Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tilak1b758cb8-13a7-4090-9a50-c5479dc755c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/tilak1b758cb8-13a7-4090-9a50-c5479dc755c7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు.. అక్కడ టి20 సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా అటు టెస్ట్ సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టి20 సిరీస్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగింది. అయితే ఇప్పటికే రెండు సిరీస్ లలో గెలిచిన జోరులో ఉన్న టీమిండియా ఇక ఎంతో అలవోకగా టి20 సిరీస్ ని కూడా కైవసం చేసుకుంటుంది అని అందరూ భావించారు. అయితే టి20 లలో పటిష్టమైన జట్టుగా పేరున్న వెస్టిండీస్ మొదటి మ్యTilak{#}Ram Gopal Varma;Rohit Sharma;West Indies;GEUM;Fidaa;Hardik Pandya;Athadu;India;Teluguఏదో రాష్ట్ర స్థాయికి ఆడినట్లు.. తిలక్ బ్యాటింగ్ ఉంది : వసీం జాఫర్ఏదో రాష్ట్ర స్థాయికి ఆడినట్లు.. తిలక్ బ్యాటింగ్ ఉంది : వసీం జాఫర్Tilak{#}Ram Gopal Varma;Rohit Sharma;West Indies;GEUM;Fidaa;Hardik Pandya;Athadu;India;TeluguSat, 05 Aug 2023 17:15:00 GMTప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా జట్టు.. అక్కడ టి20 సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా అటు టెస్ట్ సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టి20 సిరీస్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగింది. అయితే ఇప్పటికే రెండు సిరీస్ లలో గెలిచిన జోరులో ఉన్న టీమిండియా ఇక ఎంతో అలవోకగా టి20 సిరీస్ ని కూడా కైవసం చేసుకుంటుంది అని అందరూ భావించారు. అయితే టి20 లలో పటిష్టమైన జట్టుగా పేరున్న వెస్టిండీస్ మొదటి మ్యాచ్ లోనే టీమ్ ఇండియాకు ఊహించని షాక్ ఇచ్చింది.


 మొదటి టి20 మ్యాచ్ లో భారత బౌలర్లు పర్వాలేదనిపించిన అటు వెస్టిండీస్ బౌలర్ల దాటికి భారత బ్యాటింగ్ విభాగం మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయితే జట్టు ఓడిపోయినప్పటికీ.. టీమ్ ఇండియా తరఫున మొదటి మ్యాచ్ ఆడిన తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ మాత్రం తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. తాను ఎదురుకున్న రెండో బంతిని సిక్సర్ గా మలిచిన తిలక్ వర్మ ఇక మూడో బంతిని కూడా భారీ సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మొదటి మ్యాచ్ అయినప్పటికీ ఎక్కడ భయం బెరుకు లేకుండా ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా బ్యాటింగ్ చేయడం అందరిని ఫిదా చేసేసింది.


 22 బంతుల్లో 39 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడిన తిలక్ వర్మపై ప్రస్తుతం మాజీ క్రికెటర్లు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత మాజీ ప్లేయర్ వసీం జాఫర్ సైతం ప్రశంసలు కురిపించాడు. ఏదో క్లబ్ గేమ్ లోనో.. రాష్ట స్థాయి జట్టుకో ఆడుతున్నట్లు తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఒత్తిడిని ఏమాత్రం దయచేయడనివ్వలేదు. అద్భుతంగా బ్యాటింగ్ చేసాడు. ఇంత స్ట్రాంగ్ గా ఆడటం చూస్తుంటే అతని మానసిక దృఢత్వం అర్థమవుతుంది. పిచ్ పై మిగతా వాళ్లంతా విఫలమవుతున్న వేళ అతడు మాత్రం ఇబ్బందులు లేకుండా ఆడాడు అంటూ వసీం జాఫర్ అతనిపై ప్రశంసలు కురిపించాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రముఖి 2: కంగనా పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>