Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimef602f8ce-1e68-4fc3-8f61-9e4f847d6e30-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimef602f8ce-1e68-4fc3-8f61-9e4f847d6e30-415x250-IndiaHerald.jpgనేటి నాగరిక సమాజంలో కూడా అక్కడక్కడ అనాగరిక ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో పిల్లల ఇష్టాన్ని గౌరవిస్తూ తల్లిదండ్రులు వారికి ఇష్టమైనప్పుడు వివాహం చేస్తూ ఉంటే.. కొంతమంది మాత్రం ఇంకా బాల్యవివాహాలతో అనాగరికత వైపే అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. 14 ఏళ్ల బాలికకు రహస్యంగా బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నించారు తల్లిదండ్రులు. కానీ బాలిక సర్పంచ్ సహాయంతో అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. కుంటాCrime{#}OLA;mandalam;santhanam;Naresh;allari naresh;Parents;marriage;policeవరుడి దగ్గర 25000 తీసుకొని.. ఏకంగా 14 ఏళ్ల కూతురుని?వరుడి దగ్గర 25000 తీసుకొని.. ఏకంగా 14 ఏళ్ల కూతురుని?Crime{#}OLA;mandalam;santhanam;Naresh;allari naresh;Parents;marriage;policeTue, 08 Aug 2023 12:00:00 GMTనేటి నాగరిక సమాజంలో కూడా అక్కడక్కడ అనాగరిక ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పెళ్లి విషయంలో పిల్లల ఇష్టాన్ని గౌరవిస్తూ తల్లిదండ్రులు వారికి ఇష్టమైనప్పుడు వివాహం చేస్తూ ఉంటే.. కొంతమంది మాత్రం ఇంకా బాల్యవివాహాలతో అనాగరికత వైపే అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. 14 ఏళ్ల బాలికకు రహస్యంగా బాల్య వివాహం చేసేందుకు ప్రయత్నించారు తల్లిదండ్రులు. కానీ బాలిక సర్పంచ్ సహాయంతో అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది.


 కుంటాల మండలం ఓల గ్రామానికి చెందిన దంపతులకు 14 ఏళ్ల కూతురు ఉంది. అయితే కుటుంబ సభ్యులు పది రోజుల క్రితం నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన 33 ఏళ్ల నరేష్ తో 14 ఏళ్ల కూతురికి బలవంతంగా నిశ్చితార్థం జరిపించారు.  అయితే ఇటీవల యువకుడు స్వగ్రామంలో పెళ్లి కూడా జరిపించారు. ఇక వివాహ కార్యక్రమాల అనంతరం కొత్తజంట సహా ఇరువైపులా కుటుంబ సభ్యులు ఓలా గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అందరూ మద్యం తాగేందుకు బయటకు వెళ్ళగా.. ఇదే అదనంగా భావించిన బాలిక గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర సర్పంచ్ ఫాతిమాను కలిసింది. తనకు పెళ్లి ఇష్టం లేదని.. తల్లి మేనమామ వరుడి కుటుంబ సభ్యులు వద్ద 25000 తీసుకొని తనను కొట్టి పెళ్లికి ఒప్పించారంటూ తన గోడును వెళ్ళబోసుకుంది.


 దీంతో వెంటనే అప్రమత్తమైన సర్పంచ్ పోలీసులకు ఐసిడిఎస్ అధికారులకు ఫిర్యాదు చేసింది. కాగా అక్కడికి చేరుకున్న అధికారులు బాలిక సహా ఇరువైపుల కుటుంబ సభ్యులను విచారించారు. వయస్సు ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. అయితే యువకుడికి గత జూలైలోనే మొదటి పెళ్లి జరిగిందని తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు. సంతానం కలగదని తెలిసి అతను మొదటి భార్యతో తెగదింపులు చేసుకొని.. నెల రోజుల వ్యవధిలోనే 14 ఏళ్ళ బాలికను మళ్లీ రెండో వివాహం చేసుకున్నాడు అన్న విషయం బయట పడింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడుని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఐసిడిఎస్ అధికారులు బాలికను సఖి కేంద్రానికి తరలించారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ సినిమాకి సూపర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>