MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movieb54c4661-1913-4ee4-bb3b-7d408ca4ed24-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movieb54c4661-1913-4ee4-bb3b-7d408ca4ed24-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన క్రేజ్ గురించి పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముద్దుగా అభిమానులు తలైవా అంటూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే రజనీకాంత్ సినిమాలు గత కొన్నేళ్లుగా వరుసగా డిజాస్టర్లు అవుతూనే ఉన్నాయి. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటించడం జరిగింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల అవ్వగా ప్రేక్షకులను బాగాJAILER;MOVIE{#}Dilip Kumar;Kumaar;Remake;Hollywood;Rajani kanth;CBN;Kannada;tamannaah bhatia;ramya krishnan;Indian;Hero;Heroine;News;Director;Cinemaజైలర్: ఇదే జరిగితే రజినీకాంత్ ఫ్యాన్స్ కి పండగే..!!జైలర్: ఇదే జరిగితే రజినీకాంత్ ఫ్యాన్స్ కి పండగే..!!JAILER;MOVIE{#}Dilip Kumar;Kumaar;Remake;Hollywood;Rajani kanth;CBN;Kannada;tamannaah bhatia;ramya krishnan;Indian;Hero;Heroine;News;Director;CinemaSat, 05 Aug 2023 07:30:00 GMTప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన క్రేజ్ గురించి పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ముద్దుగా అభిమానులు తలైవా అంటూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే రజనీకాంత్ సినిమాలు గత కొన్నేళ్లుగా వరుసగా డిజాస్టర్లు అవుతూనే ఉన్నాయి. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు తాజాగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమాలో నటించడం జరిగింది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల అవ్వగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.


సన్ పిక్చర్ బ్యానర్ పైన ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే జైలర్ సినిమా ఒక హాలీవుడ్ సినిమాకు రీమేక్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. జైలర్ చిత్రంలో హీరోయిన్ గా తమన్నా నటిస్తోంది. ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం వేగవంతంగా చేస్తున్నారు. ఇందులో మలయాళం స్టార్ హీరో మోహన్లాల్ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అతిధి పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే రమ్యకృష్ణ ,యోగి బాబు తదితరులు సైతం కీలకమైన పాత్రలు నటిస్తున్నట్లు తెలుస్తోంది.


జైలర్ చిత్రంలో రజనీకాంత్ స్టైల్ డైలాగులు సైతం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇక జైలర్ సినిమా ఈ ఏడాది ప్రీమియర్లలో ఉత్తమ అమెరికాలో ఒక మిలియన్ డాలర్ మార్క్ ను దాటుతున్న మొదటి సౌత్ ఇండియన్ చిత్రంగా పేరు సంపాదించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే రజనీకాంత్ క్రేజ్ మళ్లీ డబుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి జైలర్ సినిమాతో ఈసారి అభిమానులను ఏ విధంగా మెప్పిస్తారో చూడాలి మరి. జైలర్ సినిమా అయిపోయిన తర్వాత డైరెక్టర్ లోకేష్ కనకరాజు తో తదుపరి చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు పింకీ.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి మరో ట్రాన్స్ జెండర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>