DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/papam-pak-china-assalu-pattinchukaba4a406-ae70-4680-ab7c-c7fd326c29bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/papam-pak-china-assalu-pattinchukaba4a406-ae70-4680-ab7c-c7fd326c29bc-415x250-IndiaHerald.jpgతన ఇరుగు పొరుగు దేశాలను ఉగ్రవాదం అనే తన ఆయుధంతో భయపెడుతూ వెళ్తుంది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ కూడా ఇప్పుడు వేరే దారి లేక చైనా చెప్పు చేతుల్లోకి వెళ్లి పోవాల్సి వస్తుంది అని తెలుస్తుంది. చైనా-పాకిస్తాన్ అకాడమిక్ కారిడార్ లో పెట్టుబడులు పెట్టాల్సింది చైనా పాకిస్తాన్ ప్రభుత్వాలు. అయితే ఈ అకాడమిక్ కారిడార్ లో చైనా అయితే పెట్టుబడులు పెట్టింది. కానీ పాకిస్తాన్ ఇంకా పెట్టుబడి పెట్టలేదని తెలుస్తుంది. పాకిస్తాన్ పెట్టుబడులు పెట్టడం లేదు కాబట్టి చైనా మిగిలిన నిధులను రిలీజ్ చేయడం లేదు. దాంతో ఎక్కడిCHINA{#}Pakistan;Turkey;terrorism;Industries;Yevaruపాపం పాక్‌.. చైనా అస్సలు పట్టించుకోవట్లేదుగా?పాపం పాక్‌.. చైనా అస్సలు పట్టించుకోవట్లేదుగా?CHINA{#}Pakistan;Turkey;terrorism;Industries;YevaruTue, 08 Aug 2023 23:00:00 GMTతన ఇరుగు పొరుగు దేశాలను ఉగ్రవాదం అనే తన ఆయుధంతో  భయపెడుతూ  వెళ్తుంది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ కూడా ఇప్పుడు వేరే దారి లేక చైనా చెప్పు చేతుల్లోకి వెళ్లి పోవాల్సి వస్తుంది అని తెలుస్తుంది. చైనా-పాకిస్తాన్ అకాడమిక్ కారిడార్ లో పెట్టుబడులు పెట్టాల్సింది చైనా పాకిస్తాన్ ప్రభుత్వాలు. అయితే ఈ అకాడమిక్ కారిడార్ లో చైనా అయితే పెట్టుబడులు పెట్టింది. కానీ పాకిస్తాన్ ఇంకా పెట్టుబడి పెట్టలేదని తెలుస్తుంది.


పాకిస్తాన్ పెట్టుబడులు పెట్టడం లేదు కాబట్టి చైనా మిగిలిన నిధులను రిలీజ్ చేయడం లేదు. దాంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది అకాడమిక్ కారిడార్ లో. టర్కీని పెట్టుబడి పెట్టడానికి పిలిచింది పాకిస్తాన్. అయితే టర్కీ కు పాకిస్తాన్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల పెద్దగా లాభం ఉండదని తెలిసి వెనకడుగు వేసిందట. పాకిస్తాన్ లో పరిశ్రమలు పెట్టడానికి అంత త్వరగా ఎవరు ముందుకు రారని టర్కీ ఆ నిర్ణయం తీసుకుందని సమాచారం. ఒకవేళ పెట్టుబడులు పెట్టినా కూడా లాభాలు సరిగా రావని  ఈ నిర్ణయం తీసుకుందట టర్కీ.


దాంతో పాకిస్తాన్ కూడా ఈ కారిడార్ విషయంలో వెనకడుగు వేస్తుందని తెలుస్తుంది. అయితే చైనా మాత్రం పాకిస్తాన్ విషయంలో వెనకడుగు వేయడం లేదట. ఎందుకంటే పాకిస్తాన్ ఏదైతే సిపెక్ ను నిర్మించిందో దానిని తమకు ఇచ్చేయ్యమని అడుగుతుందట చైనా‌‌. లేదంటే లీజుకు ఇచ్చినా కూడా తాము చేసుకుంటామని చెప్తుందట. దానికి ప్రతిఫలంగా డబ్బులు ఇస్తామని చెప్తుందట.


పాకిస్తాన్ కనుక ఈ విధంగా చైనాని పాకిస్తాన్లోకి అనుమతిస్తే పాకిస్తాన్ నడిబొడ్డున తన రాజ్యాన్ని  రెడీ చేసుకుంటుంది చైనా. ఆ తర్వాత చైనాకు ఇచ్చిన ప్రదేశంలో పాకిస్తాన్ కు అధికారం ఉండదు. తద్వారా చైనా చెప్పినట్లుగానే పాకిస్తాన్ నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇదంతా తెలిసినా కూడా మరో దారి లేక పాకిస్తాన్ చైనా ఆదిపత్యానికి అనుమతిని ఇవ్వడానికి సిద్ధపడుతుంది ఇప్పుడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టార్ హీరోని అన్నయ్య అని పిలుస్తున్న పూజ హెగ్డే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>