MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyda376b78-2d2f-4b36-98ba-aa4c680340e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyda376b78-2d2f-4b36-98ba-aa4c680340e9-415x250-IndiaHerald.jpgపోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రకరకాల పథకాలు కస్టమర్లకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన ఆర్డీ పథకం ఇప్పుడు డిపాజిటర్లకు 6.2% వడ్డీ రేటును అందిస్తూ.. ఈ పథకంలో అనుమతించబడిన కనీస పెట్టుబడి నెలకు ₹100 నుండి ప్రారంభం అయ్యే విధంగా సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మీరు గరిష్ట పెట్టుబడి పరిమితి ఏమీ లేకుండా ఎంత డబ్బు ఉంటే అంత మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో డిపాజిట్ ఖాతా తెరిచిన తేదీ నుండి సుమారుగా ఐదు సంవత్సరాలు తర్వాత ఈ పథకం మెMONEYMoney: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంతో భారీ ఆదాయం.. ఎలా అంటే..?Money: ఈ పోస్ట్ ఆఫీస్ పథకంతో భారీ ఆదాయం.. ఎలా అంటే..?MONEYSun, 06 Aug 2023 11:00:00 GMTపోస్ట్ ఆఫీస్ అందిస్తున్న రకరకాల పథకాలు కస్టమర్లకు మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన ఆర్డీ పథకం ఇప్పుడు డిపాజిటర్లకు 6.2% వడ్డీ రేటును అందిస్తూ.. ఈ పథకంలో అనుమతించబడిన కనీస పెట్టుబడి నెలకు ₹100 నుండి ప్రారంభం అయ్యే విధంగా సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో మీరు గరిష్ట పెట్టుబడి పరిమితి ఏమీ లేకుండా ఎంత డబ్బు ఉంటే అంత మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

 ఇక పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో డిపాజిట్ ఖాతా తెరిచిన తేదీ నుండి సుమారుగా ఐదు సంవత్సరాలు తర్వాత ఈ పథకం మెచ్యూర్ అవుతుంది. ఇక పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ ప్రకారం ఖాతాదారులు సంబంధిత పోస్ట్ ఆఫీస్ కు దరఖాస్తుల సమర్పించడం ద్వారా మరో ఖాతాను కూడా ఇంకో ఐదు సంవత్సరాలు పొడిగించడానికి అనుమతించబడుతుంది. ఉదాహరణకు ఈ పథకం ద్వారా మీరు నెలకు 5000 రూపాయలను డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల లో ₹4.16 లక్షల రూపాయలు పొందవచ్చు. అదే 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం₹. 8.32 లక్షలు మీ చేతికి లభిస్తుంది. పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ఈ ఆర్డి పథకంలో మీరు నెలవారీగా 1000 రూపాయలను డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల లో₹ 70,431 అవుతుంది. ఒకవేళ మరో ఐదు సంవత్సరాలు పొడిగించాలని అనుకున్నట్లయితే అప్పుడు ₹1.66లక్షలు లభించే అవకాశం ఉంటుంది.

మీరు ఒకేసారి ₹10లక్షలకి పైగా  పొందాలి అని ఆలోచిస్తున్నట్లయితే ప్రతి నెల 10 వేల రూపాయల చొప్పున 10 సంవత్సరాలు పొడిగించినట్లయితే ₹16.6 లక్షలు పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ పథకం పోస్ట్ ఆఫీస్ అందిస్తోంది కాబట్టి మంచి ఆదాయంతో పాటు రిస్క్ లేని రాబడిని పొందవచ్చు. పైగా వడ్డీ కూడా లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో సంప్రదించి ఈ పథకం యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రజనీకాంత్ 170 వ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. సైన్స్ కి పూనకాలే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>