MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan76befa88-0f66-4639-b45d-52911099d6b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan76befa88-0f66-4639-b45d-52911099d6b2-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలంటే ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారో తెలిసిందే. ఆయన సినిమాలకు మార్కెట్ లో కూడా అదేస్థాయిలో డిమాండ్ ఉంటుంది.జనాలు కోరుకునే అంశాలను తనదైన శైలిలో వెండితెరపై ప్రజెంట్ చేస్తుంటారు. ఇక శంకర్ సినిమా అంటే సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. వాటి షూటింగ్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. 'ఒకే ఒక్కడు' నుంచి 'రోబో', 'ఐ' వంటి సినిమాల వరకు సాంగ్స్ రిచ్ గా ఉండేలా చూశారు. భారీ సెట్స్ లో షూట్ చేసి ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియెన్స్ ను అందించారు.ఇక ప్రస్తుతం మెగా పవర్ స్RAM CHARAN{#}johnny;Johnny;kushi;Dil;Pawan Kalyan;thaman s;shankar;vegetable market;Audience;Cinema;prem;Directorగేమ్ చేంజర్: వామ్మో పాటలకి అన్ని కోట్ల బడ్జెటా?గేమ్ చేంజర్: వామ్మో పాటలకి అన్ని కోట్ల బడ్జెటా?RAM CHARAN{#}johnny;Johnny;kushi;Dil;Pawan Kalyan;thaman s;shankar;vegetable market;Audience;Cinema;prem;DirectorSat, 05 Aug 2023 17:08:26 GMTకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమాలంటే ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారో తెలిసిందే. ఆయన సినిమాలకు మార్కెట్ లో కూడా అదేస్థాయిలో డిమాండ్ ఉంటుంది.జనాలు కోరుకునే అంశాలను తనదైన శైలిలో వెండితెరపై ప్రజెంట్ చేస్తుంటారు. ఇక శంకర్ సినిమా అంటే సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి. వాటి షూటింగ్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. 'ఒకే ఒక్కడు' నుంచి 'రోబో', 'ఐ' వంటి సినిమాల వరకు సాంగ్స్ రిచ్ గా ఉండేలా చూశారు. భారీ సెట్స్ లో షూట్ చేసి ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియెన్స్ ను అందించారు.ఇక ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్, కొన్ని లీకైన వీడియోలతో కూడా సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామంటూ ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కొంచెం వాయిదా పడింది.


 'భారతీయుడు 2' షూట్ పై శంకర్ ఫుల్ గా ఫోకస్ పెట్టడంతో కొద్దిగా షూట్ పూర్తయ్యే సరికి ఇంకాస్తా సమయం పట్టనుంది.అయితే ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. సినిమాలోని పాటల కోసమే ఏకంగా రూ.90 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. గ్రాండియర్ గా, చాలా అద్భుతమైన విజువల్స్ తో సాంగ్స్ ను రూపొందిస్తున్నారంట. అంతపెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారంటే ఇంకా అవుట్ పుట్ కూడా ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.అలాగే మరోవైపు శంకర్ ప్రొడ్యూసర్ దిల్ రాజును సాంగ్స్ కోసం ఒప్పించి మరీ అంతా ఖర్చు చేయిస్తున్నారని సమాచారం. దీంతో సినిమాపై చాలా ఆసక్తి పెరిగింది.'గేమ్ ఛేంజర్' మూవీలో మొత్తం ఐదు సాంగ్స్ ఉంటాయని సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే. ప్రతి సాంగ్ కూడా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని హామీనిచ్చారు. ప్రస్తుతం థమన్ ట్రెండే కొనసాగుతుండటంతో ఈ సినిమాకూ అదిరిపోయే ట్యూన్స్ కూడా ఇస్తారని మ్యూజిక్ లవర్స్ నమ్ముతున్నారు. అలాగే టాప్ కొరియోగ్రాఫర్లు ప్రభుదేవా, జానీ మాస్టర్, ప్రేమ్ రక్షిత్, ఇంకా గణేశ్ మాస్టర్స్ ఒక్కో సాంగ్ కు కొరియోగ్రఫీ అందించారని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రముఖి 2: కంగనా పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>