PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-elections-are-my-priority-too-pawan-kalyan82edad98-77e4-4ac4-8244-6e2fcc044a1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-elections-are-my-priority-too-pawan-kalyan82edad98-77e4-4ac4-8244-6e2fcc044a1e-415x250-IndiaHerald.jpgపవన్ అభిమానులు లక్షల్లో ఉన్నారు. జనసేన నేతలు వేలల్లో ఉన్నారు. ఎవరైనా తాము ఏపీలో బతకలేకపోతున్నట్లు పవన్ కు చెప్పారా ? లేకపోతే ఇదే విషయమై కోర్టుల్లో ఏమైనా కేసు వేశారా ? జగన్ ప్రభుత్వంపై రెగ్యులర్ గా బురదచల్లటం తప్ప పవన్ కు మరో అజెండానే లేదు. బురదచల్లటానికి కొత్తగా ఏ అంశమూ దొరక్కపోతే పాత విషయాలనే తవ్వితీయటం పవన్ కు బాగా అలవాటైపోయింది. సంబంధంలేని అంశాల్లో కూడా జగన్ను లాగేసి బురదచల్లేస్తుంటారు. janasena pawan jagan {#}gulf countries;Mangalagiri;Janasena;Hyderabad;Jagan;Andhra Pradesh;police;Pawan Kalyan;Yevaru;MLAఅమరావతి : పవన్ వైసీపీని తట్టుకోలేకపోతున్నారా ?అమరావతి : పవన్ వైసీపీని తట్టుకోలేకపోతున్నారా ?janasena pawan jagan {#}gulf countries;Mangalagiri;Janasena;Hyderabad;Jagan;Andhra Pradesh;police;Pawan Kalyan;Yevaru;MLATue, 08 Aug 2023 03:00:00 GMT


‘ఏపీలో బతకటం కష్టం..గల్ఫ్ దేశాల్లోనే బెటర్’  ఇది గల్ఫ్ దేశాల్లోని జనసేన ప్రతినిధులను  ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు. ఏపీలో కౌన్సిలర్లు కూడా బెదిరిస్తున్నారట. రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా సమస్యవస్తే చెప్పుకోవటానికి తెలిసిన పోలీసు అధికారి అయినా ఉండాలి లేకపోతే ఎంఎల్ఏ సొంతకులం అయినా అయ్యుండాలన్నారు. ‘ఎక్కడో గల్ఫ్ దేశాల్లో మీరు ప్రశాంతంగా బతుకుతున్నారని, ఏపీలో ఆ పరిస్ధితులు లేవ’ని  పవన్ తెగ బాధపడిపోయారు.





పవన్ చెప్పిందంతా నిజమే అని అనుకుంటే మరి హైదరాబాద్ నుండి పవన్ మంగళగిరికి ఎందుకు మకాం మార్చారు ? తనకు తెలిసిన పోలీసు అధికారి కానీ లేదా సొంతకులానికి చెందిన ఎంఎల్ఏ ఎవరైనా ఉన్నారన్న ధైర్యంతోనే పవన్ హైదరాబాద్ నుండి మంగళగిరి వచ్చారా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పవన్ మాట్లాడే ప్రతి మాటలోను జగన్మోహన్ రెడ్డిపైన ఉన్న కసి కనబడుతుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.





పవన్ అభిమానులు లక్షల్లో ఉన్నారు. జనసేన నేతలు వేలల్లో ఉన్నారు. ఎవరైనా తాము ఏపీలో బతకలేకపోతున్నట్లు పవన్ కు చెప్పారా ? లేకపోతే ఇదే విషయమై కోర్టుల్లో ఏమైనా కేసు వేశారా ?  జగన్ ప్రభుత్వంపై రెగ్యులర్ గా బురదచల్లటం తప్ప పవన్ కు మరో అజెండానే లేదు. బురదచల్లటానికి కొత్తగా ఏ అంశమూ దొరక్కపోతే పాత విషయాలనే తవ్వితీయటం పవన్ కు బాగా అలవాటైపోయింది. సంబంధంలేని అంశాల్లో కూడా జగన్ను లాగేసి బురదచల్లేస్తుంటారు.




నిజంగానే ఏపీలో బతికే పరిస్ధితులు లేనపుడు తన రాజకీయమంతా తెలంగాణాలోనే చేసుకోవచ్చు కదా. లేకపోతే గల్ఫ్ దేశాలకూ వెళ్ళిపోవచ్చు. ఏపీలో ఉండమని పవన్ను ఎవరు అడగలేదు, రాజకీయాల్లో ప్రవేశించమని ఎవరూ బతిమలాడలేదు. ఎక్కడ మాట్లాడినా తనకు రాజకీయాల్లోకి ప్రవేశించాల్సిన అవసరం లేదని, సినిమాల్లో వందల కోట్ల రూపాయలు సంపాదిస్తు హాయిగా ఉన్నట్లు చెబుతుంటారు. ఏపీ రాజకీయాలను, జనాలను తద్వారా రాష్ట్రాన్ని ఉద్ధరించటానికే రాజకీయాల్లోకి ఎంటరైనట్లు బిల్డప్ ఇచ్చుకోవటం మాత్రం చాలా ఎక్కువ.  గల్ఫ్ దేశాల ప్రతినిధుల కుటుంబాలు ఏపీలోనే ఉంటున్న విషయాన్ని మరచిపోయినట్లున్నారు. ఏపీలో దాదాపు 5 కోట్లమంది బతగ్గలుగుతున్నపుడు పవన్ ఒక్కరికే ఏమైందో ?  




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో తమన్నా నిజస్వరూపం బయటపెట్టిన చిరంజీవి..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>