BusinessPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/central-government-employeesed0fce0b-874f-4e7b-997c-c55e43122584-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/central-government-employeesed0fce0b-874f-4e7b-997c-c55e43122584-415x250-IndiaHerald.jpgవచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఇంకా విపక్ష పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి.ఇక ఇప్పటికే పలు సర్వేలు కూడా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే వాటిపై నివేదికలు బయటపెట్టాయి.అయితే ఇందులో మాత్రం బీజేపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు పేర్కొన్నాయి.మరోవైపు మూడోసారి కూడా అధికారంలోకి రావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బాగా కసరత్తులు చేస్తోంది.ఇంకా అలాగే ప్రతిపక్షాల కూటమి అయిన ఇండియా కూడా బీజేపీని ఓడించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి CENTRAL GOVERNMENT EMPLOYEES{#}Bharatiya Janata Party;Good news;Drought;Good Newwz;Elections;Party;central government;News;Indiaకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ న్యూస్?కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ న్యూస్?CENTRAL GOVERNMENT EMPLOYEES{#}Bharatiya Janata Party;Good news;Drought;Good Newwz;Elections;Party;central government;News;IndiaSun, 06 Aug 2023 15:17:00 GMTవచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఇంకా విపక్ష పార్టీలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి.ఇక ఇప్పటికే పలు సర్వేలు కూడా వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అనే వాటిపై నివేదికలు బయటపెట్టాయి.అయితే ఇందులో మాత్రం బీజేపీ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు పేర్కొన్నాయి.మరోవైపు మూడోసారి కూడా అధికారంలోకి రావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ బాగా కసరత్తులు చేస్తోంది.ఇంకా అలాగే ప్రతిపక్షాల కూటమి అయిన ఇండియా కూడా బీజేపీని ఓడించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి ఎలాగైన గెలిచి తీరాలనే పట్టుదలతో అవి కంకణం కట్టుకున్నాయి. ఇందుకోసం చాలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా వివిధ శాఖల్లో ఇంకా అలాగే పలు విభాగాల్లో పనిచేస్తున్న కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇంకా ఫించన్ దారులకు చక్కటి గుడ్ న్యూస్ చెప్పనుంది.ఇక వీరికి ఆర్థిక ప్రయోజనాన్ని కల్పించే దిశగా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతుంది.అందుకే సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మంజూరు చేసే కరువు బత్యాన్ని పెంచనుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 42 శాతం కరవు బత్యం అందుతోంది.


కేంద్ర ప్రభుత్వం దీన్ని వారికి నెలవారి వేతనంతో కలిపి  చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం అమలులో ఉన్న కరువు బత్యానికి అదనంగా మొత్తం మూడు శాతాన్ని అదనంగా జత చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం గాను 45 శాతం కరువు భత్యం చెల్లించనున్నట్లు ప్రకటించనుంది. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ డీఏ పెంపుదల ఈ సంవత్సరం జులై 1వ తేది నుంచి అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకుంది. అయితే ఇక ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని అంటున్నారు.ఇదిలా ఉండగా ప్రస్తుతం మొత్తం 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.


ఇంకా అలాగే 69.76 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అయితే ఈ మూడు శాతం డీఏను అదనంగా పెంచడం వల్ల కేంద్ర ఖజానాపై అదనపు భారం అనేది పడనుంది.అంటే దాదాపు 12,815 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది.అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం కొంతవరకు నిరాశ వ్యక్తమవుతున్నట్లు సమాచారం తెలుస్తోంది.నిజానికి తాము నాలుగు శాతం డీఏ పెంపుదలను కోరుతున్నట్లు ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పాయింట్లను కేంద్ర ప్రభుత్వం పెంచుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. అయితే నాలుగు శాతం డియర్‌నెస్ అలవెన్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన అనేది రాలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తమన్నా@18 ఇయర్స్.. పెళ్లిపై క్లారిటీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>