MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7024bb04-1023-4a2c-9b50-13245d7e3c3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas7024bb04-1023-4a2c-9b50-13245d7e3c3c-415x250-IndiaHerald.jpg‘ఆదిపురుష్’ విడుదల కాకుండానే ప్రభాస్ అమెరికా వెళ్ళిపోయాడు. ఆసినిమా పరాజయం తరువాత 50 రోజుల తరువాత మాత్రమే ప్రభాస్ అమెరికా నుండి తిరిగి వచ్చాడు. అయితే ఇన్ని రోజులు ప్రభాస్ అమెరికాలో ఎందుకు ఉన్నాడు అన్న విషయమై ఎవరికీ క్లారిటీ లేదు. ఈమధ్యనే ప్రభాస్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత అతడు ‘ప్రాజెక్ట్ కె’ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని చాలామంది భావించారు. అయితే అందరి ఊహలకు భిన్నంగా ప్రభాస్ తన డేట్స్ మారుతి సినిమాకు ఇచ్చి ఆసినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయడానికి తన సహకారం ఇస్తున్నట్లు వార్తలు వస్PRABHAS{#}maruti;nag ashwin;Graphics;Athadu;Prabhas;media;Telugu;Makar Sakranti;Cinema;Newsప్రభాస్ వ్యూహాలలో మార్పులు జోష్ లో మారుతి !ప్రభాస్ వ్యూహాలలో మార్పులు జోష్ లో మారుతి !PRABHAS{#}maruti;nag ashwin;Graphics;Athadu;Prabhas;media;Telugu;Makar Sakranti;Cinema;NewsSat, 05 Aug 2023 13:21:09 GMT‘ఆదిపురుష్’ విడుదల కాకుండానే ప్రభాస్ అమెరికా వెళ్ళిపోయాడు. ఆసినిమా పరాజయం తరువాత 50 రోజుల తరువాత మాత్రమే ప్రభాస్ అమెరికా నుండి తిరిగి వచ్చాడు. అయితే ఇన్ని రోజులు ప్రభాస్ అమెరికాలో ఎందుకు ఉన్నాడు అన్న విషయమై ఎవరికీ క్లారిటీ లేదు. ఈమధ్యనే ప్రభాస్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తరువాత అతడు ‘ప్రాజెక్ట్ కె’ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని చాలామంది భావించారు.



అయితే అందరి ఊహలకు భిన్నంగా ప్రభాస్ తన డేట్స్ మారుతి సినిమాకు ఇచ్చి ఆసినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయడానికి తన సహకారం ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న మూవీ ఒక హారర్ కామెడీ. ఈమూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తోంది.



ప్రభాస్ తో ఈ సంస్థకు ఉన్న సాన్నిహిత్యంతో ‘ఆదిపురుష్’ మూవీ రైట్స్ ను ఈ సంస్థ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భారీ మొత్తానికి తీసుకుంది అన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ మూవీ ఘోర పరాజయం చెందడంతో ఈ నిర్మాణ సంస్థకు బాగా నష్టాలు వచ్చాయి అని కూడ కొందరు అంటారు. దీనితో ప్రభాస్ పీపుల్స్ మీడియా సంస్థకు చేయూతను ఇవ్వడానికి ముందుగా మారుతి సినిమాను వేగం పెంచి వీలైతే ఈ సినిమాను త్వరలో విడుదల చేసే విధంగా పక్కా ప్లాన్ లో ఉన్నట్లు సమాచారం.



వాస్తవానికి ‘ ప్రాజెక్ట్ కె’ మూవీ వచ్చే సంవత్సరం విడుదలకావలసి ఉన్నప్పటికీ ఈసినిమా గ్రాఫిక్స్ వర్క్స్ లో చాల ఆలస్యం జరుగుతున్న నేపధ్యంలో ఈమూవీని సంక్రాంతి రేస్ నుండి తప్పించి సమ్మర్ లో ‘ప్రాజెక్ట్ కె’ ను విడుదల చేయాలని నాగ్ అశ్విన్ ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ప్రభాస్ మారుతి దర్శకత్వంలో తాను నటిస్తున్న ‘రాజా డీలక్స్’ మూవీని త్వరగా పూర్తి చేసి ఏమాత్రం అవకాశం ఉన్నా సంక్రాంతి రేస్ లో నిలబెట్టాలని ఆలోచనలతో ఈ మూవీని ముందుకు తెచ్చినట్లు తెలుస్తోంది..    



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏడాదికి నాలుగు సినిమాలతో మల్లారెడ్డి చిత్రాలు నిర్మాణం..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>