PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/punganur-peddireddy-chandrababu4e2aa473-e5b8-46b5-9570-6d0865ea7d6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/punganur-peddireddy-chandrababu4e2aa473-e5b8-46b5-9570-6d0865ea7d6e-415x250-IndiaHerald.jpgరాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించటమే పెద్దిరెడ్డి ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని చంద్రబాబుకు కూడా బలంగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్ధితి. ఎందుకంటే పుంగనూరులో టీడీపీ బలహీనంగా ఉంది. పైగా చంద్రబాబు లాగ పెద్దిరెడ్డి మాటలకు, వార్నింగులకు మాత్రమే పరిమితమయ్యే నేతకాదు, చేతల మనిషి. ప్రత్యర్ధుల విషయంలో చేయాలని అనుకున్న పనిని పెద్దిరెడ్డి ఆచరణలో చూపిస్తారు. సో ఇలాంటి అనేక కారణాలతో మంత్రంటే చంద్రబాబు మండిపోతున్నారు. punganur peddireddy chandrababu{#}Chittoor;Rayalaseema;TDP;Punganur;Gharshana;Ananthapuram;CBN;YCP;Yatra;Evening;war;Friday;police;Ministerరాయలసీమ : అల్లర్లకు చంద్రబాబే కారణమా ?రాయలసీమ : అల్లర్లకు చంద్రబాబే కారణమా ?punganur peddireddy chandrababu{#}Chittoor;Rayalaseema;TDP;Punganur;Gharshana;Ananthapuram;CBN;YCP;Yatra;Evening;war;Friday;police;MinisterSun, 06 Aug 2023 03:00:00 GMT


పుంగనూరులో శుక్రవారం మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు జరిగిన అల్లర్లకు చంద్రబాబునాయుడే కారణమా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా చేసిన పనివల్లే కొన్నిగంటల పాటు అల్లర్లు జరిగాయని పోలీసులు కూడా తేల్చేశారు. అల్లర్లు రేపే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు పుంగనూరు పట్టణంలోకి అడుగుపెట్టినట్లు అర్ధమవుతోంది. కారణం ఏమిటంటే కుప్పంలో తన ఓటమికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా కష్టపడుతున్నారు. దాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు.





రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడించటమే పెద్దిరెడ్డి ఏకైక ధ్యేయంతో పనిచేస్తున్నారు. పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని చంద్రబాబుకు కూడా బలంగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్ధితి. ఎందుకంటే పుంగనూరులో టీడీపీ బలహీనంగా ఉంది. పైగా చంద్రబాబు లాగ పెద్దిరెడ్డి మాటలకు, వార్నింగులకు మాత్రమే పరిమితమయ్యే నేతకాదు, చేతల మనిషి. ప్రత్యర్ధుల విషయంలో చేయాలని అనుకున్న పనిని పెద్దిరెడ్డి ఆచరణలో చూపిస్తారు. సో ఇలాంటి అనేక కారణాలతో మంత్రంటే చంద్రబాబు మండిపోతున్నారు.





ఇద్దరి మధ్య తీవ్రస్ధాయిలో మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే చంద్రబాబు సడెన్ గా పుంగనూరులోకి ప్రవేశించారు. రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన యాత్ర షెడ్యూల్ లో పుంగనూరు లేదు. అనంతపురం జిల్లాలో నుండి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించిన చంద్రబాబు పుంగనూరు బైపాస్ రోడ్డుమీద నుండి చిత్తూరుకు వెళ్ళిపోవాలి. పోలీసులకు ఇచ్చిన రోడ్డుమ్యాపులో ఇలాగే ఉంది.





అలాంటిది రోడ్డుమ్యాపు ప్రకారం కాకుండా సడెన్ గా కావాలనే చంద్రబాబు తన కాన్వయ్ తో  పుంగనూరు టౌన్లోకి ప్రవేశించారు. పట్టణంలోకి ప్రవేశించేందుకు చంద్రబాబును పోలీసులు అనుమతించలేదు. రూటుమ్యాపు ప్రకారమే వెళ్ళాలని విజ్ఞప్తిచేశారు. అయితే పోలీసులను దాటుకుని టౌన్లోకి ప్రవేశించేందుకు చంద్రబాబు, నేతలు, క్యాడర్ ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు మద్దతుగా నిలబడ్డారు. దాంతో టీడీపీ-పోలీసులు-వైసీపీ మధ్య తోపులాటలతో మొదలైన ఘర్షణ చివరకు దాడులవరకు చేరుకున్నది. దాని ఫలితంగానే పోలీసులతో పాటు  వైసీపీ, టీడీపీ శ్రేణులకు దెబ్బలు, చంద్రబాబు గనుక రూటుమ్యాపుకే పరిమితమయ్యుంటే అసలు గొడవలు జరిగేవే కాదు.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్లో హాట్ స్కిన్ షో తో రచ్చ చేస్తున్న కృతి శెట్టి..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>