్నట్లున్నారు.  ప్రాజెక్టుకయ్యే ప్రతి రూపాయి కేంద్రమే భరించాలి. ప్రాజెక్టులో జరుగుతున్న ప్రతి నిర్మాణమూ పోలవరం ప్రాజెక్టు అథారిటి(పీపీఏ) నిర్ణయం ప్రకారమే జరగాలి. ప్రాజెక్టు డిజైన్లను కూడా పీపీఏ ఆమోదించాల్సిందే. అందుకనే జగన్ మాట్లాడుతు ప్రాజెక్టును కడుతున్నది కేంద్రప్రభుత్వమే తాను కాదని చెప్పేసింది. చెప్పటం కాకుండా ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రానికి అప్పగించేస్తే రాష్ట్రప్రభుత్వంపై పెద్ద భారం దిగిపోతుంది. కేంద్రం ఏమిచేసుకుంటుందో దానిష్టం.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మహేష్ బర్త్ డే నాడు రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>