PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-rayalaseema-vizageba5d873-d15b-486a-a941-540d59f14968-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/janasena-pawan-rayalaseema-vizageba5d873-d15b-486a-a941-540d59f14968-415x250-IndiaHerald.jpgతీరాచూస్తే అనంతపురం నుండి యాత్ర ఉత్తరాంధ్రకు షిఫ్టయిపోయింది. అంటే రాయలసీమను పవన్ వీలైనంతగా ఎవాయిడ్ చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఎందుకంటే రాయలసీమలో ఎంత తిరిగినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్దమైనట్లుంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో ఇపుడు 49 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇంతబలంగా ఉన్న వైసీపీని రాయలసీమలో ఓడించటం సాధ్యంకాదని పవన్ కు అర్ధమయ్యుండాలి. janasena pawan rayalaseema vizag{#}Vijayanagaram;Srikakulam;Ananthapuram;East Godavari;Vishakapatnam;Vizianagaram;YCP;Tirupati;Rayalaseema;Janasena;Yatra;Party;Reddyరాయలసీమ : పవన్ ఈ సీట్లను వదులుకున్నట్లేనా ?రాయలసీమ : పవన్ ఈ సీట్లను వదులుకున్నట్లేనా ?janasena pawan rayalaseema vizag{#}Vijayanagaram;Srikakulam;Ananthapuram;East Godavari;Vishakapatnam;Vizianagaram;YCP;Tirupati;Rayalaseema;Janasena;Yatra;Party;ReddySat, 05 Aug 2023 03:00:00 GMT


జనసేన అధినేత మూడోవిడత వారాహియాత్రను ఉత్తరాంధ్రలో మొదలుపెడుతున్నారు. ఈనెల 10వ తేదీన విశాఖపట్నంలో యాత్ర మొదలవ్వబోతోంది. ముందు విశాఖ జిల్లా తర్వాత విజయనగరం జిల్లాలో యాత్ర చేస్తారు. చివరగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించటంతో  వారాహియాత్ర ముగుస్తుంది. ఉత్తరాధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల్లో ఎన్నిచోట్ల యాత్ర చేయబోతున్నారనే విషయాన్ని డీటైల్డ్ గా జనసేన ప్రకటించలేదు. 10వ తేదీన మొదలవ్వబోయే యాత్ర తొమ్మిది రోజులు జరిగి 19వ తేదీన ముగుస్తుంది.





మూడో విడత యాత్రతో ఏమి అర్ధమవుతోందంటే రాయలసీమ మీద పవన్ నమ్మకం వదిలేసుకున్నట్లే అని. ఎందుకంటే వారాహియాత్రను తాను తిరుపతి నుండే మొదలుపెట్టబోతున్నట్లు స్వయంగా పవనే ప్రకటించారు. ముందుగా చెప్పినట్లు యాత్ర తిరుపతి నుండి కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో మొదలుపెట్టారు. రెండు విడతల్లో ఉభయగోదావరి జిల్లాల్లో యాత్ర ముగియగానే తదుపరి యాత్ర రాయలసీమలోని అనంతపురం జిల్లాలో మొదలవ్వబోతోందని పార్టీ నేతలు చెప్పారు.





తీరాచూస్తే అనంతపురం నుండి యాత్ర ఉత్తరాంధ్రకు షిఫ్టయిపోయింది. అంటే రాయలసీమను పవన్ వీలైనంతగా ఎవాయిడ్ చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఎందుకంటే రాయలసీమలో ఎంత తిరిగినా ఎలాంటి ఉపయోగం ఉండదని అర్దమైనట్లుంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 52 నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో ఇపుడు 49 నియోజకవర్గాలు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇంతబలంగా ఉన్న వైసీపీని రాయలసీమలో ఓడించటం సాధ్యంకాదని పవన్ కు అర్ధమయ్యుండాలి.





లేదా జనసేన రాయలసీమలో చాలా బలహీనంగా ఉందన్న విషయమైనా తెలుసుకునుండాలి. రాయలసీమలో వైసీపీ దెబ్బకు టీడీపీనే తుడిచిపెట్టుకునిపోయింది. టీడీపీనే తట్టుకోలేకపోతే ఇక జనసేన ఏమి తట్టుకుంటుంది. పైగా రాయలసీమలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. రెడ్లలో మెజారిటి సెక్షన్ వైసీపీకే మద్దతుగా నిలబడున్నారు. నిజానికి రాయలసీమలో బలిజ(కాపు)ల ఓట్లు కూడా ఎక్కువగానే ఉంది. అయితే రాజకీయ ఆధిపత్యం ఎక్కువగా రెడ్లు లేదా బీసీల చేతిల్లోనే ఉంది. అందుకనే పై రెండు సామాజికవర్గాలను ఢీ కొనటం కష్టమన్న భావనతోనే పవన్ రాయలసీమను వదిలిపెట్టి ఉత్తరాంధ్రపైన దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అప్పుడు పింకీ.. ఇప్పుడు బిగ్ బాస్ లోకి మరో ట్రాన్స్ జెండర్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>