Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/virald43df1f6-3064-4d0a-9d80-a83a7e47d7d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/virald43df1f6-3064-4d0a-9d80-a83a7e47d7d7-415x250-IndiaHerald.jpgక్లాస్ రూమ్ లో ఎప్పుడు ఎంత చదివాడు అన్నది కాదు.. ఎగ్జామ్ లో ఎవడు ఎంత రాసాడు అన్నదే ముఖ్యం అనే ఒక డైలాగ్ కే సరిగ్గా సరిపోయే సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. పృథ్వి షా విషయంలో ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. టీమ్ ఇండియాలోకి యువ సంచలనంగా అరంగేట్రం చేసిన పృథ్వి షా కొన్నాళ్లపాటు మెరుపుల మెరిపించాడు. కానీ ఆ తర్వాత నిలకడ లేమీతో పూర్తిగా జట్టుకు దూరమయ్యాడు. అతను టీమ్ ఇండియా తరఫున ఆడక కొన్ని నెలలు గడిచిపోతుంది. ఇక ఐపీఎల్ లోను పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక మైదానం బయViral{#}prudhvi raj;Cricket;England;Netherlands;Yuva;Indiaప్రాక్టీస్ లో అదరగొట్టాడు.. కానీ మైదానంలో చిత్రంగా ఔట్ అయ్యాడు?ప్రాక్టీస్ లో అదరగొట్టాడు.. కానీ మైదానంలో చిత్రంగా ఔట్ అయ్యాడు?Viral{#}prudhvi raj;Cricket;England;Netherlands;Yuva;IndiaSat, 05 Aug 2023 09:29:00 GMTక్లాస్ రూమ్ లో ఎప్పుడు ఎంత చదివాడు అన్నది కాదు.. ఎగ్జామ్ లో ఎవడు ఎంత రాసాడు అన్నదే ముఖ్యం అనే ఒక డైలాగ్ కే సరిగ్గా సరిపోయే సంఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. పృథ్వి షా విషయంలో ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. టీమ్ ఇండియాలోకి యువ సంచలనంగా అరంగేట్రం చేసిన పృథ్వి షా కొన్నాళ్లపాటు మెరుపుల మెరిపించాడు. కానీ ఆ తర్వాత నిలకడ లేమీతో పూర్తిగా జట్టుకు దూరమయ్యాడు. అతను టీమ్ ఇండియా తరఫున ఆడక కొన్ని నెలలు గడిచిపోతుంది. ఇక ఐపీఎల్ లోను పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ఇక మైదానం బయట వివాదాలు తోను ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాడు.


 అయితే తన కెరియర్ను మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చుకొని టీమ్ ఇండియా లోకి తిరిగి రావాలని ఆశతో పృథ్వి షా ఇప్పుడు ఇంగ్లాండ్ కౌంటింగ్ క్రికెట్ లో అడుగుపెట్టి అక్కడ ఆడుతున్నాడు. అయితే అక్కడ కూడా షా ఆరంభం అంతగా రాణించకపోవడంతో.. అరంగేట్రం మ్యాచ్లో భారీ ఇన్నింగ్స్ ఆడలేక చివరికి విచిత్రమైన రీతిలో out అయ్యాడు. ఇంగ్లాండ్ కౌంటిలలో నార్తంప్తన్ షైర్ క్లబ్లో భాగమయ్యాడు. ప్రస్తుతం ఈ జట్టు కోసం ఓడిఐ టోర్నమెంట్, టి20 బ్లాస్ట్ లో కొన్ని మ్యాచ్లు ఆడటం కోసం  ఇంగ్లాండు గడ్డపై అడుగు పెట్టాడు. ఇటీవల నార్తామ్టాన్  వన్డే కప్పులో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో షా ఇంగ్లీష్ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు.



 ఇక అతను ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ముందు 279 పరుగుల లక్ష్యం ఉంది.  కాగా పృథ్వి షా తన జట్టుకు ఓపెనింగ్ చేశాడు. ఆరంభం నుంచి నార్థాంప్థన్  వికెట్లు పడటం ప్రారంభించిన.. మరో ఎండ్ లో పృథ్వి షా నిలదొక్కుకున్నట్లుగానే కనిపించాడు. అంతలోనే అతని వికెట్ అద్భుతమైన బంతికి పడిపోయింది. నెదర్లాండ్స్ బౌలర్ పాల్ వాల్ 16 ఓవర్లో బౌన్సర్ వేశాడు.   దానిని షా కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ ఫలితం లేకపోవడంతోక్రీజు లో పడిపోయాడు. ఈ క్రమంలో కాలు వికెట్లకి  తగిలింది. బేయిల్స్ కింద పడిపోయాయి. దీంతో షా ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు ప్రాక్టీస్ లో మాత్రం అతను తెగ అదరగొట్టాడు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏడాదికి నాలుగు సినిమాలతో మల్లారెడ్డి చిత్రాలు నిర్మాణం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>