PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/data582dd3be-2f3c-4823-993a-8f8a0fe67e97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/data582dd3be-2f3c-4823-993a-8f8a0fe67e97-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు అందరి డేటా కలెక్ట్ చేసి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఏపీలోని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో కావాలనే వాలంటీర్ల పై ఆ వ్యవస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు ప్రభుత్వం మండిపడుతోంది. అయితే ఇలాంటి డేటా చాలా వరకు ఇక్కడే కాదు ప్రతి చోట దుర్వినియోగం అవుతుంది. అయితే ప్రస్తుతం డేటా ప్రొటెక్షన్ బిల్లు వచ్చింది. మన డేటాను చాలా మంది చాలా రకాలుగా దుర్వినియోగం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రైవేటు కంపెనీలకు తదితర వాటికి అమ్మేస్తుంటారు. బ్యాంకులకు ఇస్తున్న డేDATA{#}Smart phone;Minister;Government;YCPడేటా రక్షణ చట్టం వచ్చేసింది..!డేటా రక్షణ చట్టం వచ్చేసింది..!DATA{#}Smart phone;Minister;Government;YCPTue, 08 Aug 2023 07:05:00 GMTఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లు అందరి డేటా కలెక్ట్ చేసి దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఏపీలోని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో కావాలనే వాలంటీర్ల పై ఆ వ్యవస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు ప్రభుత్వం మండిపడుతోంది. అయితే ఇలాంటి డేటా చాలా వరకు ఇక్కడే కాదు ప్రతి చోట దుర్వినియోగం అవుతుంది.


అయితే ప్రస్తుతం డేటా ప్రొటెక్షన్ బిల్లు వచ్చింది. మన డేటాను చాలా మంది చాలా రకాలుగా దుర్వినియోగం చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రైవేటు కంపెనీలకు తదితర వాటికి అమ్మేస్తుంటారు. బ్యాంకులకు ఇస్తున్న డేటా కూడా అవి మిస్ యూస్ చేస్తున్నారు. రోజుకు చాలా మంది ఫోన్లకు 30, 40 కాల్స్ వస్తుంటాయి. వివిధ ఫోన్ కంపెనీల నుంచి ఇలా మిస్ యూస్ అవుతున్నట్లు తెలుస్తోంది.


దేశంలో పౌరుల డిజిటల్ హక్కులను బలోపేతం చేసేందుకు కేంద్రం ప్రభుత్వం చట్టం చేసింది. డేటా దుర్వనియోగం చేసే కంపెనీలపై కఠిన చర్యలకు ప్రత్యేక చట్టం చేసుకొచ్చింది.  డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును కేంద్రం లోక్ సభలో ప్రవేశ పెట్టింది. బిల్లు పరిశీలన కోసం పార్లమెంటరీ ప్యానల్ కు పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ నిరసనల మధ్య ఐటీ శాఖ మంత్రి ఆశ్వనీ వైష్ణవ్ మాట్లాడుతూ.. బిల్లు గురించి కీలక అంశాలను తెలియజేశారు.


ఏదైనా కంపెనీ వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలిస్తే రూ.50 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు జరిమానా విధించనున్నట్లు తెలిపారు.  ఈ చట్టం అమలుకు డేటా ప్రొటెక్షన్ బోర్డును అమలు చేయనున్నారు. కేంద్రంతో పాటు బోర్డు దానిలోని సభ్యులపై న్యాయపరమైన ఆంక్షలు ఉండవని పేర్కొన్నారు. దీంతో ప్రతిపక్షాలు ఆక్షేపించాయి. ఇలాంటి మినహాయింపులు ఇవ్వడానికి వీల్లేదని ప్రతిపక్షాలు కోరాయి. అన్ నౌన్ నంబర్స్ నుంచి కాల్స్ వచ్చినపుడు దానిపై కంప్లైంట్ ఇస్తే దానిపై చర్యలు తీసుకునేందుకు ఉపయోగ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో తమన్నా నిజస్వరూపం బయటపెట్టిన చిరంజీవి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>