NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nrie46282eb-aca7-4642-80a6-a6db4736d9f4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/nrie46282eb-aca7-4642-80a6-a6db4736d9f4-415x250-IndiaHerald.jpgఒకప్పుడు బాగా చదువుకొని మంచి ఉద్యోగమో.. వ్యాపారమో చేసి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలని ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండేది. కానీ ఇప్పుడు ఉద్యోగమో.. వ్యాపారమో గురించి ఎవరు ఆలోచించడం లేదు. సోషల్ మీడియాలో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసి పాపులర్ అయితే చాలు ఆదాయం దానంతట అదే వస్తుంది అని ఎంతోమంది నమ్ముతూ ఉన్నారు. వెరసి నేటి రోజుల్లో యువకులు మొత్తం సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఉద్యోగంలో వ్యాపారంలో వచ్చిన ఆదాయం కంటే కాస్త ఎక్కువగానే సంపాదిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే కొంతమంది సోషల్ Nri{#}Italy;Senegal;Kurradu;Coronavirus;Athadu;Yevaru;job;vegetable market;Manam;News;Instagram;mediaఇంటర్నెట్లో నవ్వించే ఈ కుర్రాడి.. ఆదాయం తెలిస్తే మైండ్ బ్లాకే?ఇంటర్నెట్లో నవ్వించే ఈ కుర్రాడి.. ఆదాయం తెలిస్తే మైండ్ బ్లాకే?Nri{#}Italy;Senegal;Kurradu;Coronavirus;Athadu;Yevaru;job;vegetable market;Manam;News;Instagram;mediaTue, 08 Aug 2023 12:30:00 GMTఒకప్పుడు బాగా చదువుకొని మంచి ఉద్యోగమో.. వ్యాపారమో చేసి ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలని ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండేది. కానీ ఇప్పుడు ఉద్యోగమో.. వ్యాపారమో గురించి ఎవరు ఆలోచించడం లేదు. సోషల్ మీడియాలో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసి పాపులర్ అయితే చాలు ఆదాయం దానంతట అదే వస్తుంది అని ఎంతోమంది నమ్ముతూ ఉన్నారు. వెరసి నేటి రోజుల్లో యువకులు మొత్తం సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లుగా మారిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఉద్యోగంలో వ్యాపారంలో వచ్చిన ఆదాయం కంటే కాస్త ఎక్కువగానే సంపాదిస్తూ ఉన్నారు.


 ఈ క్రమంలోనే కొంతమంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల గురించిన వార్తలు అప్పుడప్పుడు తెరమీదికి  వస్తూ హాట్ టాపిక్గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన ఒక యువకుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అతని పేరు కాబి లామె. అయితే అతని పేరు ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ అతన్ని మాత్రం ఇంటర్నెట్లో యాక్టివ్ గా ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో చూసే ఉంటారు.అయితే నిండా పాతికేళ్లు కూడా లేని ఈ కుర్రాడు.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.


 టిక్ టాక్ ఇంస్టాగ్రామ్ లో అతని వీడియోలు నిత్యం వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో ఎంతోమంది షేర్ చేసె చిట్కాల్లో ఉన్న లోపాలను మనోడు చాలా సింపుల్గా ఎత్తిచూపుతూ చిత్ర విచిత్రమైన హావభావాలు పలికిస్తూ సోషల్ మీడియాలో పాపులారిటీ సాధించాడు. దీంతో దేశ సరిహద్దులు దాటి యావత్ ఇంటర్నెట్ ప్రపంచానికి దగ్గరయ్యాడు.


 ఆఫ్రికా దేశమైనా సెనెగల్ లో జన్మించిన ఈ కుర్రాడు చిన్నతనంలోనే ఫ్యామిలీతో కలిసి ఇటలీ వచ్చాడు. తర్వాత ఓ కంపెనీలో మిషన్ ఆపరేటర్ గా చేశాడు. కానీ కరోనా టైంలో అనేకమంది లాగానే అతను కూడా జాబ్ పోగొట్టుకున్నాడు. ఆ సమయంలోనే టిక్ టాక్ లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే సరికొత్తగా వీడియోలు తీయడం ప్రారంభించాడు. దీంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉన్న ఇతని సంపాదన గురించి తెలుస్తే మాత్రం మైండ్ బ్లాక్ అవుతుంది. ఏకంగా ఇతని ఇమేజ్కు ఉన్న నికర మార్కెట్ విలువ ఆరు మిలియన్ డాలర్లు అంటే 49 కోట్లు. అడ్వర్టైజ్మెంట్లు బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా  అతడు బోలెడంత సంపాదిస్తున్నారు



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జైలర్ సినిమాకి సూపర్ స్టార్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>