Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/abbascf24583e-6dd7-4404-910e-43b647ec37c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/abbascf24583e-6dd7-4404-910e-43b647ec37c7-415x250-IndiaHerald.jpgహీరో అబ్బాస్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. నేటితనం ప్రేక్షకులందరికీ కూడా ఇతను సుపరిచితుడే. ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపును సంపాదించుకుని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు అబ్బాస్. ఇప్పుడు అంటే సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం అబ్బాస్ సినిమాలో కనిపించాడు అంటే చాలు అమ్మాయిలు పడి చచ్చిపోయేవారు. ఇక ఆ సినిమాను ఒకటికి రెండు సార్లు చూసేవారు. ఇక అప్పట్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అబ్బాస్ ఎంతగానో మెప్పించాడు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రAbbas{#}abbas;Loverఆ యాడ్లో నటించడంతో.. నన్ను ఎంతో ట్రోల్ చేశారు : అబ్బాస్ఆ యాడ్లో నటించడంతో.. నన్ను ఎంతో ట్రోల్ చేశారు : అబ్బాస్Abbas{#}abbas;LoverSat, 05 Aug 2023 10:15:00 GMTహీరో అబ్బాస్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. నేటితనం ప్రేక్షకులందరికీ కూడా ఇతను సుపరిచితుడే. ఒకప్పుడు ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా గుర్తింపును సంపాదించుకుని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు అబ్బాస్. ఇప్పుడు అంటే సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఒకప్పుడు మాత్రం అబ్బాస్ సినిమాలో కనిపించాడు అంటే చాలు అమ్మాయిలు పడి చచ్చిపోయేవారు. ఇక ఆ సినిమాను ఒకటికి రెండు సార్లు చూసేవారు. ఇక అప్పట్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అబ్బాస్ ఎంతగానో  మెప్పించాడు.


 కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం అవకాశాలు లేక అతను ఇండస్ట్రీలో కనుమరుగైపోయాడు అని చెప్పాలి. అయితే ఇక ఇండస్ట్రీలో నటుడిగా కనుమరుగైనప్పటికీ ఒక ప్రకటన ద్వారా మాత్రం ఎప్పుడు సోషల్ మీడియాలో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉండేవాడు. ఆ యాడ్ ఏదో కాదు హార్పిక్ ప్రకటన. బాత్రూంలను క్లీన్ చేస్తే లిక్విడ్ హార్పిక్ ప్రకటనలో నటించడం ద్వారా కూడా అబ్బాస్ బాగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ వాణిజ్య ప్రకటనపై ఎన్నో ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో వచ్చేవి అని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి ఇటీవల అబ్బాస్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 టాయిలెట్ క్లీనర్ యాడ్ లో నటించడం వల్ల తనను ఎంతో మంది విపరీతంగా ట్రోల్ చేసేవారు అంటూ అబ్బాస్ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా తనపై వచ్చిన ట్రోల్స్ తనను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు అంటూ తెలిపాడు. ఇక విమర్శలకు తాను ఎప్పుడు భయపడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. పరిశుభ్రత విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఆ వాణిజ్య ప్రకటనలో నటించాను అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. కాగా 2015లో సినిమాలకు దూరమైన అబ్బాస్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే బాగుండు అని ఆటో అభిమానులు కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏడాదికి నాలుగు సినిమాలతో మల్లారెడ్డి చిత్రాలు నిర్మాణం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>