AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/maruthi-suzuki16179352-cf52-4155-99a2-30d79d3efbc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/maruthi-suzuki16179352-cf52-4155-99a2-30d79d3efbc4-415x250-IndiaHerald.jpgఇండియన్ మార్కెట్‌లో మారుతి సుజుకీ కార్లు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మారుతీ సుజుకి కంపెనీ తన ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు కొత్త కార్లను పరిచయం చేస్తోంది. ఇక ఇందులో భాగంగా ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి ఇన్విక్టోను గత నెలలో రిలీజ్ చేసింది.ఇన్విక్టో కారు ఎంట్రీ లెవల్‌ జీటా ప్లస్‌ వేరియంట్‌ ఇప్పుడు వెనుక సీట్‌బెల్ట్‌ రిమైండర్‌తో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఇన్విక్టో ధర వచ్చేసి మొత్తం రూ.24.82 లక్షల (ఎక్స్‌షోరూం)తో ప్రారంభం అవుతుంది.ఇక లాంచ్‌ సమయంలో టాప్‌ ఎండ్MARUTHI SUZUKI{#}Toyota;Degree;Audio;maruti;Carసూపర్ సేఫ్టీ ఫీచర్లతో మారుతి సుజుకి ఇన్విక్టో?సూపర్ సేఫ్టీ ఫీచర్లతో మారుతి సుజుకి ఇన్విక్టో?MARUTHI SUZUKI{#}Toyota;Degree;Audio;maruti;CarSat, 05 Aug 2023 18:27:00 GMTఇండియన్ మార్కెట్‌లో మారుతి సుజుకీ కార్లు కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మారుతీ సుజుకి కంపెనీ తన ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు కొత్త కార్లను పరిచయం చేస్తోంది. ఇక ఇందులో భాగంగా ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మారుతి సుజుకి ఇన్విక్టోను గత నెలలో రిలీజ్ చేసింది.ఇన్విక్టో కారు ఎంట్రీ లెవల్‌ జీటా ప్లస్‌ వేరియంట్‌ ఇప్పుడు వెనుక సీట్‌బెల్ట్‌ రిమైండర్‌తో అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఇన్విక్టో ధర వచ్చేసి మొత్తం రూ.24.82 లక్షల (ఎక్స్‌షోరూం)తో ప్రారంభం అవుతుంది.ఇక లాంచ్‌ సమయంలో టాప్‌ ఎండ్ వేరియంట్‌ ఆల్ఫా ప్లస్‌లో మాత్రమే వెనుక సీట్‌ బెల్ట్‌ రిమైండర్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం లాంచ్‌ కాబోయే అన్ని కార్లలో ఈ ఫీచర్‌ను తప్పనిసరి చేసింది. అందువల్ల వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులు కూడా సీట్‌ బెల్ట్‌లు ధరించాలని ఈ ఫీచర్‌ గుర్తుచేస్తుంది. అందుకే ఈ కారు ధర రూ.3000 పెరిగింది.టయాటా ఇన్నోవా హైక్రాస్‌ ఆధారంగా మారుతి సుజుకి ఇన్విక్టో కారు రిలీజ్ అయింది. టయోటా ఇంకా మారుతి సుజుకి ఇప్పటికే ఉన్న బ్యాడ్జ్‌ స్వాపింగ్‌ డీల్‌లో భాగంగా ఈ కారును తయారుచేశారు. ఇన్నోవా లాగానే ఇన్విక్టో కూడా చాలా బాగా ఆకట్టుకొనే అవకాశం ఉంది. సుజుకి నెక్సా డీలర్‌షిప్‌లో లాంచ్ అయిన ఎనిమిదో మోడల్‌ ఈ ఇన్విక్టో. మారుతి ఇన్విక్టో MPV నెక్సా బ్లూ, మిస్టిక్‌ వైట్‌, మెజిస్టిక్‌ సిల్వర్‌ ఇంకా స్టిల్లర్‌ బ్రౌన్స్‌ మొత్తం నాలుగు రంగుల్లో లభిస్తుంది.


ఇక మారుతి సుజుకి హైబ్రిడ్‌ సెటప్‌లో అట్కిన్సన్‌ సైకిల్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తోపాటు NIMH బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఎలక్ట్రిక్‌ మోటార్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 184bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 9.5 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. మారుతి ఇన్విక్టో మొత్తం 23.24 kmpl మైలేజీని ఇస్తుంది.ఈ కొత్త MPV కార్ సరికొత్త గ్రిల్‌తో వస్తుంది. సుజుకి బ్యాడ్జ్‌కి LED హెడ్‌లైట్‌లను కనెక్ట్‌ చేసే క్రోమ్‌ స్లాట్‌లను ఈ కార్ కలిగి ఉంది. దీని ముందు, వెనుక బంపర్‌ల లాగానే హెడ్‌ల్యాంప్‌లు ఇంకా DRLలు అప్‌డేట్‌ చేయబడ్డాయి. అలాగే ఈ కారు లోపలి భాగంలో ఖరీదైన అప్హోల్స్టరీతో పాటు లగ్జరీ ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యాష్‌బోర్డు మొత్తం 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్‌ ఆండ్రాయిడ్‌ ఆటో ఇంకా ఆపిల్‌ కార్ల్‌ప్లేకి సపోర్ట్ ఇస్తుంది.మారుతి సుజుకి ఇన్విక్టో పనోరమిక్‌ సన్‌రూఫ్‌, ప్రీమియం ఆడియో సిస్టమ్‌ ఇంకా సుజుకి కనెక్ట్‌ సూట్‌ను కలిగి ఉంటుంది.ఇంకా అలాగే ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, 360 డిగ్రీ కెమెరా, వెర్‌లైస్‌ ఛార్జర్‌ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంది.అలాగే డ్రైవర్‌ సీటుని కూడా మొత్తం 8 విధాలుగా సర్టుబాటు చేయవచ్చు. ఇక రెండు, మూడు వరుసలో కెప్టెన్‌ సీట్లు ఉంటాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రముఖి 2: కంగనా పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>