EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababufe230b0b-c21e-49d7-b9f6-2bde85b5de7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababufe230b0b-c21e-49d7-b9f6-2bde85b5de7d-415x250-IndiaHerald.jpgగతంలో ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు విసృతంగా ప్రచారం చేసి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తామని చెప్పేవి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజకీయాల్లో మద్యపాన నిషేధం చేస్తామని ప్రకటించేవారు. మద్యం దశల వారీగా తగ్గిస్తామని చెప్పి ఆ విధంగా హామీలు చేసేవారు. గతంలో ఎన్టీఆర్ లాంటి నాయకులు మద్య పాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఏపీ సీఎం మద్యపాన నిషేధం అనే ప్రొగ్రాంను ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టి దాన్ని 20 శాతం అమలు చేశారు. కానీ ప్రతిCHANDRABABU{#}NTR;Andhra Pradesh;Party;CBN;CMబాబు అధికారంలోకి వస్తే మందు ధరలు తగ్గుతాయా?బాబు అధికారంలోకి వస్తే మందు ధరలు తగ్గుతాయా?CHANDRABABU{#}NTR;Andhra Pradesh;Party;CBN;CMSat, 05 Aug 2023 00:00:00 GMTగతంలో ఎన్నికల సమయంలో ఆయా రాజకీయ పార్టీలు విసృతంగా ప్రచారం చేసి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీరుస్తామని చెప్పేవి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రాజకీయాల్లో మద్యపాన నిషేధం చేస్తామని ప్రకటించేవారు. మద్యం దశల వారీగా తగ్గిస్తామని చెప్పి ఆ విధంగా హామీలు చేసేవారు.


గతంలో ఎన్టీఆర్ లాంటి నాయకులు మద్య పాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం ఏపీ సీఎం మద్యపాన నిషేధం అనే ప్రొగ్రాంను ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టి దాన్ని 20 శాతం అమలు చేశారు. కానీ ప్రతిపక్ష పార్టీ నేత సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రం తాము అధికారంలోకి వస్తే మందు ధరల్ని తగ్గిస్తామని చెబుతున్నారు. రాయలసీమలో జరిగిన ఒక బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ సీఎం జగన్ మందు ధరల్ని పెంచేశారు. నాణ్యమైన మందును పంపిణీ చేయడం లేదని తాము అధికారంలోకి రాగానే వెంటనే దాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.


రాష్ట్ర వ్యాప్తంగా మందు తాగి ఎంతో మంది అనారోగ్యం పాలవుతున్నారు. వారి జీవితాలతో పాటు వారి కుటుంబ సభ్యులు రోడ్డున పడుతున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు ఏం ఆలోచిస్తున్నాయో తెలియడం లేదు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు చేపడతామని చెప్పడానికి బదులు మేం అధికారంలోకి వస్తే మందు ధరలు తగ్గిస్తామని చెప్పడం సమాజంలో ఎటు పోతున్నామో తెలియని పరిస్థితి.


కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మద్య పాన నిషేధం చేయాలని మరో మారు మహిళలు, ప్రజలు రోడ్డుకెక్కి నిరసన చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రజలకు అవసరమైన ఉపాధి కల్పించే పథకాలు తీసుకోస్తామని చెప్పాలి. రైతులకు, యువతకు, మహిళలకు ఎలాంటి పథకాలు ప్రవేశపెడతారో చెప్పాల్సిన రాజకీయ నాయకులు తాము అధికారంలోకి వస్తే మందు ధరలు తగ్గిస్తామని చెప్పడం శోచనీయమని పలు రాజకీయ పార్టీల నేతలు, మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బికినీ ఫోటోలతో స్టన్ చేస్తున్న రామ్ చరణ్ బ్యూటీ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>